E-Paper
Advertisement

PAK vs ZIM, HAT-TRICK: మిస్టరీ స్పిన్న‌ర్‌ ఉస్మాన్ తారిక్ హ్యాట్రిక్ ..జింబాబ్వేపై పాకిస్తాన్ విజయం

PAK vs ZIM, HAT-TRICK: మిస్టరీ స్పిన్న‌ర్‌ ఉస్మాన్ తారిక్ హ్యాట్రిక్ ..జింబాబ్వేపై  పాకిస్తాన్ విజయం
Advertisement

PAK vs ZIM, HAT-TRICK:  రావాల్పిండి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న టి20 ట్రై సిరీస్ లో పాకిస్తాన్ దుమ్ము లేపుతోంది. జింబాబ్వే, పాకిస్తాన్ అలాగే శ్రీలంక‌ మూడు జట్లు ఈ ట్రై సిరీస్ లో పాల్గొంటున్నాయి. ఈ టోర్నమెంట్ లో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఇందులో పాకిస్తాన్ వరుసగా మూడు మ్యాచ్ ల‌లో విజయం సాధించి నెంబర్ వన్ స్థానంలో ఉంది. ఇక ఇవాళ పాకిస్తాన్ వర్సెస్ జింబాబ్వే మధ్య నాలుగవ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో జింబాబ్వేపై ఏకంగా 69 పరుగులు తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది పాకిస్తాన్. అయితే జింబాబ్వే పైన పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్‌ అద్భుతమైన బౌలింగ్ చేశాడు. అంతేకాదు హ్యాట్రిక్ కూడా సాధించి సరికొత్త చరిత్ర సృష్టించాడు.

Also Read: Aus vs Eng Ashes 2025-26 : సెంచరీతో రెచ్చిపోయిన హెడ్.. మొదటి టెస్ట్ లో ఆస్ట్రేలియా విజయం.. 2 రోజుల్లోనే మ్యాచ్ ఫినిష్

మిస్టరీ స్పిన్న‌ర్‌ ఉస్మాన్ తారిక్ హ్యాట్రిక్

Advertisement

పాకిస్తాన్ వర్సెస్ జింబాబ్వే ( Pakistan vs Zimbabwe, 4th Match ) మధ్య ఇవాళ జరిగిన టి20 మ్యాచ్ లో మిస్టరీ విన్నర్ ఉస్మాన్ తారిక్ హ్యాట్రిక్ సాధించాడు. జింబాబ్వేకు చెందిన టోనీ మునియోంగా (Tony Munyonga), తషింగా ముసేకివా
( Tashinga Musekiwa), వెల్లింగ్టన్ మసకడ్జా (Wellington Masakadza) వికెట్లను వరుసగా పడగొట్టి హ్యాట్రిక్ సాధించాడు. ఈ మ్యాచ్ 10వ ఓవ‌ర్ లో ఈ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ హ్యాట్రిక్ సాధించిన నేపథ్యంలో సరికొత్త చరిత్ర కూడా సృష్టించాడు. పాకిస్తాన్ జట్టు తరుపున టీ20 క్రికెట్ లో హ్యాట్రిక్ సాధించిన నాలుగవ బౌలర్ గా రికార్డులోకి ఎక్కాడు ఉస్మాన్ తారిక్ ( HAT-TRICK FOR USMAN TARIQ). ఈ మ్యాచ్ లో నాలుగు ఓవర్లు వేసిన ఉస్మాన్ తారిక్ ఒక మేడిన్ ఓవర్ వేశాడు. అలాగే 18 పరుగులు ఇచ్చి ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఈ దెబ్బకు జింబాబ్వే 19 ఓవర్లలో 126 పరుగులు చేసి కుప్పకూలింది. దీంతో పాకిస్తాన్ గ్రాండ్ విక్టరీ కొట్టింది.

69 పరుగుల తేడాతో పాకిస్తాన్ విజయం

ట్రై సిరీస్ లో భాగంగా ఇవాళ జింబాబ్వే వర్సెస్ పాకిస్తాన్ మధ్య నాలుగో మ్యాచ్ జరిగింది. ఇందులో పాకిస్తాన్ మొదటి బ్యాటింగ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిర్ణీత‌ ఓవర్లలో పాకిస్తాన్ ఐదు వికెట్లు నష్టపోయి 196 పరుగుల భారీ టార్గెట్ జింబాబ్వే ముందు ఉంచింది. పాకిస్తాన్ ఓపెనర్ ఫర్హాన్ 63 పరుగులు సాధించగా బాబర్ 74 పరుగులతో రెచ్చిపోయాడు. చివరలో ఫకర్ జమాన్ 27 పరుగులతో దుమ్ము లేపాడు. దీంతో 195 పరుగుల భారీ టార్గెట్ సాధించగలిగింది పాకిస్తాన్. ఇక ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో జింబాబ్వే దారుణంగా విఫలమైంది. దీంతో 69 పరుగుల తేడాతో ఓడిపోయింది జింబాబ్వే.

Advertisement

Also Read: T20 World Cup 2026: ఆ రోజునే పాకిస్తాన్ వ‌ర్సెస్ ఇండియా మ‌ధ్య మ‌రోసారి మ్యాచ్‌… ఏ గ్రూపులో ఏ జట్లు ఉంటాయంటే?

 

Related News

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

Big Stories

Advertisement
×