BigTV English

YS Jagan: ప్రజలను మోసం చేయడమే ఆయన పని: జగన్

YS Jagan: ప్రజలను మోసం చేయడమే  ఆయన పని: జగన్

YS Jagan: ప్రజలను మోసం చేయడమే సీఎం చంద్రబాబు పని అని జగన్ ఆరోపించారు. శ్వేతపత్రాల ద్వారా వాస్తవాలు దాచి అసత్య ప్రచారంతో  ప్రజలను నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు.


ఎన్నికల సమయంలో రూ. 14 లక్షల కోట్లు అప్పు చేశారని ఆరోపించిన టీడీపీ, గవర్నర్ ప్రసంగంలో రూ. 10 లక్షల కోట్లు అప్పులని వినిపించినట్లు తెలిపారు. వాస్తవానికి చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చే వరకు రూ. 5.18 లక్షల కోట్లు మాత్రమే అప్పులు చేశామని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన రోజు రూ. 100 కోట్లు మాత్రమే నిల్వ ఉందని గుర్తు చేశారు.

మెనిఫెస్టోలో ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేశామని, డీబీటీ ద్వారా బటన్ నొక్కి రూ. 2.71 లక్షల కోట్లు లబ్దిదారులకు జమ చేశామని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయవలసి వస్తుందన్న భయంతో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టడం లేదని అన్నారు. వెంటనే పూర్తి బడ్జెట్ ప్రవేశ పెట్టారని డిమాండ్ చేశారు.


Also Read: గత ప్రభుత్వంలో ఆర్థిక విధ్వంసం.. శ్వేతపత్రం విడుదల

పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ అమాయకుడు అని జగన్ పేర్కొన్నారు. అతడిపై అక్రమంగా కేసు బనాయించి జైలులో పెట్టారని ఆరోపించారు. వినుకొండ రషీద్ అనే వైసీపీ కార్యకర్తను దారుణంగా హత్య చేశారని తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని పేర్కొన్నారు. నారా లోకేష్ ఏకంగా రెడ్ బుక్ ప్రదర్శిస్తూ బెదిరింపులకు దిగారని అన్నారు. రాష్ట్రమంతా హోర్డింగులు పెట్టి ప్రజలకు ఏం సందేశాలు ఇవ్వదలచుకున్నారో చెప్పాలని వివరించారు.

Related News

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Big Stories

×