E-Paper
Advertisement

Madhavi Latha: మరో వివాదానికి తెరలేపిన మాధవి లత.. ఈసారి ఏకంగా శ్రీవారి ప్రసాదంపై!

Madhavi Latha: మరో వివాదానికి తెరలేపిన మాధవి లత.. ఈసారి ఏకంగా శ్రీవారి ప్రసాదంపై!
Advertisement

Madhavi Latha: ప్రముఖ సినీనటి మాధవి లత(Madhavi Latha) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రతి విషయంపై స్పందిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మహిళలకు మద్దతుగా నిలిచే మాధవి లత ఇటీవల అంతర్జాతీయ మహిళా దినోత్సవం ముగిసిన తర్వాత మగాళ్ళ గురించి కామెంట్లు చేసి వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా మగాళ్లు కోటిలో ఒక్కరు మాత్రమే మంచి వాళ్ళు ఉంటారని.. మిగతా వాళ్ళంతా కాకి రెట్ట వేయడానికి కూడా వారి ముఖం పనికిరాదు అంటూ సంచలన కామెంట్లు చేసి సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టించింది. అయితే ఇప్పుడు ఏకంగా శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కామెంట్లు చేసి మరోసారి వార్తల్లో నిలిచింది ఈ ముద్దుగుమ్మ.

తిరుమల లడ్డూ పై మాధవి లతా కామెంట్..

Advertisement

అసలే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై నెలకొన్న వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వేళ.. ఈమె చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే.. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించారన్న ఆరోపణలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ వివాదం పై బిజెపి నాయకురాలు, సినీనటి మాధవి లత స్పందించింది. ఇటీవల తిరుమల నుంచి వచ్చిన కల్యాణోత్సవ లడ్డూల గురించి ఆమె సోషల్ మీడియాలో స్పందిస్తూ.. తన అనుభవాలను పంచుకుంది. మాధవి లత మాట్లాడుతూ..” తిరుమల నుంచి వచ్చిన లడ్డూలను ఎంతో ఆశగా స్వీకరించాను. కానీ వాటి రుచి ఆశించినంతగా లేదు. లడ్డూ చాలా గట్టిగా ఉంది. సాధారణంగా ఉండే నెయ్యి సువాసన ఎక్కడా కనిపించలేదు. లడ్డూలో చక్కెర చాలా ఎక్కువగా ఉంది. పచ్చ కర్పూరం ఎక్కువగా ఉపయోగించారు. డ్రై ఫ్రూట్స్ బాగానే ఉన్నప్పటికీ లడ్డూ రుచి మాత్రం ఆశించినంత లేదు. తిరుమల శ్రీవారి వంటి గొప్ప ఆలయానికి సంబంధించిన ప్రసాదం ఇలా ఉండడం బాధ కలిగించింది” అంటూ ఆమె తన అభిప్రాయాన్ని పంచుకుంది.

ALSO READ:Vijay Sethupathi: మహారాజా సీక్వెల్ పై విజయ్ క్లారిటీ.. మాస్ అభిమానులకు మంచి ఫీస్ట్!

అభిప్రాయాన్ని మాత్రమే చెప్పానంటూ..

Advertisement

ఇకపోతే ఇదే ఇంటర్వ్యూలో మాధవి లత మాట్లాడుతూ..” నేను హిందువుని. శ్రీవారి భక్తురాలిని. భక్తి భావంతోనే ఈ వ్యాఖ్యలు చేశాను. నాణ్యతపై ప్రశ్నించడం తప్పు కాదు. ఒక భక్తురాలిగా మంచి నాణ్యత కలిగిన ప్రసాదం కావాలని కోరుకుంటున్నాను. అయితే గత డిసెంబర్ నెలలో నేను తిన్న లడ్డు చాలా మృదువుగా మంచి రుచిగా ఉంది. కానీ ఇటీవల అందుకున్న కల్యాణోత్సవ లడ్డూ మాత్రం రాయి లాగా ఉంది” అంటూ తెలిపింది. మొత్తానికైతే మాధవి లతా చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో మళ్లీ చర్చకు దారి తీస్తున్నాయి. కొంతమంది ఈయనకు మద్దతుగా పలుకుతుంటే మరికొంతమంది స్వామి వారి లడ్డూ గురించి ఇలా మాట్లాడడం సరికాదు అంటూ కామెంట్ చేస్తున్నారు ఏది ఏమైనా మాధవి లత తన అభిప్రాయాన్ని చెప్పడంలో తప్పులేదు కదా అంటూ నేటిజన్స్ ఆమెకు మద్దతు పలుకుతూ ఉండడం విశేషం. మరి ఈ విషయం ఇంకెంత చర్చకు దారి తీస్తుందో చూడాలి.

https://www.facebook.com/share/p/1HYvLKuq79/

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×