Director Teja: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న తేజ (Teja) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. త్వరలోనే తన వారసుడిని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇలాంటి సమయంలో ఆయన కొడుకు అమితోవ్ తేజ (Amitov teja) సినిమాల గురించి కాకుండా ఇతర విషయాలపై వార్తల్లో నిలవడం చర్చనీయాంశంగా మారింది. మొన్నటికి మొన్న సైబర్ మోసగాళ్ల వలలో పడి ఏకంగా లక్షల రూపాయల కోల్పోయినట్లు వార్తలు రాగా.. ఇప్పుడు ఆయనపై క్రిమినల్ కేసు నమోదవడం సినీ వర్గాలలో మరింత హాట్ టాపిక్ గా మారింది.
హైదరాబాదులోని నాంపల్లి కోర్టులో డబ్బు వసూలు, హత్య బెదిరింపులు, కిడ్నాప్, అక్రమ నిర్బంధం, మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలు తలెత్తడంతో ఆయనపై కేసు నమోదయింది. ఇక ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. వివరాలలోకి వెళ్తే మోతీ నగర్ కు చెందిన కే.ప్రణీత్ బ్యాంకు క్రెడిట్ కార్డుల పర్యవేక్షణ రంగంలో పనిచేస్తున్నారు. 2025లో క్రెడిట్ కార్డు దరఖాస్తుల విషయమై అమితోవ్ తేజాతో ప్రణీత్ కి పరిచయం ఏర్పడింది.. కొంతకాలంలోనే అమితోవ్ తేజ, ప్రణీత్ , ఆయన భార్య కలసి షేర్ మార్కెట్లో ఒక అకౌంట్ తెరిచి ట్రేడింగ్ ప్రారంభించారు. ప్రణీత్.. అమితోవ్ తేజ తరఫున ట్రేడింగ్ నిర్వహించగా.. అందులో సుమారుగా 11 లక్షల నష్టం వాటిల్లిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నష్టాన్ని పూడ్చేందుకు మరింత డబ్బు పెట్టాలని అమితోవ్ తేజ ప్రణీత్ పై ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనికి ప్రణీత్ నిరాకరించడంతో పరిస్థితి తీవ్రంగా మారిందట. దీంతో భయపడి పోయిన ప్రణీత్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు.
ఇక ప్రణీత్ ఫిర్యాదు మేరకు.. “2025 మే 4న అమితోవ్ తేజ అనుచరులు మణికుమార్, లక్ష్మీకాంత్ రెడ్డి, రామ్నాథ్ రెడ్డి నన్ను అక్రమంగా నిర్బంధించారు. ఈ సందర్భంగా ఖాళీ పేపర్లు, చెక్కులపై బలవంతంగా సంతకాలు చేయించుకోవడమే కాకుండా నా భార్యతో ఆస్తి పత్రాలపై కూడా సంతకం తీసుకున్నారు. అంతేకాదు నా భార్య పట్ల అసభ్యంగా ప్రవర్తించారు” అంటూ ప్రణీత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మొదట తన కంప్లైంట్ ను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఇవ్వగా.. అటు పోలీసుల నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో రెండు నెలల క్రితమే ప్రణీత్ ఈ విషయాన్ని నాంపల్లి కోర్టుల ప్రస్తావించారు.ఈ విషయాన్ని పరిశీలించిన కోర్టు కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.ఇక జూబ్లీహిల్స్ పోలీసులు శుక్రవారం అమితోవ్ తేజ తో పాటు అతని అనుచరులపై కూడా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ALSO READ:Keerthi bhat: విజయ్ తో బ్రేకప్.. నాకేదైనా జరిగితే వారిదే బాధ్యత.. అన్నీ రాసుకున్నా!
ఇదిలా ఉండగా మరొకవైపు ప్రణీత్ ఆయన భార్యపై ట్రేడింగ్ వ్యవహారంలో పెట్టుబడి పేరిట తనను 72 లక్షల వరకు మోసం చేశారని అమితోవ్ తేజ జూబ్లీహిల్స్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇక ప్రస్తుతం ఈ వ్యవహారంలో ఇరుపక్షాల ఆరోపణలతో కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రస్తుతం ఈ వివాదం సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది. మరి దీనిపై దర్శకుడు తేజ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.