E-Paper
Advertisement

Shai Hope Record: స‌చిన్, కోహ్లీ వ‌ల్లే కాలేదు, సెంచ‌రీల‌లో షాయ్ హోప్ కొత్త రికార్డ్‌.. నంబర్-1 ర్యాంక్ కోల్పోయిన రోహిత్

Shai Hope Record: స‌చిన్, కోహ్లీ వ‌ల్లే కాలేదు, సెంచ‌రీల‌లో షాయ్ హోప్ కొత్త రికార్డ్‌.. నంబర్-1 ర్యాంక్ కోల్పోయిన రోహిత్
Advertisement

Shai Hope Record:   అంతర్జాతీయ క్రికెటర్ లో సెంచరీ చేయడమే పెద్ద రికార్డు. అలాంటిది ప్రతి జట్టుపై సెంచరీ చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు వెస్టిండీస్ డేంజర్ ఆటగాడు షాయ్ హోప్ (Shai Hope). ఈ నేపథ్యంలోనే వన్డేల్లో సరికొత్త రికార్డు సృష్టించాడు. సచిన్ టెండుల్కర్, ఆమ్లా, రికీ పాంటింగ్, విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజ ప్లేయర్లు కూడా సాధించలేని రికార్డును తాజాగా నమోదు చేశాడు. ఫుల్ మెంబర్స్ ఉన్న అన్ని జట్లపైన కనీసం ఒక్క సెంచరీ చేసిన తొలి ప్లేయర్ గా సరికొత్త రికార్డు తిరగ రాశాడు షాయ్ హోప్. ఈ నేపథ్యంలోనే తన వన్డే క్రికెట్ కెరియర్ లో మొత్తం 19 సెంచరీలు దాటేశాడు షాయ్ హోప్.

Also Read: Sania Mirza: షోయబ్ మాలిక్ కొడుకు పుట్టుకపై అనుమానాలు.. సానియా మీర్జా సంచలన వ్యాఖ్యలు ?

వన్డేలో తొలి ప్లేయ‌ర్ గా షాయ్ హోప్ అరుదైన రికార్డు

Advertisement

ఇప్పటి వరకు వన్డేలలో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, ఆఫ్గనిస్తాన్, ఇండియా, ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, జింబాబ్వే, వెస్టిండీస్ లాంటి ఫుల్ మెంబర్స్ జట్లపైన ఒక్కో సెంచరీ నమోదు చేసి చరిత్ర సృష్టించాడు. ఇక టీమిండియాపైన 4 సెంచ‌రీలు ఇప్ప‌టికే న‌మోదు చేశాడు షాయ్ హోప్. ప్రస్తుతం న్యూజిలాండ్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య వన్డే సిరీస్ జరుగుతోంది. ఇక ఇవాళ నేపియర్ వేదికగా ఈ రెండు జట్ల మధ్య రెండో వన్డే జరిగింది. ఇందులో న్యూజిలాండ్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్ లో షాయ్ హోప్ 69 బంతుల్లోనే 109 పరుగులు చేసి దుమ్ము లేపాడు. ఇందులో నాలుగు సిక్సర్లతో పాటు 13 బౌండరీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఫుల్ మెంబర్స్ కలిగివున్న 12 జట్లపై 12 సెంచరీలు నమోదు చేసిన క్రికెటర్ గా సరికొత్త రికార్డు సృష్టించాడు షాయ్ హోప్. గతంలో 11 జట్లపైన సచిన్ టెండూల్కర్ సెంచరీలు నమోదు చేసి మొదటి స్థానంలో ఉన్నారు. ఇప్పుడు ఆ రికార్డును బద్దలు కొట్టాడు షాయ్ హోప్. సచిన్ టెండూల్కర్ తర్వాత హాషిం ఆమ్లా 11 జట్లపై, రికీ పాంటింగ్ 11, క్రిస్ గేల్ 11 జ‌ట్లపైన సెంచరీలు నమోదు చేసి ఉన్నారు.

నంబర్-1 ర్యాంక్ కోల్పోయిన రోహిత్

Advertisement

ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో రోహిత్ శర్మకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. నంబర్-1 ర్యాంక్ కోల్పోయాడు రోహిత్. ఇటీవల కాలంలోనే నెంబర్ వన్ స్థానాన్ని సంపాదించిన రోహిత్ శర్మ ఒక ర్యాంకు దిగజారి రెండో స్థానానికి పరిమితమయ్యారు. న్యూజిలాండ్ బెటర్ మిచెల్ 782 పాయింట్లతో మొదటి స్థానానికి చేరుకున్నాడు. ఇటు రోహిత్ శర్మ ఖాతాలో 781 పాయింట్లు మాత్రమే ఉండడంతో రెండవ స్థానంలో నిలవడం జరిగింది. న్యూజిలాండ్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య వన్డే సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో మిచెల్ కు అవకాశం వచ్చింది. దీంతో ర్యాంకింగ్స్ లో ముందుకు దూసుకు వెళ్ళాడు. త్వరలోనే ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య వన్డే సిరీస్ జరగనున్న నేపథ్యంలో మళ్లీ రోహిత్ శర్మ ముందుకు వెళ్లే ఛాన్సులు కూడా ఉన్నాయి.

Also Read: Hardik Pandya: ఆగ‌లేక‌పోతున్న‌ హార్దిక్ పాండ్యా, జిమ్ లోనే శృ**గారం..బోల్డ్ ఫోటోలు వైర‌ల్ !

 

 

 

Related News

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

పుట్టినిల్లా ? మెట్టినిల్లా ? బక్కోడిని ఆడుకుంటున్న ఐపీఎల్ ఫ్యాన్స్

ఒరేయ్ ఇన్ని రోజులు ఎక్క‌డున్నావ్ రా? న‌మ‌న్ ధీర్ బ్యాటింగ్ చూసి బిత్త‌ర‌పోయిన గంభీర్‌

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

Big Stories

Advertisement
×