E-Paper
Advertisement

లైవ్ మ్యాచ్ లో బ‌రితెగించిన పాక్ ఫ్యాన్స్‌…”క్రాంతి గౌడ్” మ‌గాడంటూ కేక‌లు !

లైవ్ మ్యాచ్ లో బ‌రితెగించిన పాక్ ఫ్యాన్స్‌…”క్రాంతి గౌడ్” మ‌గాడంటూ కేక‌లు !
Advertisement

Pak Fans Trolls Kranti Gaud:  మహిళల ఆసియా కప్ 2026 టోర్నమెంట్ లో (Women’s Asia Cup 2026 Tournament) భాగంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య 9వ మ్యాచ్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన టీమిండియా మహిళల జట్టు 7 వికెట్ల తేడాతో విక్టరీ నమోదు చేసుకుంది. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో అదరగొట్టిన టీమిండియా… అవలీలగా పాకిస్తాన్ జట్టును చిత్తు చేసింది. ఎప్పటిలాగే డామినేషన్ ప్రదర్శించింది టీమిండియా. అయితే ఈ మ్యాచ్ జరుగుతుండగా టీమిండియా లేడి బుమ్రా క్రాంతి గౌడ్ (Kranti Gaud) పై పాకిస్తాన్ అభిమానులు రెచ్చిపోయి ప్రవర్తించారు. ఆమె లేడీ క్రికెటర్ కాదని.. మగాడే అంటూ కించపరుస్తూ కేకలు వేశారు. అందుకే టీమిండియా గెలుస్తుంది అంటూ నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైర‌ల్ గా మారింది.

క్రాంతి గౌడ్ కు లింగ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేయాలంటూ డిమాండ్స్‌!

మహిళల ఆసియా కప్ 2026 టోర్నమెంట్ లో (Women’s Asia Cup 2026 Tournament) భాగంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. దుబాయ్ లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగగా… టీమిండియా లేడీ బుమ్రాగా పేరు పొందిన క్రాంతి గౌడ్ కు ఘోర‌ అవమానం చోటు చేసుకుంది. ఆమె నిన్నటి మ్యాచ్ లో బౌండరీ గేటు దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న క్రమంలో.. పాకిస్తాన్ అభిమానులు ఓవరాక్షన్ చేశారు. క్రాంతి గౌడ్ అమ్మాయి కాదు.. వాడు ఓ అబ్బాయి అంటూ కేకలు వేశారు పాకిస్తాన్ అభిమానులు. అందుకే చాలా బలంగా మగాడిలాగా బౌలింగ్ చేస్తోందని… కచ్చితంగా ఆమెకు లింగ నిర్ధారణ పరీక్షలు చేయాల్సిందేనంటూ డిమాండ్లు చేస్తున్నారు. అయితే పాకిస్తాన్ అభిమానులు చేసిన రచ్చకు ఇండియన్ క్రికెట్ అభిమానులు కూడా కౌంటర్ ఇస్తున్నారు. టీమిండియా పై గెలవడం చేతకాక ఇలా తప్పుడు వాదనలను తెరపైకి తీసుకు వస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇలాంటి వాళ్లను ఉరితీయాల్సిందేనని హెచ్చరిస్తున్నారు. అసలు మైదానంలోకి కూడా వీళ్లను తీసుకురాకూడదని కోరుతున్నారు.

Advertisement

PCB confiscate mobile phones of Pakistan cricketers : పాకిస్తాన్ జ‌ట్టులో పెను ప్ర‌కంప‌న‌లు…ప్లేయ‌ర్ల మొబైల్ ఫోన్లను లాగేసుకున్న PCB

ఏడు వికెట్ల తేడాతో పాకిస్తాన్ పై టీమ్ ఇండియా విజయం

ఆసియా కప్ 2026 టోర్నమెంట్ లో (Women’s Asia Cup 2026 Tournament) భాగంగా అన్నిన్న దుబాయ్ వేదికగా ( Dubai stadium) టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య బిగ్ ఫైట్ జరిగింది. అయితే ఇందులో అద్భుతంగా రాణించిన టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 18.1 ఓవర్లు ఆడింది. ఈ క్రమంలో 55 పరుగులు సాధించింది పాకిస్తాన్ మహిళల టీం. ఈ లక్ష్యాన్ని కేవలం ఎనిమిది ఓవర్లలోనే మూడు వికెట్లు నష్టపోయి ఛేదించింది టీమిండియా.

Advertisement

Tanveer Ahmed On IND VS PAK: అదరగొట్టిన ఇండియా, పాకిస్తాన్ మరో ఘోర ఓటమి…ఫిక్సింగ్ చేశారంటూ త‌న్వీర్ ఆరోప‌ణ‌లు

 

 

 

Related News

55 ప‌రుగుల‌కే ఆలౌటైనా సిగ్గు రాలేదా? ఫాతిమా స‌నా ఓవ‌రాక్ష‌న్‌పై టీమిండియా క్రికెట‌ర్ సీరియ‌స్

పాకిస్తాన్ జ‌ట్టులో పెను ప్ర‌కంప‌న‌లు…ప్లేయ‌ర్ల మొబైల్ ఫోన్లను లాగేసుకున్న PCB

అదరగొట్టిన ఇండియా, పాకిస్తాన్ మరో ఘోర ఓటమి…ఫిక్సింగ్ చేశారంటూ త‌న్వీర్ ఆరోప‌ణ‌లు

55 ప‌రుగుల‌కే పాకిస్తాన్ ఆలౌట్…ఫాతిమా స‌నా పాత వీడియో వైర‌ల్

PCBలో ఆర్థిక సంక్షోభం.. PSL ఆడే ప్లేయ‌ర్ల జీతాలు భారీగా త‌గ్గింపు ?

సచిన్ వికెట్ తీయాలంటే.. ఆ దేవుడిని పూజించాల్సిందే..బ్రెట్ లీ కామెంట్స్ వైరల్

పాకిస్తాన్ జ‌ట్టులో అంద‌రూ క‌ట్టప్ప‌లే..అందుకే సంక‌నాకిపోతున్నారు

Big Stories

Advertisement
×