IND vs WI: ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. అందరూ ఊహించినట్లుగానే మొదటి సెషన్ లోనే మ్యాచ్ ఫినిష్ చేసింది టీమిండియా. దగ్గరుండి టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ జట్టును విజయతీరాలకు చేర్చాడు. చివరి వరకు ఆడిన కేఎల్ రాహుల్. 58 పరుగులు చేసి, టీమిండియా గెలిపించాడు. ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ జట్టుపై ఏకంగా 7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది టీం ఇండియా. ఈ విజయంతో 2-0 తేడాతో సిరీస్ కూడా కైవసం చేసుకుంది. అటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో మూడో స్థానాన్ని నిలబెట్టుకుంది టీమిండియా.
Also Read: Smriti Mandhana: గిల్ ఓ పిల్లబచ్చా…స్మృతి మందాన కండలు చూడండి…పిసికి చంపేయడం ఖాయం !
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఏకంగా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో రెండు టెస్టులను క్లీన్ స్వీట్ చేసింది టీం ఇండియా. రెండో ఇన్నింగ్స్ లో 121 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే టీమిండియా ముందు ఉంచింది వెస్టిండీస్. దీంతో కేవలం మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా… ఆ లక్ష్యాన్ని అవలీలగా చేదించేసింది. 108 బంతుల్లో 58 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ చివరి వరకు ఆడగా, కొత్త కుర్రాడు సాయి సుదర్శన్ 76 బంతుల్లో 39 పరుగులతో దుమ్ము లేపాడు.
అయితే చివరి వరకు కే ఎల్ రాహుల్ మాత్రం జట్టు బాధ్యతలను భుజాన వేసుకొని తీసుకువెళ్లాడు. ఈ నేపథ్యంలోనే టీమ్ ఇండియా విజయం సాధించింది. అటు అంతకుముందు తొలి లింక్స్ లో 518 పరుగులు చేసి ఐదు వికెట్లు నష్టపోయిన టీమ్ ఇండియా డిక్లేర్ చేసింది. ఆ సమయంలో యశస్వి జైష్వాల్ అలాగే గిల్ ఇద్దరు సెంచరీలు చేశారు. అటు వెస్టిండీస్ మొదటి ఇన్నింగ్స్ లో 248 పరుగులు చేయగా రెండో ఇన్నింగ్స్ లో 390 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో 121 పరుగుల లక్ష్యాన్ని టీం ఇండియా ముందు ఉంచింది. కానీ టీమిండియా బలంగా ఉండడంతో వెస్టిండీస్ దారుణ ఓటమి చవిచూసింది.
వెస్టిండీస్ జట్టుపై రెండు టెస్టులు గెలిచిన టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-2027 పాయింట్ల పట్టికలో మూడో స్థానాన్ని నిలబెట్టుకుంది. గతంలో కూడా అదే స్థానంలో ఉన్న టీమిండియా, ఈ విజయంతో 52 పాయింట్లు సంపాదించుకుంది. ఇక ఈ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా మూడు విజయాలతో మొదటి స్థానంలో ఉంది. శ్రీలంక రెండో స్థానంలో నిలిచింది. టీమిండియా మూడో స్థానంలో ఉండగా ఇంగ్లాండ్ నాలుగో స్థానంలో ఉన్నాయి. అనంతరం ఐదు, ఆరు స్థానాల్లో వరుసగా బంగ్లాదేశ్, వెస్టిండీస్ ఉన్నాయి. ఇక ఈ సిరీస్ పూర్తయిన నేపథ్యంలో ఇవాళ రాత్రి ఆసీస్ కు వెళ్లనుందట టీమిండియా. అక్కడ వన్డే, టీ20 సిరీస్ ఆడనుంది.