E-Paper
Advertisement

PCBలో ఆర్థిక సంక్షోభం.. PSL ఆడే ప్లేయ‌ర్ల జీతాలు భారీగా త‌గ్గింపు ?

PCBలో ఆర్థిక సంక్షోభం.. PSL ఆడే ప్లేయ‌ర్ల జీతాలు భారీగా త‌గ్గింపు ?
Advertisement

PSL 2027 Salaries:  పాకిస్తాన్ క్రికెట్ జట్టు (Pakistan cricket team) పరిస్థితి అత్యంత దారుణంగా తయారయింది. ఇంగ్లాండ్ గడ్డపై పేలవమైన ప్రదర్శన కన బరిచిన నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టును అంతర్జాతీయంగా చాలా చీప్ గా ట్రీట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ (Pakistan Super League tournament
) ఆడే ప్లేయర్ల జీతాల విషయంలో కూడా సరికొత్త అంశం తెరపైకి వచ్చింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2027 టోర్నమెంట్ సందర్భంగా ప్లేయర్ల జీతాలను సగానికి పైగా తగ్గించాలని ఓ ఫ్రాంచైజీ ఓనర్ డిమాండ్ చేసేనట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే… పాకిస్తాన్ ఆటగాళ్లతో పాటు విదేశీ క్రికెటర్లకు భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఇప్పటికే పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లో జీతాలు తక్కువగా ఉంటాయని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరింత కోత విధిస్తే, పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ ఆడేందుకు ఎవరు ముందుకు రాబోరని అంటున్నారు.

PCBలో ఆర్థిక సంక్షోభం.. PSL ఆడే ప్లేయ‌ర్ల జీతాలు భారీగా త‌గ్గింపు ?

పాకిస్తాన్ సూపర్ లీగ్ పాలకమండలి ఇటీవల లండన్ లో ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఇందులో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారులు, పీఎస్ఎల్ ఫ్రాంచైజీ యజమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారులతో వాగ్వాదానికి దిగారు ఫ్రాంచైజీ యజమానులు. లీగ్ ఆర్థిక భారం, పెండింగ్ బకాయిలు అలాగే ఆటగాళ్ల ఫీజుల చుట్టూ చర్చ జరగగా… రెండు వర్గాల మధ్య గొడవలు కూడా చోటు చేసుకున్న‌ట్లు నివేదిక‌లు స్ప‌ష్టం చేస్తున్నాయి.

Advertisement

Nasser Hussain slams Mohammad Rizwan: ఒరేయ్ మెంట‌లోడా..టెయిలెండర్స్ కు బ్యాటింగ్ అప్ప‌గించి, చేతులు దులుపుకుంటావా ? రిజ్వాన్ పై విమ‌ర్శ‌లు

పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు రావాల్సిన బకాయిలపై ఫ్రాంచైజీ ఓనర్లను అధికారులు నిలదీశారు. దీంతో ఫ్రాంచైజీ ఓనర్ లందరూ ఏకతాటి పైకి వచ్చి… పాకిస్తాన్ ప్లేయర్లే సరిగ్గా ఆడడం లేదని ఆగ్రహించారట‌. అంతర్జాతీయంగా పాకిస్తాన్ ప్లేయర్లు పేలవమైన ప్రదర్శన కనబరిచిన నేపథ్యంలో… పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంటుకు జనాధారణ రావడం లేదని వెల్లడించారట‌. వాళ్లు సరిగ్గా ఆడితే, డబ్బులు సరిగ్గా ఇచ్చే వాళ్ళమని స్పష్టం చేశారట. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారులు నోర్లు మూసుకున్నట్లు తెలుస్తోంది.

స‌గానికి పైగా జీతాలు క‌ట్..

Advertisement

ఐపీఎల్ టోర్నమెంట్ కు పోటీగా కొనసాగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లో మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే సీజన్ నుంచి ప్లేయర్ల జీతాలను సగాని కంటే తగ్గించాలని ఓ ఫ్రాంచైజీ ఓన‌ర్‌ డిమాండ్ చేశారట. అంతర్జాతీయంగా పాకిస్తాన్ ప్లేయర్లు సరిగ్గా ఆడటం లేదని… ఈ క్రమంలో జీతాలు తగ్గించాల్సిందేనని డిమాండ్ చేశారట. అలాగైతేనే డబ్బులు మిగులుతాయని కూడా పేర్కొన్నారట. దీనిపై పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ యాజమాన్యం కూడా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని ఓకే అయితే.. వచ్చే సీజన్ నుంచి పాకిస్తాన్ ప్లేయర్ల జీతాలు కూడా పూర్తిగా తగ్గే ప్రమాదం పొంచి ఉంది.

Tanveer Ahmed cooked Pakistan cricket team: బాబ‌ర్ లేక‌పోతే ఇంత దారుణంగా ఓడిపోతారా ? ఇక అంద‌రూ వెళ్లి బావిలో దూకండి

Related News

55 ప‌రుగుల‌కే పాకిస్తాన్ ఆలౌట్…ఫాతిమా స‌నా పాత వీడియో వైర‌ల్

సచిన్ వికెట్ తీయాలంటే.. ఆ దేవుడిని పూజించాల్సిందే..బ్రెట్ లీ కామెంట్స్ వైరల్

పాకిస్తాన్ జ‌ట్టులో అంద‌రూ క‌ట్టప్ప‌లే..అందుకే సంక‌నాకిపోతున్నారు

టీమిండియా తిక్క కుదరాలంటే, నఖ్వీకి ఐసీసీ చైర్మన్ పదవి ఇవ్వండి..!

వివాదంగా మారిన టీమిండియా జెర్సీ..కాషాయ రంగుపై విమ‌ర్శ‌లు !

పాకిస్తాన్ కోచ్ లుగా షోయ‌బ్ అక్త‌ర్‌, అఫ్రిదిల‌ను పెట్టుకోండి..!

ఈ టార్చ‌ర్ నా వ‌ల్ల కాదు..ఐపీఎల్ 2027 మ‌ధ్య‌లోనే త‌ప్పుకుంటా !

Big Stories

Advertisement
×