BigTV English

India Disadvantages in Olympics 2024: ఒలింపిక్స్ లో భారత్ ప్రతికూలతలు ఇవే..

India Disadvantages in Olympics 2024: ఒలింపిక్స్ లో భారత్ ప్రతికూలతలు ఇవే..

These are India’s disadvantages in Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ లో మనవాళ్ల ప్రతిభపై భారత ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకుని చూస్తున్నారు. అయితే 117 మంది క్రీడాకారులు 16 అంశాల్లో పోటీ పడుతున్నారు. కాకపోతే వీరిలో పతకాలు తెచ్చే ఆశలున్నవారు కొందరే ఉన్నారు. అయితే ఎప్పటి నుంచో ఒలింపిక్స్ లో మనకు కలిసిరాని, వదిలిపెట్టలేని ఆటలు కూడా ఉన్నాయి. అవేమిటో ఒకసారి చూద్దామా..


భారత బృందంలో అథ్లెటిక్స్‌ నుంచి 29 మంది, షూటింగ్‌ లో 21 మంది, ఇక హాకీ నుంచి 19 మంది ప్లేయర్లు ఒలింపిక్స్‌లో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే 69 మంది అథ్లెట్లలో 40 మంది కొత్తవాళ్లే ఉన్నారు. వీరి ప్రతిభ వస్తే, ఇక్కడే వెలుగులోకి రావాల్సి ఉంది.

ఇక కెరీర్ పరంగా, వయసు పరంగా చివరి ఒలింపిక్స్ ఆడేవారిలో బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు, టెన్నీస్ ప్లేయర్ రోహన్ బోపన్న, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఆచంట శరత్ కమల్, హాకీ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ తదితర ఆటగాళ్లున్నారు.


బాక్సర్లు, రెజ్లర్ల విషయంలో ఏమీ చెప్పలేని పరిస్థితులున్నాయి. వాళ్లు గొడవల్లో పడి కెరీర్ ను పణంగా పెట్టారు. దీంతో వారికి సరైన మ్యాచ్ ప్రాక్టీస్ కొరవడింది, ఇన్నాళ్లూ భారత ప్రభుత్వం ఒలింపిక్స్ కోసం పెద్దగా ఖర్చు చేయలేదు. ఈసారే ఆటగాళ్లకు శిక్షణ కోసం రూ.500 కోట్లు పైనే ఖర్చు చేసింది. ఈ అవకాశాన్ని వీరు దుర్వినియోగం చేసుకున్నారు.

Also Read: విశ్వక్రీడల్లో.. పతకాలు తేగలిగే వీరులు?

ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లు మంచి ప్రదర్శన చేస్తున్నారు. ముఖ్యంగా అవినాష్ ఇటీవల 3 వేల మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో అత్యుత్తమ టైమింగ్‌లో రేసు పూర్తి చేశారు. ఇదొక ఆశావాహ పరిణామంగా ఉంది.

ఇక షూటింగ్‌లో చూస్తే… గత ఒలింపిక్స్‌లో భారత ప్రదర్శన మిశ్రమంగా ఉంది. అదృష్టం కలిసి వస్తే పతకం వస్తుందని అంటున్నారు.

హాకీ జట్టు 41 ఏళ్ల తర్వాత టోక్యో ఒలింపిక్స్ 2020లో కాంస్య పతకం సాధించింది. మళ్లీ ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందా? అని ప్రజలు ఆశగా చూస్తున్నారు.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×