E-Paper
Advertisement

బ‌రితెగించిన‌ PCB…ఐపీఎల్ ను దెబ్బ‌కొట్టేందుకు చైనాతో కుట్ర‌లు !

బ‌రితెగించిన‌ PCB…ఐపీఎల్ ను దెబ్బ‌కొట్టేందుకు చైనాతో కుట్ర‌లు !
Advertisement

PSL 12 Auction In China : పాకిస్తాన్ సూపర్ లీగ్ 2027 టోర్నమెంట్ కు ( Pakistan Super League 2027 Tournament ) సంబంధించిన మెగా వేలం అప్డేట్ వచ్చేసింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ 11వ వేలం చైనాలో ( China) నిర్వహించేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ( Pakistan cricket board) ఆలోచన చేస్తున్నట్టు సమాచారం అందుతోంది. వేదిక మార్చితే విదేశీ క్రికెటర్లు పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ వైపు వచ్చే అవకాశాలు ఉంటాయని మొహ్సిన్ న‌ఖ్వీ ఆలోచన చేస్తున్నారట.

బ‌రితెగించిన‌ PCB…ఐపీఎల్ ను దెబ్బ‌కొట్టేందుకు చైనాతో కుట్ర‌లు !

విదేశీ క్రికెటర్లు పాకిస్తాన్ సూపర్ లీగ్  ( Pakistan Super League  Tournament ) వస్తే, ఐపీఎల్ ను ( IPL) దెబ్బతీయవచ్చని కూడా కుట్రకు తెర లేపుతున్నట్టు ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ మేరకు చైనా ప్రభుత్వంతో చర్చలు కూడా జరుగుతున్నట్లు సమాచారం అందుతోంది. పాకిస్తాన్ అటు చైనా ఇద్దరు ఇండియాను దెబ్బ కొట్టేందుకు ఇప్పటికే చాలా సార్లు కుట్రలకు తెరలేపినట్టు గతంలో వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు పాకిస్తాన్ సూపర్ లీగ్ రూపంలో ఇండియాను దెబ్బ తీయాల‌ని ఈ వేలాన్ని చైనాలో నిర్వహించేలా రంగం సిద్ధం చేస్తున్నట్టు ప్రచారం జోరుగా సాగుతోంది. మ‌రి ఇందులో ఎంత మేర‌కు వాస్త‌వం ఉందో తెలియాల్సి ఉంది.

Advertisement

Sara Tendulkar Birthday Celebration With Team India Odi Captain Shubman Gill : స‌చిన్ కోడ‌లు ముందే సారా, గిల్ రొమాన్స్‌…? షాకింగ్ ఫోటోలు వైర‌ల్

పాకిస్తాన్ సూపర్ లీగ్ వేలం ఎప్పుడంటే ?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కు పోటీగా పాకిస్తాన్ సూపర్ లీగ్ 2027 టోర్నమెంట్ కూడా ముందుకు సాగుతోంది. ఈ టోర్నమెంట్ కు సంబంధించిన మెగా వేలం 2027లో జనవరి 23వ తేదీన నిర్వహించనున్నారు. వాస్తవానికి ఈ టోర్నమెంట్ కు సంబంధించిన వేలం పాకిస్తాన్ లోనే ఏదో ఒక వేదిక పైన నిర్వహించేవారు. కానీ ఈ సారి చైనాకు మార్చాలని అన్ని ఫ్రాంచైజీలు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని మొహ్సిన్ న‌ఖ్వీకి చెప్పడంతో అతడు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

Advertisement

చైనాలో జరిగితే క‌చ్చితంగా ఐపిఎల్ ను దెబ్బతీయగలమని భావించి ఆ దిశగా అడుగులు వేస్తున్నారట. ఈసారి ఎలాగైనా ఐపీఎల్ ఆడాలనుకునే విదేశీ క్రికెటర్లను తమ వైపు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారట. చైనాలో నిర్వహిస్తే ఆ దేశం తమకు సపోర్ట్ ఇస్తుందనే సంకేతం పంపాలని ఈ దిశగా మొహ్సిన్ న‌ఖ్వీ కుట్రలు చేస్తున్నట్టు తెలుస్తోంది. చైనా లాంటి పెద్ద దేశం తమ వైపు ఉన్న నేపథ్యంలో విదేశీ క్రికెటర్లు కూడా పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆడతారని అంచనా వేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా పాకిస్తాన్ సూప‌ర్ లీగ్ 2027 టోర్న‌మెంట్ మార్చి 18 నుంచి మే 2వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది.

Vaibhav Suryavanshi’s father sanjeev Suryavanshi on his son warming benches over gautam gambhir: ఓరేయ్ గంభీర్..ఆ కుర్చీలాట ఆపి, నా కొడుకును ఆడించు !

Related News

ఇదే ఈ మ్యాచ్ ఇండియాలో జ‌రిగుంటే, శ్రీలంక 200ల‌కే ఆలౌట్ అయ్యేది

బ‌వుమా ఉన్న‌ది మూడు ఫీట్లే…వాడికి తిక్క రేగితే 100 అడుగుల లోతులో పాతేస్తాడు

ఫిక్సింగ్ చేసి గెలిచారు…టీమిండియా బ్యాట్ల‌ను చెక్ చేయాల్సిందే

హ్యారీ బ్రూక్ కు ఒళ్లంతా పొగ‌రే…శ్రీలంక ప్లేయ‌ర్ల‌పై ఉమ్మేశాడంటూ ట్రోల్స్‌!

మేం పిచ్చోళ్ల‌మేం కాదు…ఆ కార‌ణంతోనే తిల‌క్ వ‌ర్మను 3వ స్థానంలో పంపాం

న‌మ‌న్ ధీర్ ఎంట్రీ వెనుక ముంబై కుట్ర‌లు ? హార్ధిక్ పాండ్యా కెరీర్ క్లోజ్ అయిన‌ట్టేనా !

ఒక్క మ్యాచ్ లో 859 పరుగులా? హైవే లాంటి పిచ్ లంటూ పాకిస్తాన్ ప‌రువు తీసిన ఇర్ఫాన్ ప‌ఠాన్

Big Stories

Advertisement
×