Road Accident: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. బైక్ పై ప్రయాణిస్తుండగా.. బోర్‌వెల్ లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలో.. సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మృతుల వివరాలు చూస్తే బాబు (30), ఆయన భార్య మమత (25), కుమార్తె విభ (10) గా పోలీసులు గుర్తించారు. వీరు బైక్ పై వెళుతుండగా.. బోర్ వెల్ లారీ ఒక్కసారిగా ఢీకొట్టింది. దీంతో ముగ్గురు గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డారు. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. మృతులను సమీప ఆసుపత్రి తరలించారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో.. ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుమకున్నాయి.
Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి..
ప్రమాదం జరిగిన వెంటనే రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. నేషనల్ హైవేపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సుమారు రెండు గంటల పాటు వందలాది వాహనాలు నిలిచిపోయాయి. అనంతరం పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని నియంత్రించారు. లారీని స్వాధీనం చేసుకుని డ్రైవర్ కోసం దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.