E-Paper
Advertisement

Mohsin Naqvi: బంగ్లాదేశ్ కోసం ఇండియాను చిత్తు చేస్తాం, టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తాం

Mohsin Naqvi: బంగ్లాదేశ్ కోసం ఇండియాను చిత్తు చేస్తాం, టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తాం
Advertisement

Mohsin Naqvi: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 ) నుంచి బంగ్లాదేశ్ ( bangladesh ) వైదొలిగింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ( Bangladesh Cricket Board
). అయితే ఈ టోర్నమెంట్ నుంచి బంగ్లాదేశ్ తప్పుకోవడం పై పాకిస్తాన్ స్పందించింది. ఈ మేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ మొహ్సీన్ న‌ఖ్వీ ( Pakistan President Mohsin Naqvi ) కీలక వ్యాఖ్యలు చేశారు. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నుంచి తప్పుకున్న బంగ్లాదేశ్ కోసం మేము సర్వం చేస్తాం అంటూ ప్రకటించారు. వాళ్లు వైదొలిగిన సరే.. ఇండియాను చిత్తుగా ఓడించి టి20 వరల్డ్ కప్ గెలుస్తామని స్పష్టం చేశారు. బంగ్లాదేశ్ కోసం టి20 వరల్డ్ కప్ గెలుచుకొని తీసుకువస్తామని మొహ్సీన్ న‌ఖ్వీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో మొహ్సీన్ న‌ఖ్వీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదంగా మారాయి.

Also Read: RCB Players-Indian roads: ఇండియ‌న్ రోడ్ల‌పై RCB లేడీ ప్లేయ‌ర్లు…గాజులు వేసుకుని ఇంట్లో కూర్చోండిరా ? బంగ్లాపై ట్రోలింగ్‌

ఇండియన్ ఓడించి టి20 ప్రపంచ కప్ గెలుస్తాం

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నుంచి బంగ్లాదేశ్ తప్పుకోవడం పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ మొహ్సీన్ న‌ఖ్వీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ కోసమైనా ఇండియాను చిత్తుగా ఓడించి.. టి20 ప్రపంచ కప్ గెలుస్తామని మొహ్సీన్ న‌ఖ్వీ. అనుక్షణం బంగ్లాదేశ్ కోసం ప్రయత్నం చేశాం… ఐసీసీ నిర్వహించిన ఓటింగ్ లో కూడా బంగ్లాదేశ్ కు అనుకూలంగా ఓటు వేసినట్లు గుర్తు చేశారు. బంగ్లాదేశ్ బై కాట్ చేసిందని మేము కూడా అలా చేయలేము.. ఖచ్చితంగా టి20 ప్రపంచ కప్ ఆడతాం, ట్రోఫీ గెలుచుకుంటామని వెల్లడించారు. ఇందులో ఎలాంటి డౌట్ లేదన్నారు. ఈసారి టి20 ప్రపంచ కప్ టోర్నమెంటులో తమ జట్టు అదరగొడుతుందని ధీమా వ్యక్తం చేశారు. గతంలో లాగా తమ జట్టు వీక్ గా లేదని… చాలా బలంగా ఉందని వెల్లడించారు.

టి20 ప్రపంచ కప్ నుంచి వైదొలిగిన బంగ్లాదేశ్

ఐసీసీ విధించిన రెండు రోజుల డెడ్ లైన్ పట్టించుకోని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ ( Bangladesh Cricket Board ) సంచలన ప్రకటన చేసింది. మీరు ఎన్ని చెప్పినా టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ( T20 World Cup 2026 )  భాగంగా ఇండియాలో పర్యటించబోమని వెల్లడించింది. అందుకే ఈ టోర్నమెంట్ నుంచి తప్పుకుంటున్నట్లు స్పష్టం చేసింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు. తమకు క్రికెట్ కంటే ప్లేయర్ల ప్రాణాలు ముఖ్యమని వ్యాఖ్యానించింది. ప్రస్తుత హింసాత్మక పరిస్థితుల నేపథ్యంలో, బంగ్లాదేశ్ లో పర్యటిస్తే తమ ప్లేయర్లకు ప్రాణహాని ఉంటుందని బాంబు పేల్చింది. అందుకే టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ఆడడం లేదని తెలిపింది. దీంతో బంగ్లాదేశ్ స్థానంలో ఈ టోర్నమెంట్ లోకి స్కాట్లాండ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

Also Read: Yuzvendra Chahal: మ‌రో లేడీ చేతిలో మోస‌పోయిన యుజ్వేంద్ర చాహల్..రూ.60 కోట్లు నొక్కేసి..అన్ ఫాలో చేసిందిగా!

 

Related News

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

Big Stories

Advertisement
×