E-Paper
Advertisement

Pakistan Semi-Final Scenarios: శ్రీలంక‌ మ్యాచ్ కు వ‌ర్షం అడ్డంకి..పాకిస్తాన్ నెత్తిన ద‌రిద్రం తాండ‌వం, ఇక టికెట్లు బుక్ చేసుకోవాల్సిందే

Pakistan Semi-Final Scenarios: శ్రీలంక‌ మ్యాచ్ కు వ‌ర్షం అడ్డంకి..పాకిస్తాన్ నెత్తిన ద‌రిద్రం తాండ‌వం, ఇక టికెట్లు బుక్ చేసుకోవాల్సిందే

Pakistan Semi-Final Scenarios:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) నేపథ్యంలో ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ ( Pakistan vs Sri Lanka) మధ్య రసవత్తర ఫైట్ జరగనుంది. పల్లె కేలే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ( Pallekele International Cricket Stadium, Pallekele) వేదికగా పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక మధ్య సూపర్ 8 మ్యాచ్ నిర్వహించనున్నారు. ఇందులో విజయం సాధిస్తేనే పాకిస్తాన్ సెమీఫైనల్ కు వెళ్తుందన్న సంగతి తెలిసిందే.

శ్రీలంకపై సాధారణ విజయం కాకుండా అఖండ విజయాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది. అప్పుడే పాకిస్తాన్ సెమీ ఫైనల్ ( Pakistan Semi-Final Scenarios ) బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంటుంది. కానీ ఇంతలోనే పాకిస్తాన్ కు కొత్త టెన్షన్ మొదలైంది. ఇవాళ జరిగే పల్లె కేలేలో భారీ వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమయ్యే సమయంలో 30 నుంచి 40% వర్షం పడే అవకాశాలు ఉన్నాయట. ఒకవేళ వర్షం పడి మ్యాచ్ రద్దు అయితే… న్యూజిలాండ్ సెమీఫైనల్ కు వెళుతుంది. ఇటు పాకిస్తాన్ అలాగే శ్రీలంక ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది.

Also Read: India Semifinal Qualification Scenario: వెస్టిండీస్ తో జ‌రిగే మ్యాచ్ కు వ‌ర్షం గండం ? టీమిండియా సెమీ ఫైన‌ల్ ఆశ‌లు గ‌ల్లంతేనా !

సెమీ ఫైనల్ లోకి పాకిస్తాన్ అడుగు పెట్టాలంటే ఎలా ?

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటు నేపథ్యంలో పాకిస్తాన్ సెమీఫైనల్ చేరాలంటే శ్రీలంక పై పెద్ద విజయాన్ని నమోదు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ శ్రీలంక పైన 70 పరుగుల తేడాతో విజయం సాధించాలి. ఒకవేళ చేజింగ్ చేస్తే, 10.5 ఓవర్లలో శ్రీలంకను ఓడించాల్సిన అవసరం ఉంది. ఈ రెండిట్లో ఏది జరగకపోయినా పాకిస్తాన్ ఇంటిదారి పట్టాల్సిందే. అప్పుడు న్యూజిలాండ్ సెమీ ఫైనల్ కు వెళుతుంది. కాబట్టి పాకిస్తాన్ కసిగా ఆడితేనే విజయం. లేకపోతే ఇంటి దారి పట్టాలి.

శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కు వర్షం పడితే ఎలా

శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగిస్తే పాకిస్తాన్ కు షాక్ తప్పదు. వర్షం పడి మ్యాచ్ పూర్తిగా రద్దు అయితే శ్రీలంక అలాగే పాకిస్తాన్ రెండు జట్లకు చెరొక పాయింట్ లభిస్తుంది. అప్పుడు పాకిస్తాన్ ఖాతాలోకి రెండు పాయింట్లు మాత్రమే వస్తాయి. న్యూజిలాండ్ ఖాతాలో ఇప్పటికే మూడు పాయింట్స్ ఉన్నాయి. ఈ లెక్కన న్యూజిలాండ్ సెమీఫైనల్ కు వెళ్తుంది. అలా కాదని వర్షం పడకుండా మ్యాచ్ సజావుగా జరిగితే మాత్రం… శ్రీలంక పై భారీ విజయాన్ని నమోదు చేయాలి పాకిస్తాన్. ప్రస్తుత పరిస్థితులలో ఇది అసాధ్యమని తెలుస్తోంది. ఆతిథ్యం ఇచ్చిన శ్రీ లంక జట్టు టోర్నమెంట్ నుంచి వైదొలిగింది. కాబట్టి ఈ చివరి మ్యాచ్ లో విజయం సాధించి ఇంటికి వెళ్లాలన్న కసితోనే ఉంటుంది. కాబట్టి పాకిస్తాన్ కు చుక్కలు చూపించడం గ్యారంటీ అంటున్నారు.

Also Read: Daisy Shah On Palash: పలాష్ ముచ్చల్ చాలా మంచోడు..స్మృతినే కిలాడీ లేడీ ?..బాలీవుడ్ నటి సంచ‌ల‌నం !

 

 

Related News

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Big Stories

×