E-Paper
Advertisement

Dharmastala Niyojakavargam Movie Review : ‘ధర్మస్థల నియోజకవర్గం’ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

Dharmastala Niyojakavargam Movie Review : ‘ధర్మస్థల నియోజకవర్గం’ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?
Advertisement

Dharmastala Niyojakavargam Movie Review : డ్రగ్స్ మాఫియా, విద్యార్థుల ఆక్రోశం, ఓ సామాన్యుడి పొలిటికల్ పోరాటం కలగలిపిన కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’. సీనియర్ నటులు సుమన్, సాయికుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ పొలిటికల్ డ్రామా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో చూద్దాం

కథా నేపథ్యం :- 

ధర్మస్థల నియోజకవర్గంలో తిరుగులేని ఆధిక్యంతో ఏడుసార్లు ఎమ్మెల్యేగా చక్రం తిప్పుతుంటాడు బైర్రాజు (సాయికుమార్). మరోవైపు అదే ప్రాంతంలో వాసుదేవ్ (రాజీవ్ కనకాల), ఆయన భార్య (కస్తూరి) ఓ విద్యాసంస్థను నడుపుతూ గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ దందా సాగిస్తుంటారు. క్యాంపస్‌లో విద్యార్థులకు విశ్వ (శివకుమార్) ద్వారా మత్తు పదార్థాలు అలవాటు చేసి సొమ్ము చేసుకుంటుంటారు. ఈ దారుణాన్ని గుర్తించిన లెక్చరర్ అరుంధతి (వితిక షేరు), విద్యార్థులు బద్రి (నటరాజ్), ఈషా (రాయంచ కొక్కుర) కలిసి అడ్డుకునే ప్రయత్నం చేస్తారు.

Advertisement

ఈ క్రమంలో బద్రి దారుణ హత్యకు గురవుతాడు. స్థానిక ఎమ్మెల్యే అండతోనే ఇదంతా జరిగిందని తెలుసుకున్న బద్రి తండ్రి, సామాన్య టీ కొట్టు యజమాని ఈశ్వరయ్య (సుమన్) ఆగ్రహంతో రగిలిపోతాడు. విద్యార్థుల అండతో ఎమ్మెల్యే బైర్రాజుపై నేరుగా ఎన్నికల బరిలోకి దిగుతాడు. అంగబలం, అర్థబలం ఉన్న ఒక రాజకీయ ఉద్దండుడిని ఓ సామాన్యుడు ఎలా ఢీకొన్నాడు? తన కొడుకు చావుకు ఎలా న్యాయం సాధించాడు? అన్నదే మిగతా చిత్రం.

సినిమా విశ్లేషణ :- 

సమాజాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్ సమస్యను ఓటు విలువ, ప్రజాస్వామ్య వ్యవస్థతో ముడిపెట్టి దర్శకుడు జై జ్ఞాన ప్రభ తోట కథను తయారు చేసుకున్నారు.

Advertisement

ఫస్టాఫ్: క్యాంపస్ నేపధ్యం, డ్రగ్స్ బారిన పడి బలవుతున్న విద్యార్థుల దుస్థితితో సాగుతుంది. ప్రథమార్ధం అక్కడక్కడా కాస్త రొటీన్ ఫార్ములాతో నడిచినా, ఇంటర్వెల్ ముందు వచ్చే కీలక ట్విస్ట్ కథపై ఆసక్తిని పెంచుతుంది.

సెకండాఫ్: సుమన్ రాజకీయ రంగప్రవేశంతో సినిమా పూర్తిగా పొలిటికల్ ట్రాక్ ఎక్కుతుంది. ఉచిత పథకాల మోజు, ఓటు విలువ వంటి సమకాలీన అంశాలపై వచ్చే సంభాషణలు ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్‌లో వరుణ్ సందేశ్ పాత్ర ద్వారా ఇచ్చిన సోషల్ మెసేజ్ ప్రభావవంతంగా ఉంటుంది.

అయితే, ప్రతినాయకుడిపై కథానాయకుడి ఎత్తుగడలు ఇంకాస్త పకడ్బందీగా, లాజిక్‌తో రాసుకుని ఉంటే సినిమా స్థాయి మరింత పెరిగేది.

