Star Singer:సినీ సెలబ్రిటీలు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి వీరికి సంబంధించిన ప్రతి చిన్న విషయమైనా ఇట్టే క్షణాల్లో వైరల్ అవుతుంది. అయితే సెలబ్రిటీలు నలుగురికి ఆదర్శంగా ఉండాలి కానీ ఇలా కొంతమంది చేసే పనుల వల్ల అందరికీ చెడ్డపేరు వస్తోంది అనే వాదనలు ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. ఇక తప్పు చేస్తే చట్టం ముందు ఎవరైనా ఒకటే.. అందుకే తాజాగా ఒక స్టార్ సింగర్ చేసిన పనికి ఏకంగా నాలుగు సంవత్సరాల జైలు శిక్ష పడింది. ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు సంవత్సరాల జైలు శిక్ష అంటే మరి ఆ స్టార్ సింగర్ చేసిన పని ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇంతకు ఆయన ఎవరు? ఏం చేశారు? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
ఆయన ఎవరో కాదు అమెరికన్ పాప్ సింగర్ సీన్ డీడీ కాంబ్స్(DD Combs) . ఈయనకి అక్కడి ప్రభుత్వం 4 ఏళ్ల 2నెలల జైలు శిక్ష విధించింది. ప్రాస్టిట్యూషన్, డ్రగ్స్ మత్తులో మహిళలను హింసించడం వంటి కేసుల్లో నేరం రుజువు కావడంతో భారత సంతతి జడ్జ్ అయిన అరుణ్ సుబ్రహ్మణ్యన్ ఈయనకు శిక్ష విధించారు. డ్రగ్స్ కి బానిస అయ్యి అలా చేశానని అందుకు సిగ్గుపడుతున్నట్లు వివరించారు డీడీ కాంబ్స్. నిజానికి ఇంతకు ముందు కూడా ఇతడిపై సె**క్స్ ట్రాఫికింగ్ కేసు నమోదయింది. దీని వల్ల ఆయన జీవిత ఖైదు కూడా అనుభవించాల్సి ఉంది. కానీ ఇలాంటి తీవ్రమైన కేసులు ఆయనపై కొట్టివేయడంతో జీవిత ఖైదు శిక్ష నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈయన అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. డ్రగ్స్ కు బానిస అయ్యి ఇలాంటి పనులు చేయడం ఏమాత్రం సమంజసం కాదు.. డ్రగ్స్ మత్తులో అమ్మాయిలతో అసభ్యకర ప్రవర్తన అత్యంత దారుణానికి దారితీస్తుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు స్టార్ సింగర్ చేసిన పనికి నాలుగు సంవత్సరాల జైలు శిక్ష పడింది.
ఇకపోతే ఈయన ఇప్పటికే పలుమార్లు లైంగిక దుష్ప్రవర్తన ఆరోపణలను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా లైంగిక దుష్ప్రవర్తన కారణంగా ఏకంగా ఈయనపై 10 సివిల్ కేసులు కూడా నమోదయ్యాయి. అత్యాచారం ,మాదకద్రవ్యాల ద్వారా మహిళలను లైంగికంగా వేధించడం, పిల్లల్ని కూడా లైంగిక వేధింపులకు గురిచేసినట్లు ఈయనపై ఆరోపణలు ఉన్నాయి. 2024 నుండి తన ఫెడరల్ క్రిమినల్ ఆరోపణలన్నింటికీ అతను నిర్దోషి అని అంగీకరించినా.. 2023 డిసెంబర్లో ఈయనపై అతని మాజీ స్నేహితురాలు కాస్సీ వెంచూర తోపాటు నలుగురు మహిళలు లైంగిక దుష్ప్రవర్తన ఆరోపణలు చేశారు. పదేళ్ల కాలంలో తమను అనేకసార్లు అత్యాచారం చేశాడని, ఆడవాళ్లను అక్రమ రవాణా చేశాడని, శారీరకంగా దాడి చేశారని కూడా వారు ఆరోపించారు.
డీడీ కాంబ్స్ విషయానికి వస్తే.. ఈయన అసలు పేరు సీన్ జాన్ కాంబ్స్. రికార్డ్ నిర్మాతగా, రికార్డ్ ఎగ్జిక్యూటివ్ గా, అమెరికన్ మాజీ రాపర్ గా పేరు సొంతం చేసుకున్నారు. హార్లెమ్ లో జన్మించిన ఈయన ప్రస్తుత వయసు 55 సంవత్సరాలు. 1993లో తన సొంత రికార్డు లేబుల్ బ్యాడ్ బాయ్ రికార్డ్స్ ను స్థాపించారు.
ALSO READ: Alai Balai-2025: మనసు ఉప్పొంగుతోంది.. ఇదే మొదటిసారి అంటున్న నాగ్!