E-Paper
Advertisement

Mohsin Naqvi: లండ‌న్ లో మొహ్సిన్ నఖ్వీకి ఘోర అవ‌మానం..న‌డిరోడ్డుపై కారు ఆపేసిన పోలీసులు

Mohsin Naqvi: లండ‌న్ లో మొహ్సిన్ నఖ్వీకి ఘోర అవ‌మానం..న‌డిరోడ్డుపై కారు ఆపేసిన పోలీసులు
Advertisement

Mohsin Naqvi:  పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ ( PCB), ఏషియన్ క్రికెట్ అసోసియేషన్ ( Asian Cricket Council) అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీకి ( Mohsin Naqvi ) ఘోర అవమానం ఎదురయింది. అతని కారును అర్ధాంతరంగా నడిరోడ్డుపైన ఆపేశారు పోలీసులు. ఈ సంఘటన పాకిస్తాన్ లో కాదు, లండన్ లో చోటు చేసుకుంది. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంటు ( Pakistan Super League 2026 Tournament ) రోడ్ షో లో ( PSL Road Show) భాగంగా తాజాగా లండన్ వెళ్లారు పిసిబి చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ. ఈ సందర్భంగా మొహ్సిన్ నఖ్వీ కారు అనుమానకరంగా లండన్ పోలీసులకు కనిపించిందట. దీంతో వెంటనే మొహ్సిన్ నఖ్వీని కిందికి దించి, కారు మొత్తం తనిఖీలు చేశారట లండన్ పోలీసులు ( London Police). తాను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్, పాకిస్తాన్ అంతర్గత మంత్రి అని చెప్పినా కూడా పోలీసులు వదల లేదట. ఎవడైతే మాకేంటి అన్న రేంజిలో మొహ్సిన్ నఖ్వీని నడిరోడ్డు పైన కారులో నుంచి దించేసి, కారు మొత్తం చెక్ చేశారట. ఆ తర్వాతనే మొహ్సిన్ నఖ్వీని పంపించినట్లు ఓ వీడియో బయటకు వచ్చింది.

Also Read: T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ 2026 నుంచి త‌ప్పుకున్న జియో హాట్‌స్టార్‌, స్టార్ స్పోర్ట్స్‌..రంగంలోకి నెట్ ఫ్లిక్స్ ?

లండ‌న్ లో మొహ్సిన్ నఖ్వీ ఘోర అవ‌మానం

Advertisement

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ను ( Pakistan Super League 2026 Tournament )
చాలా గ్రాండ్ గా ప్రారంభించేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఏకంగా లండన్ లోనే రోడ్ షో కు ప్లాన్ చేసింది. మొన్న డిసెంబర్ 7వ తేదీ రాత్రి లండన్ లార్డ్స్ క్రికెట్ స్టేడియంలో ( Lord’s Cricket Ground ) ప్రత్యేక ఈవెంట్ నిర్వహించి రోడ్ షో కూడా నిర్వహించారు. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ను ఒప్పించి మరి, ఈ రేంజ్ లో పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ప్లాన్ చేసింది. ఇక వచ్చేవారం న్యూయార్క్ లో కూడా రోడ్ షో నిర్వహించేలా ప్రణాళికలు చేస్తోంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఈ మేరకు రంగం సిద్ధం చేసింది పాకిస్తాన్. ఐపీఎల్ కంటే పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ పాపులర్ కావాలనే, ఉద్దేశంతో ఈ రోడ్ షోలు నిర్వహిస్తోంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.

ఇందులో భాగంగానే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మొహ్సిన్ నఖ్వీ లండన్ ప‌య‌నమయ్యారు. మొన్న డిసెంబర్ 7వ తేదీన ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో పాల్గొనడమే కాకుండా లండన్ కు సంబంధించిన ఓ సీనియర్ మంత్రిని కూడా కలిశారు మొహ్సిన్ నఖ్వీ. ఆయనను కలిసి హోటల్ రూమ్ కు వస్తున్న సందర్భంగా మొహ్సిన్ నఖ్వీ కారును అర్ధాంతరంగా పోలీసులు ఆపేశారు. తాను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్, పాకిస్తాన్ సీనియర్ మంత్రిని అంటూ మొహ్సిన్ నఖ్వీ పదే పదే చెప్పారట. అయినప్పటికీ ఆయనను నడిరోడ్డు పైన దించి కారు చెక్ చేశారట లండన్ పోలీసులు. దీంతో మొహ్సిన్ నఖ్వీకు ఘోర అవ‌మానం లండ‌న్ లో జ‌రిగింద‌ని వార్త‌లు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.

Advertisement

Also Read: Rohit-Kohli: రావణాసురుడిగా గంభీర్.. రామలక్ష్మణ్ అవ‌తారంలో రోకో..దుమారం రేపుతోన్న పోస్ట‌ర్‌!

 

 

Related News

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

Big Stories

Advertisement
×