E-Paper
Advertisement

5 నిమిషాల వ‌ర్షానికే డ్రైనేజీలా మారిన గ‌డాఫీ..ఇస్త్రీ పెట్టెలతో ఆర‌బెడుతోన్న న‌ఖ్వీ

5 నిమిషాల వ‌ర్షానికే డ్రైనేజీలా మారిన గ‌డాఫీ..ఇస్త్రీ పెట్టెలతో ఆర‌బెడుతోన్న న‌ఖ్వీ
Advertisement

PSL 2026:  పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super League 2026 Tournament) ప్రారంభం అయిన శకునం ఏ మాత్రం బాగా లేనట్లే తెలుస్తోంది. ఈ టోర్నమెంట్ ప్రారంభమైన నుంచి ఏదో ఒక వివాదం తెరపైకి వస్తోంది. మొదట పింక్ బాల్ వివాదం.. ఆ తర్వాత బాల్ టాంపరింగ్ సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇక లేటెస్ట్ గా గడాఫీ స్టేడియంలో ( Gaddafi Stadium, Lahore) వర్షం పడిన నేపథ్యంలో పాకిస్థాన్ పరువు గంగలో కలిసింది. ఐదు నిమిషాల వర్షం కారణంగా గడాఫీ స్టేడియం మొత్తం డ్రైనేజీ లాగా మారిపోయింది. ఇక ఈ స్టేడియాన్ని ఆరబెట్టేందుకు ప్రస్తుతం గ్రౌండ్ మైన్లు చాలా కష్టపడాల్సి వస్తోంది. అటు పిచ్ పై ఉన్నతడిని ఇస్త్రీ పెట్టెలను ఉపయోగించి ఆరబెడుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు , వీడియోలు వైర‌ల్ అవుతున్నాయి.

Also Read: Ball Tampering In PSL 2026 : PSL లో బాల్ టాంపరింగ్..జ‌మాన్‌, షాహీన్ షా, ర‌వూఫ్ పై బ్యాన్..? బ‌జారున ప‌డ్డ‌ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు 

5 నిమిషాల వ‌ర్షానికే డ్రైనేజీలా మారిన గ‌డాఫీ

Advertisement

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ ఇస్లామాబాద్ యునైటెడ్ vs పెషావర్ జల్మీ ( Islamabad United vs Peshawar Zalmi,) మధ్య ఏడవ మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్ ఇవాళ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ లాహోర్ లోని గడాఫీ స్టేడియం వేదికగా మొదట ఈదురు గాలులు సంభవించాయి. ఆ తర్వాత భారీ వర్షం కురిసింది. దీంతో మైదానం మొత్తం చిత్తడి చిత్తడిగా తయారైపోయింది. భారీ వర్షం కారణంగా టాస్ కూడా ఇంకా వేయలేదు. ఈ మ్యాచ్ రద్దయ్యే ఛాన్సులే ఎక్కువ కనిపిస్తున్నాయి.

అయితే ఐదు నిమిషాల భారీ వర్షానికే గడాఫీ స్టేడియం డ్రైనేజీలా మారిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక ఈ స్టేడియాన్ని ఆరబెట్టేందుకు ఇస్త్రీ పెట్టెలు వాడుతోంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇది చూసినా క్రికెట్ అభిమానులు దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. మైదానాన్ని ఆరబెట్టే టెక్నాలజీ సరిగ్గా లేదు… ఇలాంటి పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్..IPL కు పోటీ వస్తుందా ? అంటూ ట్రోల్ చేస్తున్నారు.

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో వరుసగా వివాదాలు

Advertisement

మార్చి 26వ తేదీన ప్రారంభమైన పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ సందర్భంగా వరుసగా వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. బాల్ టాంపరింగ్ నుంచి మొదలు పెడితే ఇవాల్టి వర్షం వరకు అన్ని కాంట్రవర్సీలే. అయితే ఇలాంటి టోర్నమెంట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు పోటీ వస్తుందని పదే పదే పాకిస్తాన్ క్రికెటర్లు చెబుతూ ఉంటారు. అయితే అలాంటి వాళ్లకు కౌంటర్లు ఇస్తున్నారు ఇండియన్ ఫ్యాన్స్. మొదట వర్షం పడితే డ్రైనేజీ వ్యవస్థను సరిగ్గా నిర్వహించడం నేర్చుకోవాలని న‌ఖ్వీకి చురకలు అంటిస్తున్నారు. ఇండియా పైన ఏడవడం కంటే మొదట పాకిస్తాన్ స్టేడియాలను బాగు చేయించుకోవాలని కౌంటర్ ఇస్తున్నారు.

 

 

Also Read: PSL Ball Tampering:  బాల్ టాంప‌రింగ్ పాకిస్తాన్ కు కొత్తేం కాదు..ఇంజమామ్ నుంచి జమాన్ వ‌ర‌కు అంద‌రూ దొంగ‌లే

 

 

 

 

 

Related News

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

Big Stories

Advertisement
×