E-Paper
Advertisement

Kohli-Charter Flight: 3 రోజులకోసారి లండ‌న్ పోతా..చార్టెడ్ ఫ్లైట్ కొనివ్వండి, RCBని టార్చ‌ర్ చేస్తోన్న విరాట్ కోహ్లీ

Kohli-Charter Flight: 3 రోజులకోసారి లండ‌న్ పోతా..చార్టెడ్ ఫ్లైట్ కొనివ్వండి,  RCBని టార్చ‌ర్ చేస్తోన్న విరాట్ కోహ్లీ
Advertisement

Kohli-Charter Flight:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) ప్రారంభానికి సమయం దగ్గర పడింది. మరో వారం రోజుల్లోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్ మార్చి 28వ తేదీ నుంచి దాదాపు రెండు నెలలపాటు కొనసాగుతుంది. అంటే ఈ టోర్నమెంట్ ముగియాలంటే జూన్ మొదటి వారం రావాల్సిందే. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చకచగా జరుగుతున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య తొలి మ్యాచ్ ఉండనుంది. ఈ మ్యాచ్ చిన్న స్వామి స్టేడియం వేదికగా జరగనుంది. ఇలాంటి నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( RCB) యాజమాన్యాన్ని విరాట్ కోహ్లీ టార్చర్ పెడుతున్నాడని వార్తలు వస్తున్నాయి. తనకు చార్టెడ్ ఫ్లైట్ ( chartered flight ) కొని ఇవ్వాలని అడుగుతున్నాడట విరాట్ కోహ్లీ (Virat kohli). ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.

Also Read: Tanveer Ahmed: PSL జోక‌ర్ లీగ్ అయిపోయింది..ఐపీఎల్ కోసం డ్రామాలు ఆడే దుర్మార్గుల‌పై 3 ఏళ్ల బ్యాన్ వేయాల్సిందే

నాకు చార్టెడ్ ఫ్లైట్ కొనివ్వండి.. టార్చర్ పెడుతున్న విరాట్ కోహ్లీ

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ప్రారంభాని కంటే ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యాన్ని విరాట్ కోహ్లీ టార్చర్ పెడుతున్నట్లు పోస్ట్ వైర‌ల్ గా మారింది. తనకు చార్టెడ్ ఫ్లైట్ కొనివ్వండి అంటూ యాజమాన్యాన్ని ఇప్పటికే విరాట్ కోహ్లీ కోరినట్లు తెలుస్తోంది. లండన్ నుంచి ఇండియాకు ప్రయాణించాలంటే చాలా ఇబ్బందిగా ఉందని.. చార్టెడ్ ఫ్లైట్ కొనిస్తే హ్యాపీగా లండన్ వెళ్లి, మ్యాచ్ ఉన్నప్పుడు మళ్ళీ తిరిగి వస్తానని విరాట్ కోహ్లీ చెప్పినట్లు వార్త వైరల్ అవుతోంది. విరాట్ కోహ్లీ లండన్ లోనే సెటిల్ అయిన సంగతి తెలిసిందే. అనుష్క శర్మ, ఇద్దరు పిల్లలు ప్రస్తుతం అక్కడే ఉన్నారు. వాళ్లను వదిలేసి, ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ కోసం ప్రత్యేకంగా విరాట్ కోహ్లీ ఒక్కడే ఇండియాకు చేరుకున్నాడు. అయితే తన కుటుంబం అక్కడే ఉందని.. ప్రతి మూడు రోజులకోసారి లండన్ వెళ్లి వస్తానని ఆర్సీబీ యాజమాన్యానికి విరాట్ కోహ్లీ చెప్పినట్లు తెలుస్తోంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆడే ఒక మ్యాచ్ కు త‌ర్వాతి మ్యాచ్ కు కనీసం మూడు రోజుల గ్యాప్ వస్తుంది. ఈ నేపథ్యంలో ఒక మ్యాచ్ ఫినిష్ అయిన వెంటనే లండన్ వెళ్లి, తన కుటుంబంతో గడిపి మళ్లీ జట్టులో చేరతానని చెప్పాడట విరాట్ కోహ్లీ.

దీని కోసం ప్రత్యేకంగా చార్టెడ్ ఫ్లైట్ కొని ఇవ్వాలని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యాన్ని విరాట్ కోహ్లీ అడిగినట్లు వార్తలు వస్తున్నాయి. సాధారణ విమానాలలో వెళ్తే చాలా టైం తీసుకుంటుంది. అదే చార్టెడ్ ఫ్లైట్ అయితే, మ్యాచ్ అయిపోగానే స్టేడియం దగ్గరే చోటా ఫ్లైట్ ఎక్కవచ్చు. అప్పుడు సమయం వృధా కాదు. ఇదే విషయాన్ని బెంగుళూరు యాజమాన్యం ముందు విరాట్ కోహ్లీ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే కోహ్లీ చెప్పినట్లుగానే చార్టెడ్ ఫ్లైట్ కొనిచ్చేందుకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. పెళ్ళాన్ని చూసేందుకు చార్టెడ్ ఫ్లైట్ అవసరమా? మూడు రోజుల గ్యాప్ లో లండన్ ఎప్పుడు వెళ్తావ్? ప్రాక్టీస్ ఎప్పుడు చేస్తావ్ ? అంటూ విరాట్ కోహ్లీని ట్రోలింగ్ చేస్తున్నారు జనాలు.

Advertisement

Also Read:  Inzamam-ul-Haq: కోహ్లీ యావ‌రేజ్ ప్లేయ‌ర్..వాడి కంటే బెట‌ర్ క్రికెట‌ర్లు పాకిస్థాన్‌లో గల్లీకొకడు ఉంటాడు

 

 

Related News

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

Big Stories

Advertisement
×