Pakistan vs Namibia: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) నేపథ్యంలో పాకిస్తాన్ పరిస్థితి అత్యంత దారుణంగా తయారయింది. జట్టులో బాబర్ ఆజం, షాహీన్ ఆఫ్రిది లాంటి ప్లేయర్లు ఫామ్ లో లేరు. దానికి తోడు ఫామ్ లో ఉన్న ప్లేయర్లు పెద్దగా రాణించడం లేదు. అయినప్పటికీ పడుతూ, లేస్తూ సూపర్ 8 దశకు చేరుకుంది పాకిస్తాన్ జట్టు. అయితే ఇలాంటి తరుణంలో పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇండియా చేతిలో ఓడిపోయిన తర్వాత పాకిస్తాన్ ( Pakistan ) క్రికెటర్లు, సిబ్బంది ఒత్తిడిలోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ కోచ్ మైక్ హెస్సన్ ( Pakistan head coach Mike Hesson) ముఖాన వాటర్ బాటిల్ విసిరాడు కెప్టెన్ సల్మాన్ అలీ అఘా ( skipper Salman Ali Agha ). అంతేకాదు, ఈ ఇద్దరు స్టార్లు ఒకరినొకరు తిట్టుకున్నట్లు సమాచారం అందుతోంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. దీంతో పాకిస్తాన్ జట్టులో గొడవలు జరుగుతున్నట్లు ఇండియాకు చెందిన ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు.
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ( T20 World Cup 2026 tournament) భాగంగా బుధవారం రోజున నమీబియా వర్సెస్ పాకిస్తాన్ ( Pakistan vs Namibia ) మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ కొలంబోలో నిర్వహించగా… చివరి క్షణంలో 102 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది పాకిస్తాన్. ఈ విజయంతో సూపర్ 8 లోకి అడుగుపెట్టింది శత్రుదేశం పాకిస్తాన్. అయితే ఈ మ్యాచ్ లో అద్భుతంగా ఆడినప్పటికీ పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా, ఆ జట్టుకు సంబంధించిన ప్రధాన కోచ్ మైక్ హెస్సన్ మధ్య గొడవ జరిగినట్లు ఓ వీడియో అలాగే ఫోటోలు బయటకు వచ్చాయి.
బ్యాటింగ్ చేసి వచ్చిన తర్వాత.. సల్మాన్ అలీ అఘా, పాకిస్తాన్ ప్రధాన కోచ్ మైక్ హెస్సన్ మధ్య సంభాషణ జరిగింది. ఆ తర్వాత వాటర్ బాటిల్ ను కెప్టెన్ సల్మాన్ విసిరేశాడు. దానికి కౌంటర్ గా అసలు నువ్వు మనిషివేనా ? అంటూ కెప్టెన్ సల్మాన్ ను ఉద్దేశించి మైక్ హెస్సన్ బండబూతులు తిట్టినట్లు తెలుస్తోంది. బ్యాటింగ్ ఆర్డర్ మార్చడంపై ఈ ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో బయటకు రావడంతో పాకిస్తాన్ జట్టులో అంతర్యుద్ధం మొదలైందని కామెంట్ చేస్తున్నారు. కాగా నమీబియాపై విజయం సాధించిన పాకిస్తాన్ జట్టు, నేరుగా సూపర్ 8లోకి దూసుకెళ్లింది. ఫిబ్రవరి 21వ తేదీ నుంచే సూపర్ 8 పోరు షురూ కానుంది.
?igsh=anVvNWEzc2lnNmZu
A heated argument between Pakistan's head coach Mike Hesson and the skipper Salman Ali Agha 👀#PAKvsNAM #T20WC2026 #Insidesport #CricketTwitter pic.twitter.com/bp2xNin0fi
— InsideSport (@InsideSportIND) February 18, 2026