E-Paper
Advertisement

Salman Agha: నీ పెళ్లాన్ని రేప్ చేస్తాం, కొడుకును చంపేస్తాం…పాక్ కెప్టెన్ స‌ల్మాన్ ఫ్యామిలీకి వేధింపులు

Salman Agha: నీ పెళ్లాన్ని రేప్ చేస్తాం, కొడుకును చంపేస్తాం…పాక్ కెప్టెన్ స‌ల్మాన్ ఫ్యామిలీకి వేధింపులు
Advertisement

Salman Agha:  2026 టీ20 ప్రపంచ కప్ టోర్న‌మెంట్ ( ICC Men’s T20 World Cup 2026)  నేప‌థ్యంలో పాకిస్తాన్ క‌థ దాదాపు ముగిసిన‌ట్లేన‌ని చ‌ర్చ జ‌రుగుతోంది. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ సూపర్ 8 లో భాగంగా నిన్న ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ ( England vs Pakistan )  మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోయింది. ఇంగ్లాండ్ చేతిలో 2 వికెట్ల తేడాతో ఓట‌మి పాలైంది పాకిస్తాన్‌. దీంతో పాకిస్తాన్ సెమీ ఫైనల్ ( Pakistan Semi Final) వెళ్లే దారులన్ని మూసుకుపోయాయి. అద్భుతం జరిగితే తప్ప, సెమీ ఫైనల్ లో పాకిస్తాన్ అడుగుపెట్టే ఛాన్సే లేదంటున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా ( Salman Agha ) కుటుంబాన్ని కొంత మంది టార్గెట్ చేశారు. నీ పెళ్ళాన్ని రేప్ చేస్తాం, నీ కొడుకులు చంపేస్తాం అంటూ సల్మాన్ అలీని ఉద్దేశించి పాకిస్తాన్ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి టార్చర్ పెడుతున్నారట. ఈ విషయాన్ని స్వయంగా పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ సతీమణి స‌బ్బా మంజూర్ ( Sabba Manzer) సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టి మరీ తన ఆవేదనను వ్యక్తం చేశారు.

Also Read:  Indian Team Semi final Qualification: టీమిండియా సెమీ ఫైన‌ల్ కు చేరాలంటే ఒక్క‌టే మార్గం..వ‌ర్షం ప‌డాల‌ని కొబ్బ‌రికాయ‌లు కొట్టాల్సిందే

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో నిన్న ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయిన పాకిస్తాన్ సెమీస్ అవకాశాలను మరింత దూరం చేసుకుంది. ఈ టోర్నమెంట్ లో పాకిస్తాన్ సెమీ ఫైనల్ కు చేరాలంటే, చాలా కష్టపడాలి. పాకిస్తాన్ తన తర్వాతి మ్యాచ్ లో శ్రీలంకతో తలపడాలి. ఇందులో కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. అదే సమయంలో న్యూజిలాండ్ తన రెండు మ్యాచ్ లలో ఓడిపోవాలి. ఇలా జరిగితేనే, పాకిస్తాన్ సెమీఫైనల్ కు వెళుతుంది. అయితే ఇది జరగడం అసాధ్యమని భావించిన పాకిస్తాన్ అభిమానులు బరితెగించారు.

పాకిస్తాన్ ఓటమికి కెప్టెన్ సల్మాన్ ను కారణంగా చూపి ఆయన కుటుంబాన్ని వేధిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా సల్మాన్ భార్య అలాగే కొడుకులు ఉద్దేశించి వివాదాస్పద పోస్టులు పెడుతున్నారు పాకిస్తాన్ ఫ్యాన్స్. నీ పెళ్ళాన్ని రేప్ చేస్తాం, నీ కొడుకును చంపేస్తాం.. అంటూ సోషల్ మీడియా వేదికగా దారుణంగా పోస్టులు పెడుతున్నారు పాకిస్తాన్ అభిమానులు. పాకిస్తాన్ ఓడిపోవడానికి సల్మాన్ అలీ కారణమంటూ ఫైర్ అవుతున్నారు. దీంతో ఈ అంశం హాట్ టాపిక్ అయింది.

సల్మాన్ అలీ సతీమణి పోస్ట్ వైరల్

Advertisement

తన కుటుంబం పై పాకిస్తాన్ అభిమానులు చేస్తున్న పోస్టులపై కెప్టెన్ సల్మాన్ అలీ సతీమణి స‌బ్బా మంజూర్ ( Sabba Manzer) స్పందించారు. తన కుటుంబాన్ని ఇలా వేధిస్తూ పోస్టులు పెడితే వరల్డ్ కప్ రాదని.. చురకలు అంటించారు. పాకిస్తాన్ ప్లేయర్లు అందరూ ఆడితేనే వరల్డ్ కప్ వస్తుందని గుర్తు చేశారు. అనవసరంగా ఈ వివాదంలోకి తన కుటుంబాన్ని లాగకూడదని కోరారు. దీంతో ఆమె చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.

Also Read: England vs Pakistan: సెంచ‌రీతో ఇర‌గదీసిన బ్రూక్‌, సెమీ ఫైన‌ల్ కు ఇంగ్లాండ్‌..టోర్న‌మెంట్ నుంచి పాకిస్తాన్ ఔట్ !

 

 

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×