Aqib Javed: పాకిస్తాన్ వివాదాస్పద స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్ పై చాలా మంది విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. మొట్టమొదటగా ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్రీన్, ఈ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చాడు. పాకిస్తాన్ గడ్డపైనే ఉస్మాన్ పరువు తీశాడు. ఉస్మాన్ తారిక్ ది త్రో బౌలింగ్ అంటూ లైవ్ మ్యాచ్ సందర్భంగానే పేర్కొంటూ హాట్ కామెంట్స్ చేశాడు గ్రీన్. ఇక టి20 వరల్డ్ కప్ సందర్భంగా కూడా చాలామంది ఇండియన్ ఫ్యాన్స్, ఉస్మాన్ తారీక్ బౌలింగ్ యాక్షన్ ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఈ వివాదం పై తాజాగా పాకిస్తాన్ సెలెక్టర్ అకిబ్ జావేద్ స్పందించారు. ఉస్మాన్ తారిక్ ( Usman Tariq ) ది త్రో బౌలింగ్ అయితే, టీమిండియా డేంజర్ బౌలర్ బుమ్రాది కూడా త్రో బౌలింగ్ అవుతుందని బాంబు పేల్చాడు. బుమ్రా ( Bumrah) కూడా డిఫరెంట్ గా బౌలింగ్ చేస్తాడని… అతని యాక్షన్ పై కూడా విచారణ చేయాల్సి ఉంటుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు అకిబ్ జావేద్( Aqib Javed). అతనికి ఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి బౌలింగ్ చేస్తున్నాడు.. ఉస్మాన్ తారిక్ విషయంలో కూడా అదే జరిగిందని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు అకిబ్ జావేద్ ( Pakistan selector Aqib Javed).
Also Read: Shubman Gill On Sanju: ఛీ..ఛీ ఇదేం బతుకురా, సంజుపై గిల్ కుట్రలు..ఫోటో మార్ఫింగ్ చేసి మరీ!
బుమ్రా ( Bumrah), తారిక్ బౌలింగ్ యాక్షన్ లపై తాజాగా పాకిస్తాన్ సెలక్టర్ అకిబ్ జావేద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
టీమిండియా ఫాస్ట్ బౌలర్ బుమ్రా చాలా వింతగా బౌలింగ్ చేస్తాడని వ్యాఖ్యానించారు అకిబ్ జావేద్ ( Pakistan selector Aqib Javed). అతని బౌలింగ్ లో వైవిధ్యం ఉంటుందని తెలిపాడు. యార్కర్లు అద్భుతంగా వేయగల మొనగాడు బుమ్రా అని కొనియాడారు. వసీం అక్రమ్, వకార్ యూనిస్ లాంటి దిగ్గజాలు వేసినట్లుగానే బుమ్రా బౌలింగ్ చేస్తాడని ప్రశంసలు కురిపించాడు అకిబ్ జావేద్. అయితే పాకిస్తాన్ తరఫున కూడా ఉస్మాన్ తారిక్ ( Usman Tariq ) స్పిన్ బౌలింగ్ లో అద్భుతాలు సృష్టిస్తాడని తెలిపాడు.
కానీ కొంత మంది కావాలనే అతనిపై కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. ఐసీసీ ( ICC Rules) రూల్స్ ప్రకారం ఉస్మాన్ తారిక్ బౌలింగ్ చేస్తున్నాడని వ్యాఖ్యానించారు. ఐసీసీకి లేని ఇబ్బంది ఇండియన్ ఫాన్స్ కు ఎందుకు ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ సందర్భంగా ఉస్మాన్ తారిక్ ను చాలా మంది హేళన చేశారని మండిపడ్డారు. అయినప్పటికీ ఓర్పుగా అతడు బౌలింగ్ చేసి జట్టు కోసం చాలా కష్టపడ్డాడని ప్రశంసించాడు. భవిష్యత్తులో ఉస్మాన్ తారిక్ తోపు క్రికెటర్ అవుతాడని ఆశాభావం వ్యక్తం చేశారు అకిబ్ జావేద్.
?igsh=MmUzYzRzbnUyNDJ0