Ms Dhoni On Bangladesh: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ( Mahendra Singh Dhoni) చాణక్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన మైండ్ సెట్ తో టీమ్ ఇండియన్ ఎన్నో మ్యాచ్ లలో గెలిపించాడు. స్టంపింగ్స్, రన్ అవుట్ల నుంచి మొదలుకొని.. బౌలర్ ను చేంజ్ చేసే వరకు ఆయన ఓ అద్భుతం. రోహిత్ శర్మ ఇలాంటి మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ను… ఓపెనర్ గా దింపి సక్సెస్ అయ్యాడు ధోని. అలా టీమిండియాకు ఎన్నో సేవలు అందించిన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ( Mahendra Singh Dhoni) గురించి తాజాగావో షాకింగ్ న్యూస్ వైరల్ గా మారింది. బెంగాల్ భాష రాదని… బంగ్లాదేశ్ లాంటి పసికూన జట్టును దెబ్బ కొట్టాడు మహేంద్రడు. ఈ సంఘటనకు సంబంధించిన న్యూస్ ఇప్పుడు టాపిక్ అయింది.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ( Mahendra Singh Dhoni) ఆధ్వర్యంలో గతంలో బంగ్లాదేశ్ తో కీలక మ్యాచ్ ఆడింది టీం ఇండియా. అయితే ఇందులో మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ చేస్తున్నప్పుడు.. బంగ్లాదేశ్ వికెట్ కీపర్ ధోనిని బోల్తా కొట్టించే ప్రయత్నం చేశాడు. జార్ఖండ్ నుంచి ధోని వచ్చాడని.. అతడికి బెంగాల్ భాష రాదని అనుకున్నాడు. బంగ్లాదేశ్ లో కూడా బెంగాలీ మాట్లాడతాడు అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ధోనిని అవుట్ చేసేందుకు బెంగాలీలోనే తమ బౌలర్ కు వ్యూహాన్ని అరిచి చెప్పేశాడు బంగ్లాదేశ్ వికెట్ కీపర్. అయితే వాళ్లంతా మాట్లాడుకునేది… భాష రాని వాడిలాగా ఎంతో కూల్ గా విన్నాడు ధోని.
అక్కడే ధోని చాణక్యం పని చేసింది. ప్లాన్ ప్రకారం బంగ్లా బౌలర్లు బౌలింగ్ చేస్తున్న క్రమంలో… మహేంద్ర సింగ్ ధోని బౌండరీలు అలాగే సిక్సర్లను సాధించి మ్యాచ్ గెలిపించాడు. దీంతో టీమిండియా కు బిగ్ రిలీఫ్ దక్కింది. అయితే మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత వెళ్లి ఒరేయ్ దద్దమ్మ నాకు బెంగాలీ భాష అర్థమవుతుంది అని నేరుగా బెంగాలీ లోనే చెప్పేశాడు. దీంతో కంగుతిన్న బంగ్లాదేశ్ ఆటగాళ్లు.. మేమే దద్దమ్మలం అంటూ తలలు పట్టుకున్నారు. ఇది ఇలా ఉండగా, ఇదే మ్యాచ్ లో ముస్తాఫిజుర్ రెహ్మన్ ను కూడా గట్టిగా ఢీ కొట్టాడు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ( Mahendra Singh Dhoni). ఈ సంఘటన అప్పట్లో హాట్ టాపిక్ అయింది.