E-Paper
Advertisement

Mukul Choudhary: ల‌క్నోలో మ‌రో ధోని, హెలిక్యాప్ట‌ర్ కొట్టి కేకేఆర్ ను చిత్తు చేశాడు..ఎవ‌రీ ముకుల్ చౌదరి

Mukul Choudhary:  ల‌క్నోలో మ‌రో ధోని, హెలిక్యాప్ట‌ర్ కొట్టి కేకేఆర్ ను చిత్తు చేశాడు..ఎవ‌రీ ముకుల్ చౌదరి
Advertisement

Mukul Choudhary:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో ఒక్కో మ్యాచ్ ఒక్కో రేంజ్ లో జరుగుతోంది. ప్రతి ఐపీఎల్ మ్యాచ్ కూడా చివరి బంతి వరకు కొనసాగుతోంది. వన్ సైడ్ మ్యాచులు అస్సలు జరగడం లేదు. ఇక గురువారం కూడా కేకేఆర్ వర్సెస్ లక్నో సూప‌ర్ జెయింట్స్ ( Kolkata Knight Riders vs Lucknow Super Giants, 15th Match) మధ్య జరిగిన మ్యాచ్ చివరి వరకు సాగింది. అయితే చివరలో లక్నో డేంజర్ ఆటగాడు ముకుల్ చౌదరి ( Mukul Choudhary ) 7 సిక్సర్లు అలాగే రెండు బౌండరీలతో ఇరగదీశాడు. ఈ క్రమంలో కేకేఆర్ పై మూడు వికెట్ల తేడాతో చివరి బంతికి విజయం సాధించింది లక్నో. దీంతో లక్నో శిబిరంలో సంబరాలు అంబరాన్ని అంటాయి.

Also Read: Tanveer Ahmed: వైభ‌వ్ ప‌చ్చి మోస‌గాడు…వాడి ఏజ్ ఒక్క‌టే కాదు, బ్యాట్లు కూడా చెక్ చేయాల్సిందే

ముకుల్ చౌదరి అదిరిపోయే ఇన్నింగ్స్.. లక్నో విజయం

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో కేకేఆర్ వర్సెస్ లక్నో సూపర్ జెంట్స్ జట్ల మధ్య 15వ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ ( Eden Gardens, Kolkata ) వేదికగా నిర్వహించారు. ఇందులో కేకేఆర్ మొదట బ్యాటింగ్ చేసి 181 పరుగులు సాధించింది. మరోసారి ఫిన్ అలెన్ విఫలమైనప్పటికీ మిగిలిన ప్లేయర్లు భారీ స్కోర్ చేయగలిగారు. అయితే 182 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో లక్నో చివరి వరకు పోరాడాల్సి వచ్చింది. చివరి బంతికి విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఆయుష్ బదోని మిడిల్ ఆర్డర్ లో 54 పరుగులతో రాణించగా చివరలో ముకుల్ చౌదరి 54 పరుగులతో చుక్కలు చూపించాడు. 200 స్ట్రైక్ రేటుతో 7 సిక్సర్లు అలాగే రెండు బౌండరీలు కొట్టాడు. ఈ క్రమంలో 27 బంతులు ఎదుర్కొన్న ముకుల్ చౌదరి 54 పరుగులతో రఫ్పాడించాడు. ఈ క్రమంలో లక్నో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో అచ్చం మ‌హేంద్ర సింగ్ ధోనిలాగే సిక్సులు కొట్టాడు ముకుల్. హెలిక్యాప్ట‌ర్ షాట్స్ ఆడి అంద‌రినీ ఆక‌ట్టుకున్నాడు. దీంతో మ‌రో ధోని వ‌చ్చేశాడ‌ని అంటున్నారు.

ఇంతకు ఎవరీ ముకుల్ చౌదరి?

2024 ఆగస్టు ఆరవ తేదీన రాజస్థాన్ లోని ఝున్‌ఝును జిల్లాలో ముకుల్ చౌదరి జన్మించాడు. ఓ టీచర్ కుటుంబానికి సంబంధించిన ముకుల్ చౌదరి, తండ్రి కోరిక మేరకు క్రికెట్ లో అడుగు పెట్టాడు. ఈ క్రమంలోనే రాజస్థాన్ తరఫున డొమెస్టిక్ క్రికెట్ ఆడి 2023లో చత్తీస్గఢ్ లో జరిగిన మ్యాచ్ లో ఫస్ట్ క్లాస్ అరంగేట్రం కూడా చేసేసాడు చౌద‌రి. ఇక ఇటీవ‌లే ముస్తాక్ అలీ ట్రోఫీ జ‌రిగింది. ఇందులో ముంబై పైన 28 బంతుల్లో 54 పరుగులు చేసి అందరిని ఆకట్టుకున్నాడు ముకుల్. ఈ క్రమంలోనే ఐపిఎల్ 2026 మినీ వేలంలో ముకుల్ చౌదరిని లక్నో రూ. 2.60 కోట్లకు కొనుగోలు చేయడం జరిగింది.

Advertisement

Also Read: Virender Sehwag: రాసిపెట్టుకోండి…బుమ్రా బౌలింగ్ లో వైభ‌వ్ 6 బంతుల్లో ఆరు సిక్స‌రు కొడ‌తాడు

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×