PBKS VS SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 2026 Tournament) భాగంగా ఇవాళ మధ్యాహ్నం కీలక మ్యాచ్ జరగనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ ( Punjab Kings vs Sunrisers Hyderabad) మధ్య 17 వ మ్యాచ్ మధ్యాహ్నం మూడున్నర గంటలకు ప్రారంభం కానుంది. న్యూ చండీగఢ్ లోని మహారాజా యాదవేంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ( Mullanpur, New Chandigarh) వేదికగా ఈ మ్యాచ్ నిర్వహించనున్నారు. దీంతో ఇప్పటికే మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఇలాంటి క్రమంలో విక్టరీ వెంకటేష్ అలాగే బాలీవుడ్ హీరోయిన్ ప్రీతీ జింటా అభిమానుల మధ్య వార్ మొదలైంది. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి.
Also Read: Chahal Smoking: వివాదంలో యుజ్వేంద్ర చాహల్..సిగరేట్ తాగి, నడిరోడ్డుపైనే..ఏం బతుకురా నీది
టాలీవుడ్ అగ్ర హీరో విక్టరీ వెంకటేష్ అలాగే బాలీవుడ్ హీరోయిన్ ప్రీతీ జింటా మద్య వార్ కొనసాగుతోంది. ఈ ఇద్దరు స్టార్ల అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఒకరిపై మరొకరు పోస్టులు పెట్టుకుంటున్నారు. దీనికి కారణం సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ ( Punjab Kings vs Sunrisers Hyderabad) మ్యాచ్ కావడం గమనార్హం. పంజాబ్ కింగ్స్ సహా ఓనర్ గా ప్రీతీ జింటా ఉన్న సంగతి తెలిసిందే. ఇటు విక్టరీ వెంకటేష్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సపోర్ట్ చేస్తున్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎక్కడ మ్యాచ్ ఆడినా కూడా అక్కడే వాలిపోయి, జట్టును ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు విక్టరీ వెంకటేష్.
అయితే ఈ క్రమంలోనే ఇవాళ సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య బిగ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం జరగనుండగా నిన్నటి నుంచి వెంకటేష్ అలాగే ప్రీతీ జెండా మధ్య వార్ మొదలైంది. ఇద్దరు స్టార్ల అభిమానులు సోషల్ మీడియాలో ఒకరిపై మరొకరు పోస్టులు పెట్టుకుంటున్నారు. పంజాబ్ గెలుస్తుందని ప్రీతి జింటా అభిమానులు అంటుంటే.. హైదరాబాద్ గెలుస్తుందని విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. దీంతో ఈ న్యూస్ హాట్ టాపిక్ అయింది.
విక్టరీ వెంకటేష్ అలాగే ప్రీతీ జింటా ఇద్దరు జంటగా 1998 లోనే సినిమా తీశారు. ఆ సినిమా అనే ప్రేమంటే ఇదేరా. రమణ గోకుల సంగీత స్వరాలు అందించిన ఈ సినిమాకు జయంత్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ బంపర్ హిట్ అయి.. భారీగానే కలెక్షన్స్ రాబట్టింది. అయితే, ఇప్పుడు ఈ వెంకీ, ప్రీతీ జింటా అభిమానుల మధ్య వార్ చోటు చేసుకుంది. మరి ఇవాళ్టి మ్యాచ్ సందర్భంగా ఎవరు గెలుస్తారో చూడాలి. గత రికార్డుల ప్రకారం పంజాబ్ పై సన్ రైజర్స్ కు అడ్వాంటేజ్ ఉండనుంది.
Also Read: Vaibhav Sooryavanshi: బుమ్రా, హేజిల్‌వుడ్, భువనేశ్వర్ ఎవడైతే నాకేంటి ? కొడితే అవతల పడాల్సిందే
?igsh=MXJyZ24ycnhpZTY4MA==