Annapurna: మెగాస్టార్ చిరంజీవి గురించి సీనియర్ నటి అన్నపూర్ణమ్మ (Annapurnamma) ఓ ఆసక్తికర విషయం పంచుకున్నారు. ప్రస్తుతం ఆమె ఓ కీలక పాత్రలో నటించిన ‘హే బల్వంత్’ (Hey Balwanth) (‘హే భగవాన్’ చిత్ర టైటిల్ మార్చారు). సుహాస్ (Suhas), శివానీ నాగారం (Shivani Nagaram) హీరోహీరోయిన్లుగా నటించారు. సుహాస్‌కు నానమ్మగా ఇందులో అన్నపూర్ణమ్మ నటించారు. ఫిబ్రవరి 20న విడుదలయ్యేందుకు సిద్ధమైన ఈ చిత్ర ప్రమోషన్స్‌ని మేకర్స్ యమా జోరుగా నిర్వహిస్తున్నారు. ప్రమోషన్‌కు పనికొచ్చే ఏ ఒక్క వేడుకను వారు వదిలి పెట్టడం లేదు. అలా ఇందులో ఓ ప్రముఖ పాత్ర పోషించిన సుదర్శన్, హీరోహీరోయిన్లు, అన్నపూర్ణమ్మ కలిసి ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడ సుదర్శన్ అడిగిన ప్రశ్నకు అన్నపూర్ణ (Annapurna) ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇంతకీ సుదర్శన్ ఏమి అడిగాడు? అన్నపూర్ణమ్మ ఏం సమాధానమిచ్చింది? అనే విషయంలోకి వస్తే..
Also Read- Puri Jagannadh: ఏదో ఒక రోజు కచ్చితంగా ఇండస్ట్రీకి ఇచ్చిపడేస్తాడు.. నో డౌట్!
మీరు ఆ టైమ్‌లో నాన్‌వెబ్ బాగా తినేవారా? అని సుదర్శన్ అడిగిన ప్రశ్నకు అన్నపూర్ణమ్మ సమాధానమిస్తూ.. ‘‘ఆ రోజుల్లో చిరంజీవి సినిమాలకు నాన్‌వెజ్ లేకుండా కథ నడిచేది కాదు. అన్నీ మీరిప్పుడు చెప్పే పెద్ద పీతలు, రొయ్యలు వచ్చేవి’’ అని అన్నారు. మరి ఆయన నాన్‌వెజ్ ఎక్కువగా తినేవారా? అంటే.. ‘‘ఆయన బాగా తినడు. ఆయన కోసమని ఊళ్ల నుంచి వస్తూ తెచ్చేవాళ్లు. వాటిని నాకు కూడా పంపించేవారు. ఆవిడకు ఓ ప్లేటో, గిన్నెలోనూ తీసుకెళ్లి పెట్టమనే వారు. అందుకే అప్పట్లో అన్నీ తినేదాన్ని. ఇప్పుడు మీరు తినేవి అన్నీ చిన్నగా ఉంటాయి. అప్పట్లో రొయ్యలు, పీతలు చాలా పెద్దగా ఉండేవి. ఈ మధ్యకాలంలో నేను తినడం లేదు. ఓ ఐదారేళ్ల నుంచి మానేశాను’’ అని అన్నపూర్ణ చాలా వివరంగా చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Also Read- Naveen Polishetty: అప్పటి ‘జాతిరత్నాలు’, ఇప్పటి ‘అనగనగా ఒక రాజు’.. అంతా నవీనే చేశాడు
వాళ్లు భోజనం చేసే సమయంలో ఈ టాపిక్ నడిచింది. ఇంకా ఎన్నో విషయాలను అన్నపూర్ణమ్మ షేర్ చేసుకున్నారు. ముఖ్యంగా రెస్టారెంట్ వాళ్లు ముందు చిన్న ప్లేట్ వేయడంతో.. ఆమె మాములుగా పంచ్‌లు పేల్చలేదు. ఇంత పెద్ద దానిలో ఎలా తింటారు? అంటూ సరదాగా ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా బాగా వైరల్ అవుతున్నాయి. ఇలా ప్రతి వేదికను వారు ప్రమోషన్ కోసం వాడుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. కచ్చితంగా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని చిత్రయూనిట్ భావిస్తోంది. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్ విజనరీ స్టూడియోస్ పతాకంపై బి. నరేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. బన్నీవాస్, వంశీ నందిపాటి కలిసి తమ నందిపాటి ఎంటర్ టైన్‌మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.
Also Read- Allu Arjun AA23: అట్లీ సినిమా కోసం అల్లు అర్జున్ తో చేయి కలిపిన అతని నలుగురు స్నేహితులు..!