E-Paper
Advertisement

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి – వారికి వ్యాపారాలలో లాభాలు

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి – వారికి వ్యాపారాలలో లాభాలు
Advertisement

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన ఫిబ్రవరి 28వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

కొన్ని పనులు అనుకూలంగా మారుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగ విషయమై శుభవార్తలు అందుతాయి. గృహమున సంతోషకర వాతావరణం ఉంటుంది. పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగ అవకాశాలు పొందుతారు. 

వృషభం

Advertisement

దైవ చింతన పెరుగుతుంది. వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. కుటుంబ విషయాలలో చిక్కులు కలుగుతాయి. ధనపరంగా ఇబ్బందులుంటాయి. ఖర్చులు అదుపు చేయడం మంచిది. పనులు నిదానంగా పూర్తవుతాయి. ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన విసుగు తెప్పిస్తుంది. 

మిథునం

అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. బంధు మిత్రులతో సఖ్యత కలుగుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి, సమాజంలో ఆదరణ పెరుగుతుంది. వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలిక ఋణాలు తీర్చగలుగుతారు. 

కర్కాటకం

Advertisement

కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. నూతన ఋణాలు చేయవలసి రావచ్చు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలలో అకారణంగా వివాదాలు కలుగుతాయి. నిరుద్యోగులకు అధికారుల నుండి అనుకూలత ఉండదు. ప్రయాణాలలో ప్రమాద సూచనలు.

సింహం

చేపట్టిన పనులలో ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. సమాజంలో పెద్దలతో పరిచయాలు లాభిస్తాయి. ఊహించని ఆహ్వానాలు అందుతాయి. సమాజానికి ఉపయోగపడే పనులు నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఉద్యోగంలో అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. 

కన్య

తండ్రి తరుపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. భూ సంబంధిత వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగ విషయమై కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు రెండు రకాలుగా మారుతాయి. కుటుంబ సభ్యుల ఒత్తిడి అధికమవుతుంది. స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. అనారోగ్య సూచనలున్నవి. వ్యాపార ఉద్యోగాలలో అదనపు పని భారం వలన శ్రమ కలుగుతుంది.

వృశ్చికం

వ్యాపార పరంగా స్థిరమైన నిర్ణయాలు చేయలేరు. చేపట్టిన పనులలో ముందుకు సాగక చికాకులు పెరుగుతాయి. నూతన ఋణాలు చేయవలసి రావచ్చు. కావలసిన వారితో విభేదాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. 

ధనుస్సు

చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. విందు వినోద కార్యక్రమాలకు కుటుంబ సభ్యులతో హాజరు అవుతారు. ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఆలోచనలు కలసి వస్తాయి. నూతన వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఉన్నతి కలుగుతుంది.  

మకరం

దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రాధాన్యత పెరుగుతుంది. నూతన వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు కలసి వస్తాయి. శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. వాహన క్రయ విక్రయాలు లాభిస్తాయి. 

కుంభం

ప్రయాణాల్లో వాహన ఇబ్బందులు ఉంటాయి. నూతన పెట్టుబడులు కలిసిరావు. ఋణ భారం పెరిగి నూతన ఋణాలు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలలో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి. బంధుమిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగాలలో విమర్శలు పెరుగుతాయి.

మీనం

దూర ప్రయాణ సూచనలున్నవి. నిరుద్యోగులకు సామాన్యంగా ఉంటుంది. ఆర్థిక విషయాలలో మిశ్రమ ఫలితాలుంటాయి. ఋణ ప్రయత్నాలు కలిసిరావు. దూరపు బంధువుల నుండి ఒక వార్త విచారం కలిగిస్తుంది. ఆరోగ్య విషయాలలో శ్రద్ద తీసుకోవడం మంచిది.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×