BigTV English

Best Smartwatches Under 2000: బెస్ట్ స్మార్ట్‌వాచ్‌లు.. రూ.2 వేల లోపు ఇవే..!

Best Smartwatches Under 2000: బెస్ట్ స్మార్ట్‌వాచ్‌లు.. రూ.2 వేల లోపు ఇవే..!

Best Smartwatches Under 2000: పెరుగుతున్న ప్రజల డిమాండ్, ఫిట్‌నెస్‌పై ప్రమోషన్‌ను చూసి అనేక వాచ్ తయారీ కంపెనీలు కూడా వివిధ బడ్జెట్‌లు, ఫీచర్ల స్మార్ట్‌వాచ్‌లను అందిస్తూనే ఉన్నాయి. ఫీచర్లతో కూడిన విభిన్న ధరల స్మార్ట్‌వాచ్‌లు కూడా మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. అదే విధంగా బడ్జెట్ తక్కువగా ఉంటే ఫీచర్ల పరంగా మంచి వాచ్ కొనాలని చూస్తుంటే అది కొంచెం కష్టమైన పని అనే చెప్పాలి. అయితే మీరు కొత్త స్మార్ట్‌వాచ్‌ని రూ. 2000 కంటే తక్కువ బడ్జెట్‌లో కొనుగోలు చేయాలని చూస్తుంటే మార్కెట్‌లో మూడు బెస్ట్ వాచ్‌లు ఉన్నాయి. వాటి ఫీచర్లు, ధరలను వివరంగా తెలుసుకుందాం.


Fastrack Limitless FS2 Pro Smartwatch
మీరు రూ. 2000 బడ్జెట్‌లో స్మార్ట్‌వాచ్‌ని కొనుగోలు చేయాలనుకుంటే ఫాస్ట్రాక్ లిమిట్‌లెస్ ఎఫ్‌ఎస్2 ని కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ సేల్ సమయంలో ఇది 60 శాతం డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. ఫాస్ట్రాక్ లిమిట్‌లెస్ FS2 వాచ్ ధర రూ. 4,995 అయితే అమెజాన్‌లో రూ.1,999కి కొనుగోలు చేయవచ్చు.  ఈ వాచ్‌లో 1.91 అంగుళాల సూపర్ అల్ట్రావు డిస్‌ప్లే, బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్, 100 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లు ఉన్నాయి. IP68 సపోర్ట్ గల స్మార్ట్‌వాచ్ లేటెస్ట్ ATS చిప్‌సెట్‌తో వస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే మీరు ఈ వాచ్‌ని దాదాపు 3 రోజుల పాటు ఉపయోగించవచ్చు.

Noise Colorfit Pulse 2 Max Smartwatch
మీరు తక్కువ బడ్జెట్‌లో నాయిస్ పల్స్ 2 మ్యాక్స్ స్మార్ట్‌వాచ్‌ని కొనుగోలు చేయవచ్చు. దీని అసలు ధర రూ. 6000 అయితే దీని ధరపై 82 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. కాబట్టీ మీరు ఇప్పుడు అమెజాన్ నుండి ఈ స్మార్ట్ వాచ్‌ను రూ. 5,999కి బదులుగా రూ. 1,099కి కొనుగోలు చేయవచ్చు. ఈ బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్ 1.85 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది.ఈ వాచ్  బ్యాటరీ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 10 రోజుల పాటు పనిచేస్తుంది. దీని స్క్రీన్ 550 నిట్స్ బ్రైట్‌నెస్‌తో ఉంటుంది. ఇందులో స్మార్ట్ డిఎన్‌డి, 100 స్పోర్ట్స్ మోడ్‌లు వంటి ఫీచర్లు ఉన్నాయి.


Also Read: Poco M6 Plus 5G: బడ్జెట్ కింగ్.. పోకో నుంచి చీపెస్ట్ 5G ఫోన్.. ధర ఎంతంటే?

Fire Boltt Gladiator Smartwatch
ఈ స్మార్ట్‌వాచ్‌ను 2000 రూపాయల కంటే తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. మీరు 88 శాతం తగ్గింపుతో అమెజాన్ సేల్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ వాచ్‌ అసలు ధర రూ.9,999. అయితే ఇప్పుడు రూ.1,199కి కొనుగోలు చేయవచ్చు. ఈ వాచ్ 1.96 అంగుళాల పెద్ద డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇందులో మీరు 24/7 హార్ట్ బీట్ ట్రాకింగ్, 8 ప్రత్యేకమైన UI ఇంటరాక్షన్‌లు, 123 స్పోర్ట్స్ మోడ్‌లు వంటి ఫీచర్‌లను పొందుతారు. ఈ వాచ్ బ్లూటూత్ కాలింగ్, వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్‌తో వస్తుంది.

Related News

Caviar iphone: అత్యంత ఖరీదైన ఐఫోన్.. రూ.42 లక్షలు ధర.. కొనుగోలు చేయడం అసాధ్యమే?

Infinix GT 30 5G+: రూ.20000 కంటే తక్కువ ధరలో అద్భుత గేమింగ్ ఫోన్.. ఇన్ఫినిక్స్ GT 30 5G+ లాంచ్

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్.. iQOO Z10 టర్బో+ 5G లాంచ్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Big Stories

×