E-Paper
Advertisement

Mushfiqur Rahim: 100వ టెస్ట్ లో సెంచ‌రీ…4 రికార్డులు బ్రేక్ చేసిన ముష్ఫిఖర్ రహీం..38 ఏళ్ల వ‌య‌స్సులో

Mushfiqur Rahim: 100వ టెస్ట్ లో సెంచ‌రీ…4 రికార్డులు బ్రేక్ చేసిన ముష్ఫిఖర్ రహీం..38 ఏళ్ల వ‌య‌స్సులో
Advertisement

Mushfiqur Rahim:  ముష్ఫిఖర్ రహీం… గురించి తెలియని వారు ఉండరు. బంగ్లాదేశ్ క్రికెట్ జట్టులో ఎన్నో ఏళ్లుగా సేవలు అందిస్తున్నాడు. దాదాపు 20 సంవత్సరాలుగా జట్టులో కొనసాగుతున్నాడు ముష్ఫిఖర్ రహీం. అయితే, తన 38వ వేట కూడా బంగ్లాదేశ్ టెస్ట్ జట్టులో స్థానం దక్కించుకొని చరిత్ర సృష్టించాడు ముష్ఫిఖర్ రహీం. ప్రస్తుతం బంగ్లాదేశ్ వర్సెస్ ఐర్లాండ్ మధ్య రెండో టెస్టు జరుగుతోంది. ఈ టెస్ట్ ముష్ఫిఖర్ రహీంకు 100వది కావ‌డం గ‌మ‌నార్హం. ఇప్ప‌టి వ‌ర‌కు 100 టెస్టులు ఆడిన బంగ్లాదేశ్ ప్లేయ‌ర్ ఎవ‌రూ లేరు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ లో సెంచరీ చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు ముష్ఫిఖర్ రహీం.

Also Read: Shai Hope Record: స‌చిన్, కోహ్లీ వ‌ల్లే కాలేదు, సెంచ‌రీల‌లో షాయ్ హోప్ కొత్త రికార్డ్‌.. నంబర్-1 ర్యాంక్ కోల్పోయిన రోహిత్

100వ టెస్టులో సెంచరీ చేసిన ముష్ఫిఖర్ రహీం

Advertisement

బంగ్లాదేశ్ వర్సెస్ ఐర్లాండ్ ( Bangladesh vs Ireland, 2nd Test) మధ్య నిన్న రెండో టెస్ట్ ప్రారంభమైంది. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ భారీ స్కోర్ దిశగా దూసుకు వెళ్తోంది. ఇప్పటికే 400కు పైగా పరుగులు చేసింది. 500 కు పైగా చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ మ్యాచ్ లో ముష్ఫిఖర్ రహీం ( Mushfiqur Rahim) 214 బంతుల్లో 106 పరుగులు చేశాడు. ఇందులో కేవలం ఐదు బౌండరీలు మాత్రమే ఉన్నాయి. అన్ని సింగిల్స్ మాత్రమే తీశాడు. అప్పుడప్పుడు డబుల్ కూడా తీయడం జరిగింది. లిట‌న్ దాస్ తో కలిసి భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే తన 100వ టెస్టు మ్యాచ్ లో సెంచరీ చేసిన ముష్ఫిఖర్ రహీం సరికొత్త రికార్డు సృష్టించాడు.

100వ టెస్టులో సెంచరీ చేసిన ప్లేయ‌ర్లు వీళ్లే

100వ టెస్టులో సెంచరీ చేసిన వారిలో 11వ ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. గతంలో కాలిన్ కౌడ్రీ, జావేద్ మియాందాద్, గోర్డాన్ గ్రీనిడ్జ్, అలెక్ స్టీవర్ట్  డేవిడ్ వార్నర్ ( David Warner), రికీ పాంటింగ్, గ్రేమ్ స్మిత్ , హసీమ్ ఆమ్లా, జో రూట్, పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇంజమాం, లాంటి చాలా మంది ప్లేయర్లు ఉన్నారు. వాళ్ళ లిస్టులో తాజాగా ముష్ఫిఖర్ రహీం చేరిపోయాడు. ఈ ఒక్క రికార్డే కాదు, మరో మూడు రికార్డులు కూడా సృష్టించాడు. టెస్టులలో బంగ్లాదేశ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఇప్పటి వరకు బంగ్లాదేశ్ తరపున టెస్టుల్లో 6 వేలకు పైగా పరుగులు సాధించాడు ముష్ఫిఖర్ రహీం. బంగ్లాదేశ్ త‌ర‌ఫున‌ అందరి కంటే ఎక్కువ టెస్టులు ఆడిన ప్లేయర్ గా కూడా సరికొత్త రికార్డు సృష్టించాడు. ముఖ్యంగా తన 100వ టెస్టులో 100కు పైగా భాగస్వామ్యం నెలకొల్పి మరో రికార్డు సృష్టించాడు ముష్ఫిఖర్ రహీం. దీంతో సోషల్ మీడియాలో ముష్ఫిఖర్ రహీం పేరు మారుమోగుతోంది.

Advertisement

Also Read: IND VS SA 2nd Test: టీమిండియా జెర్సీపై ట్రోలింగ్..న‌ర్స్ పాప‌ల్లాగే ఉన్నారురా..మెడ‌ప‌ట్టితో గిల్ ద‌ర్శ‌నం

 

 

Related News

ఐర్లాండ్ చేతిలో టీమిండియానే వైట్ వాష్ అయింది, అందుకే పాకిస్తాన్ ఓడిపోతోంది

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

Big Stories

Advertisement
×