Shoaib Malik Divorce: టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మాజీ భర్త షోయబ్ మాలిక్ ( Shoaib Malik ) మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చిన షోయబ్ మాలిక్…. తన మూడవ భార్యకు కూడా విడాకులు ఇచ్చేందుకు సిద్ధమయ్యాడట. పాకిస్థాన్ నటి సనా జావిద్ ను 2024 జనవరి మాసంలో వివాహం చేసుకున్న షోయబ్ మాలిక్… ఆమెతో దాదాపు ఏడాదిన్నర కాపురం చేశాడు. అయితే వీళ్ళిద్దరి మధ్య గత కొన్ని రోజులుగా గ్యాప్ పెరిగిందట. దీంతో ముచ్చటగా మూడోసారి మూడవ భార్య సనా జావిద్ కు విడాకులు ఇచ్చేందుకు షోయబ్ మాలిక్ నిర్ణయం తీసుకున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
పాకిస్తాన్ జట్టు కెప్టెన్ గా అప్పట్లో… మంచి పేరు తెచ్చుకున్నాడు షోయబ్ మాలిక్. అయితే తన వ్యక్తిగత జీవితంలో మాత్రం వరసగా వివాదాలకు తెరలేపుతున్నారు మాలిక్. ఇప్పటికే ముగ్గురిని వివాహం చేసుకున్న షోయబ్ మాలిక్…. ఇద్దరమ్మాయిలకు విడాకులు ఇవ్వగా…. ఇప్పుడు మూడవ భార్యకు కూడా విడాకులు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నాడట. మొదట ఆయేషా అనే మహిళను పెళ్లి చేసుకున్న షోయబ్ మాలిక్… ఆమె తో గొడవ పెట్టుకుని వదిలేసాడు. 2002 సంవత్సరంలో… ఆయేషాను పెళ్లి చేసుకున్నాడు షోయబ్ మాలిక్.
2010 సంవత్సరంలో ఆమెకు విడాకులు ఇచ్చాడు. అనంతరం 2010 సంవత్సరంలోనే హైదరాబాద్ అమ్మాయి, ఎన్ని స్టార్ సానియా మీర్జా ను పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో దాదాపు 14 సంవత్సరాలు…. కాపురం చేసి 2024 లో విడాకులు ఇచ్చాడు. వీళ్లకు ఒక కుర్రాడు కూడా ఉన్నాడు. అనంతరం కుల ద్వారా… విడాకులు ఇచ్చాడు. అనంతరం పాకిస్తాన్ టీవీ నటి సనా జావిద్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు మాలిక్. అయితే ఏడాదిన్నర పాటు ఆమెతో కాపురం చేసి… తాజాగా విడాకులు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
సానియా మీర్జాను పెళ్లి చేసుకున్న షోయబ్ మాలిక్… దాదాపు 14 సంవత్సరాల పాటు కాపురం చేశాడు. హైదరాబాద్ అమ్మాయి అయిన సానియా మీర్జా ను షోయబ్ మాలిక్ పెళ్లి చేసుకోవడంతో అప్పట్లో పెద్ద వివాదమే జరిగింది. పాకిస్తాన్ వాడికి ఎలా పెళ్లి చేస్తారని ఆమె కుటుంబంపై చాలామంది నెగటివ్ ట్రోల్స్ చేశారు. అయితే సోయబ్ మాలిక్ అలాగే సానియా మీర్జా జంటకు ఒక కుర్రాడు పుట్టిన తర్వాత విడాకులు ఇచ్చాడు. విడాకులు ఇవ్వడంతో సానియా మీర్జా అలాగే ఆమె కొడుకు ఇప్పుడు ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. వీళ్ళిద్దరి పాపమే ఇప్పుడు షోయబ్ మాలిక్ కు కొట్టిందని అంటున్నారు. అందుకే మూడవ భార్యకు కూడా మాలిక విడాకులు ఇవ్వబోతున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
?utm_source=ig_embed&ig_rid=8cdb1e30-f0c7-4dd8-8521-1ffb1e4a8aec
Sania Mirza's husband and Pakistani cricketer Shoaib Malik ties knot with Pakistani actress Sana Javed.
This is Shoaib's 3rd marriage as he destroys Sania's life after destroying Indian top tennis players career pic.twitter.com/bkcFqg7IQj
— Megh Updates 🚨™ (@MeghUpdates) January 20, 2024