E-Paper
Advertisement

సోషల్ మీడియాపై ఏపీ కొత్త చట్టం.. ఇక వాళ్లకి నో ఎంట్రీ

సోషల్ మీడియాపై ఏపీ కొత్త చట్టం.. ఇక వాళ్లకి నో ఎంట్రీ
Advertisement

Social Media Ban: ప్రపంచ మొత్తం చేతిలో కనిపించే టైమ్ ఇది. స్మార్ట్ ఫోన్ల వినియోగంతో మంచీ చెడూ అంతా కళ్లముందు ప్రత్యక్షమవుతుంది. ఫోన్‌ వినియోగం పెరిగిపోయిన తర్వాత చిన్నా పెద్దా… ముసలీ, ముతకా అనే తేడా లేదు.. అందరూ సోషల్ మీడియాలోనే మునిగిపోతున్నారు. కొందరికి ఇదొక వ్యసనంలా మారింది. గంటల తరబడి ఈ సోషల్ మీడియాతో కాలం గడుపుతూ మస్త్‌గా సంపాదించేవారు కొందరున్నారు. అయితే నష్టపోయేవారి సంఖ్యే చాలా ఎక్కువ. అయితే ఎక్కువ మంది రీల్స్, మీమ్స్ అంటూ రాత్రి, పగలు తేడా లేకుండా సోషల్ మీడియా సైట్లలోనే ఉంటున్నారు. ఇందులో టీనేజ్ పిల్లలే అధికంగా ఉన్నారనేది నివేదికలు చెబుతున్నాయి. ఎట్ ది సేమ్ టైమ్.. మన చుట్టూ ఉన్న పరిస్థితులను చూస్తే అర్థమవుతుంది.

ఫోన్ వ్యసనం.. పిల్లల భవిష్యత్తుకు ముప్పు

కొత్త ఆప్షన్లు, ఫీచర్లు, సౌకర్యాలు.. అందుకే తా వినియోగదారులను మరింత ఆకర్షిస్తున్నాయి. అందుకే ఒక్కసారి ఫోన్‌ను పట్టుకుంటే ఇప్పుడున్న పిల్లలు వదలడం లేదు. నిజానికి ఈ అలవాటును పేరెంట్స్‌ మొదట్లో చేస్తారు. మారం చేస్తేనో.. అన్నం తినకపోతేనో.. అల్లరి చేస్తేనో వారి చేతిలో ఫోన్‌ పెట్టేస్తారు. అక్కడ మొదలవుతుంది ఈ అలవాటు. ఆ తర్వాత అది అలవాటుగా.. మరింత ముదిరి ఒక వ్యసనంలా తయారవుతుంది. అదే ఇప్పుడు కొంప ముంచుతుంది. ఒక్కసారి ఈ సోషల్ ప్రపంచంలో మునిగిన పిల్లలు కోల్పోయేది అంతా ఇంతా కాదనే చెప్పాలి. ఎందుకంటే తమ చేతిలోని ఫోన్‌లో కనిపించే ప్రపంచమే నిజమైనదని బలంగా నమ్ముతారు. అదే లోకంగా భావిస్తారు. అనుకరించాలనుకుంటారు. అక్కడే మొదలవుతుంది అసలు సమస్య.

చిన్నారుల కోసం ఏపీ కీలక నిర్ణయం

Advertisement

ఈ సమస్యలను పిల్లలను కాపాడేందుకు ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 13 ఏళ్లలోపు చిన్నారులను సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉంచేందుకు వీలుగా ఒక ముసాయిదా చట్టాన్ని సిద్ధం చేయాలని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లిలో మంత్రుల బృందం, ఉన్నతాధికారులు, మెటా, యూట్యూబ్ వంటి ప్రముఖ సోషల్ మీడియా సంస్థల ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. పిల్లల్లో సృజనాత్మకత దెబ్బతినకుండా వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని చెబుతోంది ఏపీ ప్రభుత్వం. 13 నుంచి 16 ఏళ్లలోపు పిల్లలకు వారి వయసుకు తగిన కంటెంట్‌ను మాత్రమే అందుబాటులో ఉంచేలా విధివిధానాలు రూపొందించాలని సూచించారు.

