E-Paper
Advertisement

PV Sindhu And Sharath Kamal: ఒలింపిక్స్ లో.. ఫ్లాగ్ బేరర్స్‌గా సింధు, శరత్ కమల్

PV Sindhu And Sharath Kamal: ఒలింపిక్స్ లో.. ఫ్లాగ్ బేరర్స్‌గా సింధు, శరత్ కమల్
Advertisement

Paris Olympics 2024 Indian Flag Bearers PV Sindhu And Sharath Kamal: విశ్వ క్రీడలు మరో కొద్ది గంటల్లో పారిస్ లోని సెయిన్ నదిలో ప్రారంభం కానున్నాయి. ఇకపోతే  తెలుగు తేజం, స్టార్ షట్లర్ పీవీ సింధు, సీనియర్ టేబుల్ టెన్నిస్ ఆటగాడు శరత్ కమల్ భారత్ తరఫున ఫ్లాగ్ బేరర్స్‌గా ఎంపికయ్యారు. సింధు, శరత్ త్రివర్ణ పతాకాన్ని చేతబూని భారతదేశ ప్రతినిధులుగా మన టీమ్ ముందు నడవనున్నారు.

ఒక్కముక్కలో చెప్పాలంటే ప్రారంభోత్సవంలో భారత బృందాన్ని వీరిద్దరూ నడిపించనున్నారు. ఈ గౌరవం దక్కడం పట్ల సింధు సంతోషం వ్యక్తం చేసింది. ఇది ఏ క్రీడాకారులకైనా ఒకసారే వస్తుందని, ఈసారి నాకు రావడం ఆనందంగా ఉందని తెలిపింది. ఒలింపిక్స్ లో భారత పతకాన్ని పట్టుకుని నడవడం.. నిజంగా ఇదెంతో గర్వకారణమని తెలిపింది.  అయితే శరత్‌కు ఇవి వరుసగా 5వ   ఒలింపిక్స్ కాగా, సింధు మాత్రం వరుసగా మూడో సారి పాల్గొంటుంది.

Advertisement

తెలుగు రాష్ట్రాల నుంచి 8 మంది అథ్లెట్లు

తెలుగు రాష్ట్రాల నుంచి 8 మంది అథ్లెట్లు ఈ విశ్వక్రీడల్లో పాల్గొంటున్నారు. తెలంగాణ నుంచి నిఖత్ జరీన్ (బాక్సింగ్), ఇషా సింగ్ (షూటింగ్), ఆకుల శ్రీజ (టేబుల్ టెన్నిస్), పీవీ సింధు(బ్యాడ్మింటన్) బరిలో ఉన్నారు.

Advertisement

ఆంధ్రప్రదేశ్ నుంచి ధీరజ్ బొమ్మదేవర (ఆర్చరీ), జ్యోతి యర్రాజి (అథ్లెటిక్స్), జ్యోతిక శ్రీ (అథ్లెటిక్స్), సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డి (బ్యాడ్మింటన్) పాల్గొంటున్నారు. ధీరజ్, నిఖత్ జరీన్, సింధు, సాత్విక్‌లపై పతక ఆశలు భారీగా ఉన్నాయి.

Also Read: ఒలింపిక్స్ లో భారత్ ప్రతికూలతలు ఇవే..

భారత కాలమానం ప్రకారం నేడు రాత్రి 11 గంటలకు ప్రారంభ వేడుకలు మొదలవుతాయి. భారత్‌లో స్పోర్ట్స్ 18, 1 ఎస్‌డి, 1 హెచ్‌డి చానెల్స్‌లో లైవ్ టెలికాస్ట్ కానుంది. జియో సినిమా యాప్‌లోనూ ఫ్రీగా చూసే అవకాశం ఉంది.
206 దేశాల నుంచి 10, 500 మంది అథ్లెట్లు, భారత్ నుంచి 117 మంది అథ్లెట్లు బరిలో ఉన్న విశ్వ క్రీడలు నేడు ప్రారంభమై ఆగస్టు 11న ముగియనున్నాయి. నేటిలాగే ఆరోజు కూడా ముగింపు ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి.

Related News

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

Big Stories

Advertisement
×