E-Paper
Advertisement

GHMC: జీహెచ్ఎంసీ కమిషనర్ల ఆకస్మిక తనిఖీలతో జంకుతున్న అక్రమార్కులు

GHMC: జీహెచ్ఎంసీ కమిషనర్ల ఆకస్మిక తనిఖీలతో జంకుతున్న అక్రమార్కులు
Advertisement

GHMC: స్వేచ్ఛ బ్యూరో: కోర్ అర్బన్ రీజియన్ లోని 27 పట్టణ స్థానిక సంస్థల విలీనంతో గత నెల 11వ తేదీన ఏర్పడిన మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో అంతా బిజీ బిజీ వాతావరణం కన్పిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నెల 6వ తేదీ నుంచి ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక పేరిట ప్రతి రోజు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తూ, మూడు కార్పొరేషన్ల కమిషనర్లు హడావుడి చేస్తున్నారు. ముగ్గురు కమిషనర్లు డైలీ మార్నింగ్ నిర్వహిస్తూ పారిశుద్ధ్య, ఈ- వేస్ట్ సేకరణ పనులను ఆకస్మికంగా తనిఖీలు చేస్తుండటంతో మూడు కార్పొరేషన్ల అధికారులు, సిబ్బంది ఉరుకులు, పరుగులు పెడుతున్నారు.

ఎపుడు ఎక్కడికి వస్తారో..?

ముఖ్యంగా మూడు కార్పొరేషన్లలో ఇటీవలే కొత్తగా ఏర్పడిన సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్లలో జీహెచ్ఎంసీ తరహా శానిటేషన్ పనులను గాడీన పెట్టేందుకు కమిషనర్లు సృజన, వినయ్ కృష్ణా రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధి మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా ఏర్పడకముందు ఉదయం పది, పదిన్నర గంటలకు ఆఫీసుకువచ్చి విధులు నిర్వర్తించిన అధికారులు ఇపుడు కమిషనర్ ఎపుడు ఎక్కడికి వస్తారో? ఎక్కడ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారోనన్న భయంతో బిక్కుబిక్కుమంటున్నట్లు తెలిసింది. ముఖ్యంగా సైబరాబాద్ కమిషనర్ సృజన, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ ముందస్తుగా ఎలాంటి సమాచారం లేకుండా ఒక స్పాట్ కు వచ్చి, శానిటేషన్ పనులను ఆకస్మికంగా తనిఖీ చేస్తూ ఆ తర్వాత విభాగాల వారీగా పనులను తనిఖీ చేస్తూ, పలు సూచనలు, ఆదేశాలను జారీ చేస్తున్నారు. ముగ్గురు కమిషనర్ల డైలీ షెడ్యూల్ లో మొదటి ప్రాధాన్యత ప్రజాపాలన అనివృద్ది ప్రణాళిక కింద సర్కారు ఇచ్చిన థీమ్ ప్రకారం కార్యక్రమాలు జరుగుతున్నాయా? లేదా? ఒక వేళ జరుగుతుంటే పనులను పూర్తి స్థాయిలో పరిశీలించి, తగిన సూచనలు, ఆదేశాలను జారీ చేస్తున్నారు.

Advertisement

Also Read: Internet Data Tax: ఇంటర్నెట్ డేటాపై పన్ను.. ప్రతి ఒక్కGBపై ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించాలి.. ఎంతంటే?

ఆకస్మికంగా తనిఖీలు

ఉదయం ఆరు గంటలకే ఫీల్డు లెవెల్‌లో ఉంటున్న కమిషనర్లు మధ్యాహ్నాం వరకు పౌర సేవల నిర్వహణ, పలు అభివృద్ది పనుల తీరును పరిశీలించిన తర్వాత లంచ్ టైమ్ కల్లా వారివారి కార్యాలయాలకు చేరుకుని, ఉదయం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించిన వివిధ అంశాలకు సంబంధించి విభాగాధిపతులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. జీహెచ్ఎంసీ(GHMC)లో మొదటి నుంచి కూడా వివిధ విభాగాల వారీగా పౌర, అత్యవసర సేవలందించే యంత్రాంగం యాక్టీవ్ గా ఉన్నా, కొత్తగా ఏర్పడిన సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్లలో ఇంకా విభాగాల వారీగా సేవలు గాడీన పడినందున, ఈ రెండు కార్పొరేషన్ల కమిషనర్లు ఈ విషయంపై స్పెషల్ గా ఫోకస్ చేస్తున్నట్లు తెలిసింది. శనివారం కూడా సైబరాబాద్, జీహెచ్ఎంసీ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్లు ఈ- వేస్ట్ సేకరణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేసి, సిబ్బందికి పలు సూచనలు, సలహాలను అందజేశారు.

సూచనలు సలహాలు

Advertisement

మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కూడా డైలీ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పనులను వివిధ విభాగాలకు చెందిన అంశాల వారీగా పరిశీలిస్తూ, ఆ తర్వాత తార్నాకలోని ప్రధాన కార్యాలయంలో సమీక్షలు నిర్వహిస్తూ కింది స్థాయి అధికారులు, సిబ్బందికి తగిన సూచనలు సలహాలు అందజేస్తున్నారు. మూడు కార్పొరేషన్ల కమిషనర్లు డైలీ ఉదయం ఆకస్మిక తనిఖీలు, మధ్యాహ్నాం సమీక్షలు నిర్వహిస్తూనే సందర్శకులకు కూడా సమయం కేటాయించి, వారి నుంచి ఫిర్యాదులను, వినతులను స్వీకరిస్తున్నారు. మూడు కార్పొరేషన్లలో ఒక్క జీహెచ్ఎంసీలోని శనివారం ఒక్క రోజు ఉద్యోగుల గ్రీవియెన్స్ డేను పాటిస్తుండగా, కొత్తగా ఏర్పడిన సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్లలో ఉద్యోగుల కోసం స్పెషల్ గ్రీవియెన్స్ డే అంటూ ఏమీ మొదలుకాలేదు.

Also Read: Power Demand: విద్యుత్ వినియోగంలో తెలంగాణ ఆల్ టైం రికార్డు..?

Related News

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

Big Stories

Advertisement
×