నటీనటుల ప్రతిభ..

సామాన్య టీ వ్యాపారిగా, కొడుకు న్యాయం కోసం గళమెత్తే తండ్రి ఈశ్వరయ్య పాత్రలో సుమన్ హుందాగా నటించారు. సెకండాఫ్‌లో పొలిటికల్ ప్రసంగాల్లో ఆయన అనుభవం కొట్టొచ్చినట్లు కనిపించింది. బలమైన ప్రత్యర్థిగా బైర్రాజు పాత్రలో సాయికుమార్ తనదైన గాంభీర్యాన్ని ప్రదర్శించారు.

నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో రాజీవ్ కనకాల, కస్తూరి తమ అనుభవంతో మెప్పించారు. లెక్చరర్‌గా వితిక షేరు, యువ నాయకుడిగా నటరాజ్ నటన సహజంగా ఉంది. అతిథి పాత్రలో మెరిసిన వరుణ్ సందేశ్ తన సందేశంతో ఆకట్టుకోగా, రాయంచ కొక్కుర, శివకుమార్, రాజా రవీంద్ర పరిధి మేరకు న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం..

సందర్భానుసారంగా వచ్చిన చంద్రబోస్ సాహిత్యం, సునీత గాత్రం సినిమాకు బలాన్నిచ్చాయి. మహావీర్ ఏలేందర్ నేపథ్య సంగీతం పొలిటికల్ సన్నివేశాలను ఎలివేట్ చేసింది. వెంకట హనుమ సినిమాటోగ్రఫీ పర్వాలేదనిపిస్తుంది. అయితే ఎడిటింగ్ విభాగంలో కొన్ని సాగదీత సన్నివేశాలకు కత్తెర వేయాల్సింది. దర్శకుడు ఎంచుకున్న కథాంశం, ఇచ్చిన సామాజిక సందేశం బాగున్నప్పటికీ, స్క్రీన్‌ప్లేను మరింత గ్రిప్పింగ్‌గా తీర్చిదిద్ది ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమాకు తగినట్లుగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్..

సుమన్, సాయికుమార్ ల నటన

సమాజానికి అవసరమైన డ్రగ్స్ & ఓటు విలువ కాన్సెప్ట్

సెకండాఫ్‌లో వచ్చే కొన్ని పొలిటికల్ డైలాగ్స్

చంద్రబోస్ సాహిత్యం

మైనస్ పాయింట్స్:

ఊహకందే స్క్రీన్‌ప్లే

ఎడిటింగ్‌లో లోపాలు

కొన్ని సన్నివేశాల్లో సినిమాటిక్ లిబర్టీ ఎక్కువగా ఉండటం

చివరి ఆఖరి మాటగా :- 

మంచి సందేశంతో కూడిన పొలిటికల్ యాక్షన్ చిత్రాలను ఇష్టపడే వారు ఈ వారం ‘ధర్మస్థల నియోజకవర్గం’పై ఓ లుక్కేయవచ్చు.

Dharmastala Niyojakavargam Rating : 2.75/5

Related News

Romanchakam Review : ‘రోమాంచకం’.. నవ్వుల ప్రయాణం..

సుమంత్ ప్రభాస్ ‘రోమాంచకం’ ట్విట్టర్ రివ్యూ..

‘కికు చిరంజీవి’ మూవీ రివ్యూ.. గుండె కుడివైపు ఉంటే.. రహస్యం ఎటువైపు దారితీసింది?

టాక్సిక్’ రివ్యూ.. గీత దాటలేదు, కానీ ఓపిక మాత్రం దాటింది!”

ది రెడ్ బ్యాగ్ మూవీ రివ్యూ.. క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా?

అమీర్ లోగ్ మూవీ రివ్యూ.. పాతబస్తీ గల్లీ స్నేహం వర్కౌట్ అయ్యిందా?

రవితేజ ‘ఇరుముడి’ రివ్యూ.. అయ్యప్పమాల కలిసొచ్చిందా?

Big Stories

Advertisement
×