Ambani-Rohit Sharma: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( ICC Men’s T20 World Cup 2026) నిన్న ప్రారంభమైన సంగతి తెలిసిందే. నిన్న ప్రారంభమైన టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ మార్చి 8వ తేదీ వరకు అంటే 30 రోజుల వరకు కొనసాగనుంది. అయితే, నిన్న ఇండియా అలాగే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జట్ల మధ్య ఫైట్ జరిగింది. ఇందులో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జట్టుపైన ఏకంగా 29 పరుగుల తేడాతో విజయం సాధించింది టీమిండియా. అయితే ఈ ప్రారంభ మ్యాచ్ ముంబై వేదికగా జరగడంతో రోహిత్ శర్మ (Rohit Sharma) అటు ముఖేష్ అంబానీ ( Mukesh Ambani), ఐసీసీ బాస్ జై షా ( ICC Jay shah)లాంటి ప్రముఖులందరూ హాజరయ్యారు.
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో ( ICC Men’s T20 World Cup 2026) భాగంగా ముంబై వేదికగా నిన్న యూఎస్ఏ వర్సెస్ టీమ్ ఇండియా ( India vs United States of America ) మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ సందర్భంగా ముఖేష్ అంబానీ, రోహిత్ శర్మ ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు. మ్యాచ్ పూర్తయ్యే వరకు ఈ ఇద్దరు పక్కనే కూర్చుని ఎంజాయ్ చేశారు. అటు ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ కూడా వచ్చారు. ఈ నేపథ్యంలో అంబానీ ఇచ్చిన బంపర్ ఆఫర్ ను రోహిత్ శర్మ రిజెక్ట్ చేశాడు.
వాంఖడే స్టేడియంలో మ్యాచ్ చూస్తూ ముఖేష్ అంబానీ టీ తాగాడు. అటు రోహిత్ శర్మ పక్కనే ఉండడంతో అతనికి కూడా టీ ఇచ్చే ప్రయత్నం చేశాడు ముఖేష్ అంబానీ. అయితే ముఖేష్ అంబానీ లాంటి వాళ్లు టీ ఇస్తే ఎవరైనా తీసుకుంటారు. కానీ ఇలాంటి బంపర్ ఆఫర్ ను రోహిత్ శర్మ వదిలేసుకున్నాడు. ముఖం మీదే ముఖేష్ అంబానీ ఇచ్చిన ఆఫర్ ను రిజెక్ట్ చేశాడు రోహిత్ శర్మ. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. 2027 వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో ఫిట్నెస్ పైన ఫోకస్ చేసిన రోహిత్ శర్మ, అనవసర చెత్త అస్సలు తినడం లేదు, టి అలాగే కాఫీలు ముట్టుకోవడం లేదట. అందుకే అంబానీ ఆఫర్ రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.
2027 వరల్డ్ కప్ కోసం 22 కిలోలు తగ్గిన రోహిత్ శర్మ, నిత్యం డైట్ మెయింటేన్ చేస్తున్నాడు. తనకు చాలా ఇష్టమైన వడాపావ్ కూడా తినడం మానేశాడు. జంక్ ఫుడ్ కాకుండా, మినరల్స్ ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నాడు రోహిత్ శర్మ. అందుకే అంబానీ టీ ఇచ్చినా కూడా తీసుకోలేదట.
Rohit Sharma watching the India vs USA game at the Wankhede alongside the Ambani's 🌟
📸: JioHotstar #INDvsUSA #Wankhede #T20WC2026 #Insidesport #CricketTwitter pic.twitter.com/88rwWh6QUI
— InsideSport (@InsideSportIND) February 7, 2026