Sunrisers Hyderabad : ది హండ్రెడ్ లీగ్ వేలంలో ( The Hundred Auction) పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను ( abrar ahmed ) కొనుగోలు చేసిన కావ్య పాప వివాదంలో ఇరుక్కుంది. పాకిస్తాన్ ఆటగాడి అబ్రార్ అహ్మద్ ను కొనుగోలు చేసిన నేపథ్యంలో కావ్య పాప ( kavya maran) దేశ ద్రోహి అంటూ ముద్ర వేస్తున్నారు ఇండియన్ ఫ్యాన్స్. అంతేకాదు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పైన ఐదు సంవత్సరాల పాటు బ్యాన్ విధించాలని కోరుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మరో ఊహించని ఎదురు దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. ఈ జట్టుకు సంబంధించిన స్పాన్సర్లు ఒక్కొక్కరు వైదొలుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే 12 కంపెనీలు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ( SRH) గుడ్ బై చెప్పినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ది హండ్రెడ్ లీగ్ వేలంలో ( The Hundred Auction) పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను సన్ రైజర్స్ లీడ్స్ జట్టు ఓనర్ కావ్య మారన్ కోట్లు పెట్టి కొనుగోలు చేశారు. రూ. 2.34 కోట్లు పెట్టి, ఏమైంది పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను ఏరి కోరి కొనుగోలు చేశారు కావ్య పాప. దీంతో వివాదం మొదలైంది. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై ఐదు సంవత్సరాల పాటు వ్యాన్ విధించాలని డిమాండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆడకుండా చేయాలని కోరుతున్నారు. అయితే ఇంత రేంజిలో వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో స్పాన్సర్లు కూడా వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
మొత్తం 12 ప్రముఖ కంపెనీలు… స్పాన్సర్షిప్ నుంచి తప్పుకోవాలని డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో కంపా, వ్రాన్, రియల్ క్రికెట్, RKG, కింగ్ ఫిషర్, సిటీ యూనియన్ బ్యాంక్, లూపు ఇయర్ ప్లగ్స్, స్టార్ హెల్త్ ( Star Health), స్పిన్నర్, ఎయిర్ ఏషియా, డ్రాపి హబ్ లాంటి స్పాన్సర్లు తప్పుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అటు జియో కూడా ఇదే బాటలో నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే నిజమైతే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు భారీ స్థాయిలో నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. దాదాపు 500 కోట్ల వరకు నష్టపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. మళ్లీ కొత్త స్పాన్సర్లు కూడా ముందుకు వచ్చే ఛాన్స్ లేదని చెబుతున్నారు. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. అదే సమయంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు జెర్సీలు, జెండాలను కూడా తగలబెడుతున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును బ్యాన్ చేయాలంటూ కోరుతున్నారు.
🚨 BREAKING NEWS 🚨
🚨 SRH FACES POSSIBLE SPONSOR EXIT🚨
Boat could step away from its Official Partnership with Sunrisers Hyderabad after the franchise reportedly signed Pakistan player Abrar Ahmed.
brand is considering ending its association with the team amid the ongoing… pic.twitter.com/e1tHG6AYsN
— muffatball vikrant (@Vikrant_1589) March 14, 2026