పిల్లల డిజిటల్ భద్రతపై దృష్టి

పిల్లల డిజిటల్ భద్రతకు సంబంధించి ఆస్ట్రేలియా, సింగపూర్ వంటి దేశాల్లో అమలవుతున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేయాలని అధికారులకు లోకేశ్ సూచించారు. వయసు నిర్ధారణ కోసం డిజిలాకర్‌తో అనుసంధానించిన ఏజ్ టోకెన్ విధానంపై దృష్టి సారించాలని తెలిపారు. సోషల్ మీడియా ప్రభావంపై రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా అవగాహన కల్పించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. సోషల్ మీడియా సంస్థల ప్రతినిధులు కూడా ఏపీ ప్రభుత్వానికి హామీ ఇచ్చారు. సున్నితమైన కంటెంట్‌ను పిల్లలకు దూరంగా ఉంచేందుకు తాము తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యాచరణకు తమ పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

ప్రతి యాప్‌లో ఇండియన్ల హవా

Advertisement

నిజానికి ప్రముఖ సోషల్ మీడియా యాప్‌లు అందులోని మొత్తం యూజర్లు.. అందులోని ఇండియన్ యూజర్స్ కౌంట్ చూస్తే షాకింగ్‌ గా ఉంది. యూట్యూబ్‌కు ప్రపంచవ్యాప్తంగా 49 కోట్ల మంది యూజర్లు ఉంటే.. అందులో ఇండియన్స్ వాటా 33.6 శాతం.. వాట్సాప్‌కు 48.5 కోట్ల యూజర్లు ఉంటే.. 33 శాతం ఇండియన్సే.. ఇలా ఇన్‌స్టాగ్రామ్.. ఫేస్‌బుక్, స్నాప్‌చాట్, లింక్డ్‌ఇన్, రెడ్డిట్, ఎక్స్.. ఇలా అన్నింటిలో ఇండియన్‌ యూజర్స్ కౌంట్ చాలా ఎక్కువ. ఇందులో కాస్త భయపడాల్సిన విషయం ఏంటంటే.. ఇందుటో టీనేజర్స్ సంఖ్య ఎక్కువగా ఉండటం.

మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం

ప్రస్తుతం ఫోన్‌లేని టీనేజర్లు ఉంటారేమో కానీ.. ఫోన్‌ను యూస్ చేయని టినేజర్లు కనిపించడం చాలా అరుదు. స్క్రీన్‌టైమ్ పెరిగిన కొద్ది..సమస్యలు కూడా పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో గడిపే పిల్లల్లో.. యాంగ్జైటీ, ఆందోళన, డిప్రెషన్, జీవితం పట్ల అసంతృప్తి వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయని రీసెర్చ్‌ల్లో తేలింది. అప్పుడప్పుడు సోషల్ మీడియా వాడే పిల్లలతో పోలిస్తే.. ఎక్కువగా వాడే పిల్లలపై ఈ ప్రభావం మరింత తీవ్రంగా ఉంటోందని గుర్తించారు.

అమ్మాయిలపై డిజిటల్ ప్రభావం

సోషల్ మీడియా ప్రభావం అమ్మాయిలపై ఎక్కువగా పడుతోంది. కౌమార దశలో ఉన్న అమ్మాయిలు ఎక్కువగా సోషల్ మీడియాకు ప్రభావితమవుతున్నారు. ఆత్మవిశ్వాసం తగ్గడం, బాడీ ఇమేజ్ సమస్యలు, ఆందోళన, కుంగుబాటు పెరగడం ఎక్కువవుతుంది. సోషల్ మీడియాతో వచ్చే మరో పెద్దఇష్యూ .. సైబర్ బుల్లీయింగ్. ఆన్‌లైన్ వేధింపులు, హానికర కంటెంట్ దీని కిందకే వస్తాయి. ఇవన్నీ కూడా పిల్లలపై మానసిక ఒత్తిడిని పెంచుతున్నాయి. ఇది చిన్న సమస్య కాదని.. పట్టించుకోకుంటే అవి తీవ్ర స్థాయిలో పిల్లలపై పెద్ద సమస్యగా మారతాయి.

