Pakistan Girls: మహిళల ప్రపంచ కప్ 2025 టోర్నమెంట్ ప్రస్తుతం చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి నేపథ్యంలో మరోసారి పాకిస్తాన్ జట్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తొలి మ్యాచ్ లోనే బంగ్లాదేశ్ చేతుల్లో ఓడిపోయిన పాకిస్తాన్ జట్టులో అందమైన అమ్మాయిలు ఉన్నారని సోషల్ మీడియాలో కొంతమంది మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్ యంగ్ క్రికెటర్ ఈమాన్ ఫాతిమా ( Eyman Fatima ) ఫోటోలు వైరల్ చేసి చాలా అందంగా ఉందని… రచ్చ రచ్చ చేస్తున్నారు కొంతమంది.
Also Read: Shoaib Malik Divorce: మూడో భార్యకు కూడా షోయబ్ మాలిక్ విడాకులు..? సానియా మీర్జా పాపం తగిలిందా !
పాకిస్తాన్ అంటేనే దరిద్రంలా మనకు కనిపిస్తుంది. పేదరికం అలాగే ఉగ్రవాదంతో మునిగిపోయిన పాకిస్తాన్… ఆర్థికంగా క్షీణించి పోయిన సంగతి తెలిసిందే. అయితే… ఆర్థికంగా బాగా లేకపోయినా పాకిస్తాన్ దేశంలో అందమైన అమ్మాయిలు మాత్రం ఉన్నారు. ఆసియా కప్ 2025 టోర్నమెంట్ సమయంలో కూడా చాలామంది అమ్మాయిలను లైవ్ సందర్భంగా చూసాం. అయితే ఇప్పుడు మహిళల వన్డే వరల్డ్ కప్ జరుగుతున్న సమయంలో పాకిస్తాన్ జట్టులో ఉన్న ఓ అందమైన అమ్మాయి ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ అమ్మాయే ఈమాన్ ఫాతిమా. 20 సంవత్సరాల ఈ యంగ్ క్రికెటర్ ఇటీవల పాకిస్తాన్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చింది. దేశవాళి క్రికెట్ అద్భుతంగా ఆడిన నేపథ్యంలో… ఆమెకు ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ లో ఆడే అవకాశం వచ్చింది.
అయితే ఈమాన్ ఫాతిమా ఫోటోను వైరల్ చేసి ఆమెను అందాన్ని బాగా పొగుడుతున్నారు ఇండియన్స్. దరిద్రమైన పాకిస్తాన్ లో పుట్టడంతో ఆమె కెరీర్ నాశనమైందని… అదే ఇండియాలో పుడితే మంచి హీరోయిన్ అయ్యేదానికి కూడా అంటున్నారు. ఎలాగైనా భాష నేర్చుకొని ఆమెను లైన్ లో పెట్టాలని మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. పాకిస్తాన్ లో ఇంత మంచి అమ్మాయిలు ఉంటారని కూడా మరి కొంతమంది అంటున్నారు. కాగా ఇప్పటి వరకు ఆమె ఒకే ఒక వన్డే మ్యాచ్ ఆడింది. ఇందులో రెండు రన్స్ మాత్రమే చేసింది. అలాగే టి20లో మూడు మ్యాచ్ లలో ఆడే అవకాశం వచ్చింది. ఇందులో ఆమె 27 పరుగులు మొత్తంగా చేసింది. అయితే మహిళల ప్రపంచకప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… అదనపు ప్లేయర్ కింద ఆమెను తీసుకున్నారు.
మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్లో భాగంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మరోసారి మ్యాచ్ జరగనుంది. రేపు కొలంబో వేదికగా ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ ఉండనుంది. అయితే ఈ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో… మరోసారి షేక్ హ్యాండ్ అంశం తెరపైకి రానుంది. బిసిసిఐ ఆదేశాల మేరకు…. మహిళల టీం ఇండియా కూడా షేక్ హ్యాండ్ ఇవ్వబోదని తెలుస్తోంది.
Also Read: Abhishek Sharma Sister Wedding: ఇండియా కోసం త్యాగం…వీడియో కాల్ లో సోదరి పెళ్లి చూసిన అభిషేక్ శర్మ