E-Paper
Advertisement

ఈ నాలుగు సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే, మీ జీవితంలో మంచి రోజులు మొదలైనట్లే!

ఈ నాలుగు సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే, మీ జీవితంలో మంచి రోజులు మొదలైనట్లే!
Advertisement

Lucky Signs Before Success: ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక దశలో మంచి రోజులు ప్రారంభమవుతాయని చాలా మంది నమ్ముతుంటారు. అలాంటి శుభ సమయం వచ్చే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయని చాలా మంది భావిస్తారు. ఈ సంకేతాలు ఆలోచనలు, ప్రవర్తన, ఇంటి వాతావరణంలో మార్పుల రూపంలో కనిపించే అవకాశం ఉంటుంది. ఈ సంకేతాలు  శాస్త్రీయంగా నిర్ధారించబడిన విషయాలు కాకపోయినా, భారతీయ సంప్రదాయాలు, జ్యోతిష్యం, ఆధ్యాత్మిక నమ్మకాలలో ప్రత్యేక ప్రాధాన్యం కలిగి ఉన్నాయి. అలాంటి నాలుగు శుభ సంకేతాల గురించి  తెలుసుకుందాం.

1.కలలో మంత్రాలు, దేవాలయ దృశ్యాలు కనిపించడం

నిద్రలో ప్రతి ఒక్కరికీ కలలు వస్తుంటాయి. అయితే, కొన్నిసార్లు కలలో ‘ఓం’ అనే దివ్య నాదం వినిపించడం, గాయత్రీ మంత్రం, ‘రామ’ నామం వినిపించడంతో పాటు శంఖం, దేవాలయం గంట లాంటి పవిత్ర దృశ్యాలు కనిపిస్తే వాటిని చాలామంది శుభ సూచనగా భావిస్తారు. ఇలాంటి కలల వల్ల ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతోందని, దైవానుగ్రహం లభించే సమయం దగ్గరపడిందని విశ్వసిస్తారు. అలాగే, జీవితంలో మంచి అవకాశాలు, సానుకూల మార్పులు రాబోతున్నాయని కూడా కొందరు నమ్ముతారు.

2.బ్రహ్మ ముహూర్తంలో మెలకువ రావడం

Advertisement

తెల్లవారుజామున సుమారు ఉదయం 3 గంటల నుంచి 5 గంటల మధ్య సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. ఈ సమయంలో సహజంగానే తరచూ మెలకువ వస్తుంటే, దానిని కొందరు ఆధ్యాత్మిక సంకేతంగా భావిస్తారు. ఆ సమయంలో మనసు ప్రశాంతంగా ఉండటంతో ధ్యానం, ప్రార్థన, ఆత్మపరిశీలనకు అనుకూలమైన సమయమని చెప్తారు. ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం ఈ సమయంలో మెలకువ రావడం జీవితంలో సానుకూల మార్పులు ప్రారంభమయ్యే సూచనగా పరిగణిస్తారు.

3.శరీరంలో ప్రత్యేక మార్పులు

జ్యోతిష్య సంప్రదాయాల్లో శరీరంలో జరిగే కొన్ని చిన్న మార్పులకు కూడా ప్రత్యేక అర్థాలు చెబుతుంటారు.  పురుషులకు కుడి కన్ను, కుడి శరీర భాగం అదరడం శుభప్రదమని, మహిళలకు ఎడమ వైపు అదరడం మంచి సంకేతమని విశ్వసిస్తారు. ఇవి త్వరలో శుభవార్త వినే అవకాశం, విజయం, అనుకూల పరిణామాలు చోటుచేసుకునే సూచనలుగా భావిస్తారు. అయితే, ఇవి సంప్రదాయ విశ్వాసాలు మాత్రమేనని గుర్తుంచుకోవాలి.

4.ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడటం

Advertisement

మంచి రోజులు రావడానికి ముందు ఇంటి వాతావరణంలో కూడా మార్పులు కనిపిస్తాయని చాలామంది నమ్ముతారు. ఇంట్లోని మొక్కలు బాగా పెరిగి పూలు పూయడం, పూజా దీపం ఎక్కువసేపు వెలగడం, కుటుంబ సభ్యుల మధ్య ఆనందం, ప్రశాంతత పెరగడం లాంటి విషయాలను శుభ సంకేతాలుగా చెబుతారు. ఇంట్లో సంతోషం, ఐక్యత, సానుకూల శక్తి పెరగడం వల్ల జీవితంలో కొత్త అవకాశాలు వస్తాయని ఆధ్యాత్మిక విశ్వాసాలు చెప్తుంటాయి.

ఈ నాలుగు సంకేతాలు మీ జీవితంలో కనిపిస్తే, వాటిని చాలా మంది మంచి రోజులు ప్రారంభమయ్యే సూచనలుగా భావిస్తారు. అయితే, ఇవన్నీ ఆధ్యాత్మిక విశ్వాసాలు, సంప్రదాయాల్లో భాగమే. జీవితంలో విజయం సాధించాలంటే కృషి, సానుకూల ఆలోచన, పట్టుదల, సరైన నిర్ణయాలు కూడా అంతే ముఖ్యమైనవని గుర్తించాలి.

Read Also: రాగాలు పలికే రాళ్లు.. నల్లగొండలోని ఈ వింత ప్రదేశం గురించి తెలుసా?

Related News

వంగినప్పుడు లేదా కొంచెం బరువు ఎత్తగానే వెన్నునొప్పి వస్తోందా? దీనికి కారణాలు ఇవే

హైదరాబాద్ స్టైల్ దమ్ కా కీమా..ఇలా చేస్తే రుచి అద్భుతం!

నాన్ వెజ్ లవర్స్ కోసం..స్పెషల్ చికెన్ కారం పొడి రెసిపీ

సాధారణ మటన్ కర్రీ కాదండోయ్.. ఈ స్పెషల్ తలావా గోష్త్ టేస్ట్ వేరే లెవల్ అంతే!

సాయంత్రం పూట వేడి వేడి టీతో..ఈ చిట్టి మురుకులు సూపర్ కాంబినేషన్!

మటన్, చికెన్ కూడా వద్దంటారు.. పల్లెటూరి స్టైల్ పనస పొట్టు కూర అంత బాగుంటుంది మరి!

గుత్తి దొండకాయ కూర ఇలా చేస్తే ఎవరైనా లొట్టలేసుకుంటూ తింటారు!

జన్యుపరంగా కొలెస్ట్రాల్ ముప్పు ఉన్నా తగ్గించుకోవచ్చా? చెన్నై అధ్యయనం ఏం చెబుతోంది?

Big Stories

Advertisement
×