సోషల్ మీడియాకు చెక్

ఈ సమస్యలను గుర్తించింది కాబట్టే ఏపీ ప్రభుత్వం పిల్లలకు సోషల్ మీడియాను దూరం చేయాలనే సంచలన నిర్ణయం తీసుకుంది. అలా అయితేనే భవిష్యత్ తరం ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటుందని భావిస్తోంది. ఇప్పటికే ముసాయిదా బిల్లుపై అధికారులు ఫోకస్ చేశారు. త్వరలోనే పూర్తి బిల్లును తయారు చేసి అసెంబ్లీ ముందుకు తీసుకురానున్నారు.

ప్రపంచంలోనే కఠిన నిబంధనలు

చిన్న పిల్లల మానసిక ఆరోగ్యం, ఆన్‌లైన్ భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు సోషల్ మీడియా వాడకంపై కఠినమైన ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ విషయంలో ఆస్ట్రేలియా పేరు లిస్ట్‌లో ఫస్ట్ ఉంది. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన సోషల్ మీడియా చట్టాన్ని తీసుకొచ్చింది ఆస్ట్రేలియానే. 16 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు సోషల్ మీడియా పూర్తిగా నిషేధించింది. తల్లిదండ్రులు అనుమతి ఇచ్చినా సరే, 16 ఏళ్ల లోపు వారు అకౌంట్ ఓపెన్ చేయడానికి వీలు లేదు. అయితే యూట్యూబ్‌ను స్కూళ్లలో ఉపయోగిస్తుండటం వల్ల దాన్ని ఈ నిషేధం నుంచి మినహాయించారు.

ఆస్ట్రేలియా కఠిన హెచ్చరిక

ఆస్ట్రేలియా చేసిన చట్టంలో మరో విశేషం ఏంటంటే.. ఇక్కడ తల్లిదండ్రులతో పాటు.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌కు కూడా ఈ బాధ్యతలను అప్పగించింది. ఒకవేళ నిబంధనలు పాటించకపోతే.. సోషల్ మీడియా సంస్థలకు దాదాపు 50 మిలియన్ డాలర్ల వరకు ఫైన్ వేస్తారు. ఈ రూల్స్ అన్నీ డిసెంబర్ 2025 నుండి అమలులోకి వచ్చాయి.

సోషల్ మీడియాపై కఠిన చర్యలు

ఆస్ట్రేలియా తర్వాత గ్రీస్‌ కూడా ఇదే బాటలో నడిచింది. గ్రీస్‌లో 15 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించకూడదు. పిల్లల్లో పెరుగుతున్న యాంగ్జైటీ, నిద్రలేమి సమస్యలను తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ చట్టం జనవరి 1, 2027 నుండి పూర్తిస్థాయిలో అమలులోకి రానుంది. ఫ్రాన్స్ కూడా పిల్లల డిజిటల్ భద్రత కోసం కొత్త చట్టాన్ని ఆమోదించింది. అయితే ఇది పూర్తి బ్యాన్ కాదు. 15 ఏళ్ల లోపు వారు సోషల్ మీడియా వాడాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. అంతేకాదు స్కూళ్లలో మొబైల్ ఫోన్ల వాడకంపై కూడా అక్కడ ఇప్పటికే నిషేధం ఉంది.

