Decoit Review: అడివి శేష్ సినిమా వస్తుందంటే ఆడియన్స్ తో పాటు బయ్యర్స్ కి కూడా కొన్ని అంచనాలు ఉంటాయి. ‘డెకాయిట్’ పై కూడా ఆ అంచనాలు ఉన్నాయి. మరి వాటిని ఈ సినిమా మ్యాచ్ చేసిందో లేదో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి.
కథ : హరిదాస్(అడివి శేష్) హిందూపురంకి చెందిన వ్యక్తి. అదే ఊర్లో అద్దాల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటాడు.అతని మల్లి(కామాక్షి భాస్కర్ల) ఇంట్లో అద్దెకు ఉంటాడు.హరి తన పుట్టినరోజు నాడు బ్లడ్ డొనేట్ చేయడానికి వెళితే అక్కడ సరస్వతి(మృణాల్ ఠాకూర్) పరిచయం అవుతుంది.కొద్దిరోజులకే ఇద్దరూ ప్రేమలో పడతారు. కానీ ఇతని ప్రేమ వ్యవహారం సరస్వతి అన్నకి తెలిసిపోతుంది. హరి దిగువ కులానికి చెందినవాడు అని భావించి.. అతని చెల్లి నుండి దూరం చేసేందుకు ఓ ఘోరానికి పాల్పడతాడు. అదేంటి? ఆ ఘోరం వల్లే హరి.. అతన్ని చితకబాది చంపేస్తాడు. తన అన్నని చంపేశాడు అనే కారణంతో హరిని జైలుకు పంపిస్తుంది సరస్వతి. తర్వాత ఆమె వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. ఓ పాపకు జన్మనిస్తుంది కూడా. కానీ ఆమె భర్తకు హార్ట్ సమస్య ఉంటుంది. అందుకు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. మరోవైపు హరి జైలు నుండి ఎస్కేప్ అవుతాడు. తన జీవితాన్ని నాశనం చేసిన సరస్వతి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తాడు. కానీ ఆమె పడుతున్న కష్టాలు చూసి దేవుడే ఆమెకు పెద్ద శిక్ష వేశాడు అని అనుకుంటాడు. ఈ క్రమంలో సరస్వతికి హెల్ప్ చేస్తున్నట్టు దగ్గరయ్యి ఆమెను జైలు పాలు చేయాలని చూస్తాడు. అందుకు హరి ఏం చేశాడు? తర్వాత సరస్వతి జీవితం ఏమైంది? ఈ ప్రశ్నలకి సమాధానమే మిగిలిన సినిమా.
విశ్లేషణ : అడివి శేష్ సినిమా అంటే ఆడియన్స్ గుడ్డి నమ్మకంతో థియేటర్ కి టికెట్ కొనుక్కుని కూర్చుంటాడు. గత 6 సినిమాలుగా అతను క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. ‘డెకాయిట్’ ప్రమోషనల్ కంటెంట్ కూడా అవే హోప్స్ ని ఇచ్చింది. కానీ సినిమా స్టార్టింగ్ నుండే ‘ఏదో తేడాగా ఉంది శీనా’ అంటూ ‘దుబాయ్ శీను’ లో వేణు మాధవ్ స్టైల్లో అనుకుంటాం. తర్వాత పడుతూ లేస్తూ సినిమా సాగుతుంది. శేష్ సినిమాల్లో ఇంటర్వెల్ సీక్వెన్స్ అదిరిపోతోంది. కానీ ‘డెకాయిట్’ లో అది మిస్ అయ్యింది. సెకండాఫ్ లో ఏమైనా మెరుపులు ఉంటాయేమో అనుకుంటే.. అవి కూడా ఎక్కువగా లేవు. క్లైమాక్స్ లో ట్రాజెడీని పెట్టి ఆడియన్స్ కి కొత్త ఫీల్ ఇవ్వాలి అనుకున్నాడు దర్శకుడు. కానీ చిత్ర బృందంపైనే జాలి చూపించేంత దయనీయంగా అనిపిస్తుంది ఆ క్లైమాక్స్. ‘ప్రేయసి రావే’ వంటి క్లాసిక్ సినిమాని అడివి శేష్ స్టైల్లో చెబితే ‘డెకాయిట్’ అయిందేమో అనిపిస్తుంది. సినిమా ప్రమోషన్స్ కి వాడిన సాంగ్స్ రెండూ ఫస్ట్ హాలోని ఫస్ట్ హాఫ్ కే అయిపోతాయి. తర్వాత హై మూమెంట్స్ కోసం వెతుక్కుంటూ ఉండాలి. శేష్ సినిమాల్లో ఇంత వీక్ రైటింగ్ ఈ సినిమాలోనే కనబడింది. దర్శకుడు షామిలి డియో కథని ఆసక్తిగా నడపలేకపోయాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఇంపాక్ట్ చూపలేదు. డైలాగ్స్ కూడా కొన్ని సరిగ్గా అర్థం కాకుండా ఉంటాయి.
నటీనటుల విషయానికి వస్తే.. అడివి శేష్ బాగానే చేశాడు. కానీ అతని పెర్ఫార్మన్స్ చాలా వరకు పోకిరిలో మహేష్ బాబులా ఉంటుంది. డైలాగ్ డెలివరీ ‘గుంటూరు కారం’ లో మహేష్ బాబుని తలపిస్తుంది. మృణాల్ ఠాకూర్ లుక్స్ కి పేరు పెట్టాల్సిన పనిలేదు. ఈ సినిమాలో చాలా సన్నగా కనిపించింది. కానీ ఎమోషనల్ సీక్వెన్స్ లో ఎబ్బెట్టుగా కనిపించింది. అనురాగ్ కశ్యప్ కి ఓ రేంజ్లో ఎలివేషన్ ఇచ్చారు. కానీ తర్వాత ఆ పాత్రలో ఉన్న వేడి చల్లబడిపోయింది. సునీల్, ప్రకాష్ రాజ్ ఎందుకు ఉన్నారో వాళ్ళకే తెలియాలి. కామాక్షి భాస్కర్ల రేప్ సీన్లకి, ఇంటిమేట్ సీన్లకి కేరాఫ్ అడ్రెస్. ఆ ఇమేజ్ ను ఈ సినిమాతో కూడా కొనసాగించింది అని చెప్పాలి.
ప్లస్ పాయింట్స్ :
అడివి శేష్
ఫస్ట్ హాఫ్
2 పాటలు
మైనస్ పాయింట్స్ :
కథనంలో వేగం లేకపోవడం
ఇంటర్వెల్
సెకండాఫ్
మొత్తంగా ‘డెకాయిట్’ అంచనాలు మ్యాచ్ చేయడంలో విఫలమైంది. శేష్ సినిమాల్లో ఆశించే ఎలిమెంట్స్ ఇందులో మిస్ అయ్యాయి. ఒకవేళ శేష్ గత సినిమాలు చూడని వాళ్లకి అయితే ఇది యావరేజ్