E-Paper
Advertisement

RR Vs DC : టాస్ గెలిచిన రాజ‌స్థాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

RR Vs DC : టాస్ గెలిచిన రాజ‌స్థాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?
Advertisement

RR Vs DC  : ఐపీఎల్ లో భాగంగా రాజ‌స్థాన్ రాయ‌ల్స్ వ‌ర్సెస్ ఢిల్లీ క్యాపిట‌ల్స్ మ‌ధ్య ఇవాళ మ్యాచ్ జ‌రుగుతోంది. ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ బౌలింగ్ ఎంచుకుంది. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు తొలుత బ్యాటింగ్ చేయ‌నుంది. రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో ఓట‌మి పాలైన ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఈ మ్యాచ్ లో గెల‌వాల‌ని భావిస్తోంది. మ‌రోవైపు చివ‌రి మ్యాచ్ లో విజ‌యం సాధించిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్ అదే ఊపు కొన‌సాగించాల‌ని భావిస్తోంది. మ‌రోవైపు ఢిల్లీ క్యాపిట‌ల్స్ టాస్ గెలిచి ఉంటే ఫ‌స్ట్ బౌలింగ్ తీసుకునే వాళ్ల‌మ‌ని కెప్టెన్ అక్ష‌ర్ ప‌టేల్ పేర్కొన్నారు. టాస్ గెలిచిన రియాన్ ప‌రాగ్ ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎంచుకుని అంద‌రినీ ఒక్క‌సారిగా ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు.

Also Read : RCB Vs GT : గిల్ ఔట్… కోహ్లీ ఓవరాక్షన్ చూడండి

Advertisement

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవ‌డం పై అంద‌రూ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేయ‌డం విశేషం. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కెప్టెన్ రియాన్ ప‌రాగ్ త‌న జ‌ట్టుపై పూర్తి న‌మ్మ‌కంతో ఉన్నాడు. రాజ‌స్థాన్ జ‌ట్టులో య‌శ‌స్వి జైస్వాల్, వైభ‌వ్ సూర్య‌వంశీ బ‌రిలోగి దిగ‌బోతున్నారు. వికెట్ కీపర్ ధృవ్‌ జురెల్‌, డోనోవన్‌ ఫెరీరా, రవీంద్ర జడేజా వంటి హిట్టర్లు జట్టుకు బలంగా మారారు. బౌలింగ్ విభాగంలో జోఫ్రా ఆర్చర్, రవి బిష్ణోయ్, నండ్రే బర్గర్ ఢిల్లీ బ్యాటర్లను కట్టడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే.. కెప్టెన్ అక్షర్ పటేల్ కఠినమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాడు. కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపడుతుండగా నితీష్ రాణా, ట్రిస్టన్ స్టబ్స్ బ్యాటింగ్ భారాన్ని మోయనున్నారు. బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్, మిచెల్ స్టార్క్, టి. నటరాజన్ వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ, గత కొన్ని మ్యాచ్‌లుగా ఢిల్లీ ప్రదర్శన ఆశాజనకంగా లేదు. గత మ్యాచ్‌లో కేవలం 75 పరుగులకే ఆలౌట్ కావడం ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది.

ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ 9 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో 12 పాయింట్లు సాధించి 4వ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే నేరుగా టేబుల్ టాపర్‌గా నిలిచే అవకాశం ఉంది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ 8 మ్యాచ్‌ల్లో కేవలం 3 విజయాలతో 7వ స్థానంలో కొట్టుమిట్టాడుతోంది. ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఢిల్లీకి నేటి విజయం చాలా కీలకం. నేటి మ్యాచ్‌లో ప్రధాన ఆకర్షణ 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ, టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మధ్య జరిగే పోరు. ఇప్పటివరకు ఈ సీజన్‌లో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచిన వైభవ్, కుల్దీప్ మాయాజాలాన్ని ఎలా ఎదుర్కొంటాడన్నది ఆసక్తికరంగా మారింది.

Advertisement

Also Read : VIRAT KOHLI : ఒక్క మ్యాచ్ ఓడినందుకే ఇంత కోపమా..? కోహ్లీ ఓవర్ త్రో పై దారుణంగా ట్రోలింగ్

ఢిల్లీ క్యాపిట‌ల్స్ : 

KL రాహుల్(w), పాతుమ్ నిస్సాంక, నితీష్ రాణా, సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్(c), అశుతోష్ శర్మ, కైల్ జేమీసన్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, T నటరాజన్.

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ : 

యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధృవ్ జురెల్(w), రియాన్ పరాగ్(c), డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, శుభమ్ దూబే, జోఫ్రా ఆర్చర్, రవి బిష్ణోయ్, నాంద్రే బర్గర్, బ్రిజేష్ శర్మ.

 

 

Related News

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

Big Stories

Advertisement
×