E-Paper
Advertisement

Kalvakuntla Kavitha: ఎన్నికల రోజున పరీక్షలా? కవిత ఆగ్రహం

Kalvakuntla Kavitha: ఎన్నికల రోజున పరీక్షలా? కవిత ఆగ్రహం
Advertisement

Kalvakuntla Kavitha: తెలంగాణలో డిసెంబర్ 14న రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) రాత పరీక్షను తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) నిర్వహిస్తోంది. ఈ రెండు ముఖ్య కార్యక్రమాలు ఒకే రోజు ఉండటంతో వేలాది మంది గ్రామీణ ప్రాంత న్యాయవాదులు తీరని ఇరకాటంలో పడ్డారు.

ఈ విషయంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల రోజే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) రాత పరీక్షనా? వేలాది మంది గ్రామీణ ప్రాంత అడ్వకేట్లు అయితే ఓటుకు లేదంటే ఏపీపీ రాత పరీక్షలకు దూరం కావాలా? అని ప్రశ్నించారు. ఈనెల 14న జిల్లా కేంద్రాలు, హైదరాబాద్‌లో ఏపీపీ పరీక్షలు ఉండటంతో గ్రామీణ న్యాయవాదులు ఓటు హక్కు కోల్పోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే జోక్యం చేసుకొని 14న జరగబోయే ఏపీపీ పరీక్షలను వాయిదా వేసేలా TSLPRBకి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలిఅని తెలిపారు.

Advertisement

గ్రామాల్లో నివసిస్తూ, చిన్న పట్టణాల్లో ప్రాక్టీస్ చేస్తూ ఉన్న వేలాది మంది యువ న్యాయవాదులకు.. ఏపీపీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారిలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాలకు చెందినవారే. పరీక్ష కేంద్రాలు జిల్లా కేంద్రాలు, హైదరాబాద్‌లో మాత్రమే ఉండటంతో వీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు పట్టణాల్లోనే ఉండాల్సి వస్తుంది. ఫలితంగా తమ సొంత గ్రామంలో ఓటు వేసే అవకాశం పూర్తిగా కోల్పోతారు. ఇది కేవలం వ్యక్తిగత సమస్య మాత్రమే కాదు, ప్రజాస్వామ్యానికే మచ్చ. భారత రాజ్యాంగం 326వ అధికరణం ప్రకారం ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఉంది. ఆ హక్కును వినియోగించుకోవడం ఎవరి వల్లనైనా అడ్డుకోబడితే అది రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటే గ్రామీణ ప్రజాస్వామ్యం పునాది. ఈ ఎన్నికల్లో ఓటరు శాతం తగ్గితే స్థానిక అభివృద్ధి, మహిళల రిజర్వేషన్లకు  ఇవన్నీ ప్రభావితమవుతాయి.

Also Read: కడపకు సీఎం రేవంత్‌రెడ్డి, ఓ కేంద్రమంత్రి కూడా, ఎంపీ సీఎం రమేష్ కుటుంబానికి పరామర్శ

Advertisement

ఇప్పటికే తెలంగాణలోని యువ న్యాయవాదుల సంఘాలు, బార్ అసోసియేషన్లు ఈ విషయమై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ రెండు పరీక్షలను వేర్వేరు తేదీల్లో నిర్వహించేందుకు ఎలాంటి అడ్డంకి లేదు. TSLPRB గతంలోనూ పలు పరీక్షలను వాయిదా వేసిన ఉదాహరణలు ఉన్నాయి. అయినా ఈసారి ఎందుకు ఈ పట్టుదల? అంటూ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×