E-Paper
Advertisement

RCB VS MI: మీరెక్కిడి దిక్కుమాలిన ఫ్యాన్స్ రా నాయ‌నా.. కోహ్లీ కంటే కంత్రీల్లాగా ఉన్నారే

RCB VS MI: మీరెక్కిడి దిక్కుమాలిన ఫ్యాన్స్ రా నాయ‌నా.. కోహ్లీ కంటే కంత్రీల్లాగా ఉన్నారే
Advertisement

RCB VS MI:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ టోర్నమెంటులో 50 కి పైగా మ్యాచులు పూర్తయ్యాయి. మరో రెండు వారాలు గడిస్తే టోర్నమెంట్ కూడా ముగియనుంది. ఇలాంటి క్రమంలో ఇప్పటికే రెండు జట్లు కూడా ఎలిమినేట్ అయ్యాయి. ఆదివారం రోజున ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Mumbai Indians vs Royal Challengers Bangalore) మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఇందులో చివరి వరకు పోరాడిన బెంగుళూరు విక్టరీ అందుకుంది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ఆసక్తికర సంఘటన మరోటి వెలుగులోకి వచ్చింది. లైవ్ మ్యాచ్ జరుగుతుండగానే స్టేడియంలో విరాట్ కోహ్లీ (Kohli) అభిమానులు తన్నుకున్నారు. ఇద్దరి మధ్య ఏం గొడవ జరిగిందో తెలియదు కానీ.. పోలీసులు ఎంట్రీ ఇచ్చేంత గొడవ చేశారు. ఈ సంఘటన వైరల్ గా మారింది.

Also Read: Yuvraj Singh Yuvraj Singh : స్టేజ్ పైనే మలయాళ నటితో యువ‌రాజ్ రొమాన్స్..ఇంత‌కు ఎవ‌రీ నవ్య నాయర్ ?  

కోహ్లీ జెర్సీ వేసుకుని కొట్టుకుంటున్న ఆర్సీబీ ఫ్యాన్స్‌

Advertisement

రాయపూర్ వేదికగా ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఆదివారం రోజున కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. కానీ చివరికి బెంగుళూరు గెలవడంతో… ముంబై ఇండియన్స్ ఇంటి దారి పట్టింది. అయితే ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో అనేక రకాల సంఘటనలు చోటు చేసుకున్నాయి. స్టేడియంలో విరాట్ కోహ్లీ జెర్సీలు వేసుకొని ఇద్దరు అభిమానులు తన్నుకున్నారు. ఇద్దరి మధ్య ఏం గొడవ జరిగిందో తెలియదు గానీ… ఎడాపెడా కొట్టేస్తున్నారు. జనాలందరూ చూస్తుండగానే రచ్చ రచ్చ చేశారు. అంతలోనే స్టేడియంలో ఉన్న కానిస్టేబుల్స్ వచ్చి.. ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన బెంగుళూరు హేటర్స్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. విరాట్ కోహ్లీ భార్యను ఓ అభిమాని తిట్టి ఉంటాడని… అందుకే ఇద్దరి మధ్య గొడవ జరిగిందని కొంతమంది కామెంట్స్ చేస్తుండగా… విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఎప్పుడూ కూడా ఇలాగే వింతగా, పిచ్చోళ్ల‌లాగా ప్రవర్తిస్తారని మరి కొంతమంది దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

పాయింట్ల పట్టికలో టాప్ లోకి బెంగుళూరు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ముంబై ఇండియన్స్ పైన ఆదివారం బంపర్ విక్టరీ అందుకుంది రాయల్ చాలెంజెస్ బెంగళూరు. ఈ విజయంతో 14 పాయింట్లు సంపాదించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు… పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి చేరుతుంది. అటు హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ ఖాతాలో కూడా 14 పాయింట్లు ఉన్నాయి. అయితే రన్ రేట్… బెంగళూరు కంటే తక్కువగా ఉన్న నేపథ్యంలో తర్వాతి స్థానాలలో సదరు జట్లు నిలిచాయి. ఇవాళ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ ఉంది. ఇందులో ఎవరు గెలిస్తే వాళ్లే టాప్ లోకి దూసుకు వెళ్ళనున్నారు.

Advertisement

Also Read: PAK VS BAN: పాకిస్తాన్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ? జ‌ట్టులో గిల్, అక్ష‌ర్, తిల‌క్ వ‌ర్మ కూడా, వామ్మో ఎందిరా ఇది

 

Related News

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

Big Stories

Advertisement
×