14 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నో ఎంట్రీ

అమెరికా వ్యాప్తంగా కాదు కానీ.. అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు సొంతంగా ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి చట్టాలు చేసుకున్నాయి. ఫ్లోరిడాలో 14 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా అకౌంట్లు ఉండకూడదని చట్టం చేసింది. 14-15 ఏళ్ల వారికి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేసింది. మైనర్లకు సోషల్ మీడియా వాడకానికి తల్లిదండ్రుల అనుమతిని తప్పనిసరి చేస్తూ ఉటా చట్టం తెచ్చింది. ఇక బ్రిటన్‌ కూడా 16 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియాను పరిమితం చేసే ఆలోచనలో ఉంది. ఇంకా చర్చలు జరుగుతున్నాయి. స్పెయిన్, మలేషియా, ఇండోనేషియా కూడా మైనర్ల భద్రత కోసం ఏజ్ వెరిఫికేషన్‌ ప్రక్రియను కఠినతరం చేస్తున్నాయి.

సోషల్ మీడియాపై భారత్ దృష్టి

మరి ఇండియా పరిస్థితి ఏంటి అంటే.. ఈ అంశంపై ఇంకా చర్చలు మాత్రమే నడుస్తున్నాయి. ఇండియాలో ప్రస్తుతం సోషల్ మీడియా వినియోగంపై వయసుకు సంబంధించి ఎలాంటి పరిమితులు లేవు. కానీ పిల్లలు సోషల్ మీడియా వాడటం కరెక్టా.. కాదా అనే దాని మీద చర్చ మాత్రం జోరుగా జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే అంశంపై ఆలోచన జరుపుతోంది.

16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్

సోషల్ మీడియాకి బానిసలవ్వడం కంటే… వాళ్ల చదువులు, శారీరక కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే వాదనలు ఉన్నాయి. సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధిస్తే… సైబర్ బెదిరింపులు, మానసిక ఆరోగ్య సవాళ్లు, అనవసరమైన కంటెంట్‌కు గురికాకుండా పిల్నల్ని, టీనేజర్‌లను కాపాడొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఈ విషయంపై ఆలోచించడమే కాదు.. ఆచరణలోకి తీసుకొచ్చేందుకు అడుగులు వేశాయి. కర్ణాటక 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేసే బిల్లును ఆమోదించింది.

సోషల్ మీడియా బ్యాన్‌పై రెండు వాదనలు

అయితే ఈ బ్యాన్‌పై రెండు వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు ఇలా బ్యాన్ విధించినా ఆచరణ అసాధ్యమని వాదిస్తున్నారు. ప్రస్తుతమున్న టెక్నాలజీని ఉపయోగించి ఈ బ్యాన్‌ను బైపాస్ చేయవచ్చనేది వారి వాదన. దీని కంటే చైనాలో ఉన్నట్లు సోషల్ మీడియా కంటెంట్‌ను నియంత్రించే చర్యలు తీసుకోవడం బెటర్ అనే వాదన వినిపిస్తోంది. ఇక్కడ మరో ప్రధానమైన సమస్య ఇండియన్ పేరెంట్స్. చాలామంది తల్లిదండ్రులు.. సోషల్ మీడియాను టైం పాస్ కోసమే వినియోగిస్తున్నట్లు భావిస్తారనీ… మానిటర్ సరిగా చేయరనే వాదనలు కూడా ఉన్నాయి. ఏదేమైనా ఈ బ్యాన్‌ ఎలాంటి మేలు చేస్తుందనేది రాబోయే కాలంలోనే తెలుస్తుంది. అదే సమయంలో అసలు ఈ ఆలోచన ఎంతవరకు అమలవుతుందనేది కూడా ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది.

Also Read: సంచలనం.. 2029 నుంచి మారిపోనున్న భారత రాజకీయ ముఖచిత్రం.. అసలు ప్లాన్ ఇదే!

Story by: Anup, Big Tv

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×