E-Paper
Advertisement

Rohit-Kohli: రావణాసురుడిగా గంభీర్.. రామలక్ష్మణ్ అవ‌తారంలో రోకో..దుమారం రేపుతోన్న పోస్ట‌ర్‌!

Rohit-Kohli: రావణాసురుడిగా గంభీర్.. రామలక్ష్మణ్ అవ‌తారంలో రోకో..దుమారం రేపుతోన్న పోస్ట‌ర్‌!
Advertisement

Rohit-Kohli:  టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై దారుణంగా ట్రోలింగ్స్ నడుస్తున్నాయి. ఎవరు పడితే వాళ్లు, నూటికి వచ్చిన మాట అనేస్తున్నారు. టీమిండియా అభిమానులతో పాటు సీనియర్ క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు దుమ్మెత్తి పోస్తున్నారు. గౌతమ్ గంభీర్ స్ట్రాటజీ కారణంగా టీమిండియా టెస్ట్ క్రికెట్ ప్రమాదంలో పడిందని బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మాజీలు. రవి శాస్త్రి తో పాటు సునీల్ గవాస్కర్ అయితే ముఖం మీద తిట్టేస్తున్నారు. ఇన్ని తిట్లు తిట్టినా, టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ దులిపేసుఏకుంటున్నారు. చీమ కుట్టిన‌ట్లు కూడా వ్య‌వ‌హ‌రించ‌డం లేదు. ఇక మొన్న వ‌న్డే సిరీస్ గెలిచాక‌, ప్రెస్ మీట్ పెట్టి, ట్రోల‌ర్స్ ను చెడుగుడు ఆడేసుకున్నారు. త‌న వ‌ల్లే టీమిండియా వ‌న్డే సిరీస్ గెలించింది అన్న రేంజ్ లో ఊగిపోయారు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.

Also Read: Ind vs Sa 3rd Odi: స్టెప్ క్యాచ్ ప‌ట్టి, రివ్యూ తీసుకున్న కేఎల్ రాహుల్‌.. కోహ్లీ రియాక్ష‌న్ చూడండి, న‌వ్వుకోవాల్సిందే

రావణాసురుడి అవతారంలో గౌతమ్ గంభీర్

Advertisement

టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య విశాఖ వేదికగా మూడవ వన్డే మొన్న శనివారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో 9 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టిన టీమిండియా, వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. ఇలాంటి నేపథ్యంలో తెలుగు ఫాన్స్ ఓ రేంజ్ లో గౌతమ్ గంభీర్ కు కౌంటర్ ఇచ్చారు. టీం ఇండియా టెస్ట్ క్రికెట్ నాశనం చేసేది గౌతమ్ గంభీర్ అంటూ రావణాసురుడి గెటప్ లో అతని ప్లకార్డు క్రియేట్ చేశారు. ఇక రావణాసురుడి గెటప్ లో ఉన్న గౌతమ్ గంభీర్ ను సంహరించేందుకు రామలక్ష్మణ్‌ రూపంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సిద్ధంగా ఉన్నారని ఓ ప్లకార్డు పట్టుకొని విశాఖ తెలుగు అభిమానులు రచ్చ చేశారు. దీనికి సంబంధించిన ప్లకార్డ్ ఇప్పుడు వైరల్ గా మారింది. టీమిండియాకు పట్టిన గౌతమ్ గంభీర్ పీడను తొలగించేందుకు రోకో వచ్చేసారని అర్థం వచ్చేలా ఈ ప్లకార్డు ప్రదర్శించారు. ఇది చూసిన క్రికెట్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఎవడు చేశాడు కానీ ఇది అద్భుతం… విశాఖ గ్రౌండ్ లో రామాయణం చూపించారని కామెంట్స్ చేస్తున్నారు. ఇదే ఊపులో గంభీర్ ను చంపేయండి అంటూ మ‌రికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు.

గౌతమ్ గంభీర్ స్థానంలో మహేంద్రసింగ్ ధోనికి స్థానం?

టీమిండియా హెడ్ కోచ్ గా ఉన్న గౌతమ్ గంభీర్ ను వెంటనే మార్చాలని చాలా మంది మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ అతన్ని మార్చితే వెంటనే మహేంద్రసింగ్ ధోనీకి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అతని కాళ్లు పట్టుకొని అయినా ఒప్పించాలని డిమాండ్ చేస్తున్నారు అభిమానులు. లేకపోతే టీమిండియాను కాపాడడం దేవుడి తరం కూడా కాదని హెచ్చరిస్తున్నారు.

Advertisement

Also Read: DK Shivakumar: ఆర్సీబీ ఫ్యాన్స్ కు ట్ర‌బుల్ షూట‌ర్‌ గుడ్ న్యూస్‌..చిన్న‌స్వామికి ఎలాంటి ఢోకా లేదు, ఇక పండ‌గే

 

Related News

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

పుట్టినిల్లా ? మెట్టినిల్లా ? బక్కోడిని ఆడుకుంటున్న ఐపీఎల్ ఫ్యాన్స్

ఒరేయ్ ఇన్ని రోజులు ఎక్క‌డున్నావ్ రా? న‌మ‌న్ ధీర్ బ్యాటింగ్ చూసి బిత్త‌ర‌పోయిన గంభీర్‌

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

Big Stories

Advertisement
×