E-Paper
Advertisement

Bangalore Robbery: ఆర్బీఐ అధికారులమంటూ ఏటీఎం వ్యాన్ ను అడ్డగించి రూ.7.11 కోట్లు చోరీ

Bangalore Robbery: ఆర్బీఐ అధికారులమంటూ ఏటీఎం వ్యాన్ ను అడ్డగించి రూ.7.11 కోట్లు చోరీ
Advertisement

Bangalore Robbery: బెంగళూరులో భారీ చోరీ జరిగింది. ఆదాయపు పన్ను, ఆర్బీఐ అధికారులకా నటిస్తూ ఓ ముఠా ఏటీఎం వ్యాన్ ను అడ్డుకుని రూ.7.11 కోట్లు దోచుకున్నారు. బుధవారం మధ్యాహ్నం కొంత మంది వ్యక్తులు ఇన్నోవా కారులో వచ్చి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్యాష్ ను ఏటీఎంలో పెట్టడానికి వెళ్తున్న సీఎంఎస్ లాజిస్టిక్స్‌ వ్యాన్‌ను అడ్డగించారు. ఆదాయపు పన్ను, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులుగా నమ్మించి, అనుమతి లేకుండా ఇంత పెద్ద మొత్తంలో నగదును తీసుకెళ్లినందుకు పత్రాలు చూపించాలన్నారు.

తనిఖీల పేరుతో కొందరు ఏటీఎం వ్యాన్ లోకి ఎక్కి డబ్బును ఇన్నోవా వాహనంలోకి తరలించారని పోలీసులు తెలిపారు. వ్యాన్ డ్రైవర్ ను ఇన్నోవా వాహనంలోకి ఎక్కించుకుని సమీపంలోని మరో ప్రదేశంలో వదిలి పెట్టి నగదును పరారయ్యారు.

ఏటీఎం వ్యాన్ ను అడ్డగించి

Advertisement

బెంగళూరులో పట్టపగలే ఈ భారీ చోరీ చోటుచేసుకుంది. డైరీ సర్కిల్ వద్ద ఏటీఎం వ్యాన్ భద్రతా సిబ్బందిని మోసగించి రూ.7.11 కోట్ల నగదుతో ఉడాయించారు. ఏటీఎంలో క్యాష్ డిపాజిట్ చేసేందుకు వెళ్తున్న వ్యాన్ ను అడ్డగించి దుండగులు ఈ చోరీ చేశారు. డైరీ సర్కిల్ వద్దగల ఓ ఏటీఎం మెషీన్‌లో నగదు డిపాజిట్ చేసేందుకు సీఎంఎస్ క్యాష్ వాహనంలో బ్యాంక్ సిబ్బంది క్యాష్‌తో బయల్దేరారు.

Also Read: Khammam Incident: దారుణం.. భార్య గొంతు కోసి హత్య చేసిన భర్త.. కూతురిపై కూడా..

Advertisement

మార్గమధ్యలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని రాసి ఉన్న ఓ ఇన్నోవాలో దుండగులు క్యాష్ వ్యానును సమీపించారు. ఆర్‌బీఐ, ఆదాయపు పన్ను అధికారులమని చెప్పి సిబ్బందిని భయపెట్టారు. ఎక్కువ నగదు తీసుకెళ్తున్నట్లు సమాచారం వచ్చిందని నమ్మించి డబ్బును తమ వాహనంలోకి తరలించారు. మొత్తం రూ.7.11 కోట్ల నగదు వ్యానులో ఉన్నట్లు సిబ్బంది పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక టీమ్ తో దుండగుల కోసం గాలిస్తున్నారు.

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×