ఇంటికి కట్టిన పెళ్లి తోరణాలు ఇంకా వాడలేదు.. పెళ్లి కూతురి కాళ్ల కుపారాని ఆరలేదు.. అంతలోనే ఊహించని దారుణం. పెళ్లయిన వారానికే భార్య గొంతుకోశాడు భర్త. ప్రస్తుతం నవ వధువు పరిస్థితి విషమంగా ఉంది. సంచలనం రేపిన ఈ ఘటన నెల్లూరు జిల్లాలో వెలుగుచూసింది. అసలేం జరిగింది?
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం మేరకు.. నెల్లూరు నగరంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా బీబీనగర్‌కు చెందిన హేమసాయికి.. ఏఎస్‌పేట మండలానికి చెందిన మహాలక్ష్మితో వారం రోజుల కిందట పెళ్లి జరిగింది. ఇంట్లో ఇంకా బంధువులు ఉన్నారు. కొత్త దంపతులు ఇద్దరు సినిమా చూసేందుకు శనివారం స్క్రూటీలో ఆత్మకూరు బయలుదేరారు.
మార్గ మధ్యలో ఆశ్చర్యకరమైన ఓ విషయం చెబుతానని భార్యని నమ్మబలికాడు భర్త. మార్గ మధ్యలో ఓ నిమ్మతోటలోకి వెళ్లారు. హేమసాయి తన భార్య మహాలక్ష్మిపై కత్తితో దాడి చేశాడు. భార్య గొంతు కోశాడు భర్త. రక్తపు గాయాలతో రోడ్డుపైకి వచ్చి పడిపోయింది మహాలక్ష్మి. దుండగులు తమపై దాడి చేశారని స్థానికులను నమ్మించాడు భర్త హేమ సాయి. ఈ ఘటన గురించి తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గాయపడిన మహాలక్ష్మిని నెల్లూరు ఆసుపత్రికి తరలించారు.
ALSO READ: ప్రశ్నిస్తే బ్లాక్ చేస్తారా? బిగ్ టీవీ వ్యవహారంపై నెటిజన్ల ఫైర్
ఈ ఘటనపై భర్తను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు పోలీసులు. తీవ్రంగా గాయపడిన మహాలక్ష్మి పరిస్థితి విషమంగా ఉందని, మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించినట్లు సీఐ వెల్లడించారు. పెళ్లయిన వారం రోజులకే ఈ విధంగా జరగడంతో ఇరు కుటుంబాల మధ్య ఏమైనా ప్రతీకారాలు ఉన్నాయా? లేకుంటే వారం రోజుల్లో భార్యభర్తల మధ్య ఏమైనా విభేదాలు చోటు చేసుకున్నాయా? ఇదే కోణంలో ఆరా తీస్తున్నారు పోలీసులు.