E-Paper
Advertisement

India’s ODI Squad: న్యూజిలాండ్ తో వ‌న్డేలు.. టీమిండియా జ‌ట్టు ప్ర‌క‌ట‌న మ‌రింత ఆల‌స్యం.. అయ్య‌ర్ కు కెప్టెన్సీ !

India’s ODI Squad: న్యూజిలాండ్ తో వ‌న్డేలు.. టీమిండియా జ‌ట్టు ప్ర‌క‌ట‌న మ‌రింత ఆల‌స్యం.. అయ్య‌ర్ కు కెప్టెన్సీ !
Advertisement

India’s ODI Squad: దక్షిణాఫ్రికాతో వన్డే, టి-20 సిరీస్ లు గెలుచుకున్న భారత జట్టు.. 2026 టి-20 వరల్డ్ కప్ టోర్నికి ముందు న్యూజిలాండ్ తో వన్డే, టి-20 సిరీస్ లు ఆడబోతోంది. జనవరి 11 నుండి మొదలయ్యే ఈ సిరీస్.. జనవరి 31 వరకు కొనసాగుతుంది. ఇందులో భారత్ – న్యూజిలాండ్ మధ్య 3 వన్డేలు, ఐదు టి-20 మ్యాచ్ లు జరుగుతాయి. ఈ 8 మ్యాచ్ లు, 8 వేరువేరు వేదికలలో సాగుతాయి.

Also Read: Rohit sharma: రోహిత్ శర్మను ఆటపట్టించిన ఫ్యాన్.. వడాపావ్ అంటూ!

Advertisement

అయితే భారత్ లో జరిగే ఈ వన్డే, టి-20 సిరీస్ కోసం న్యూజిలాండ్ ఇప్పటికే తమ జట్టును ప్రకటించింది. ఇందులో వన్డే సిరీస్ కి మైకేల్ బ్రాస్ వెల్ కెప్టెన్ గా వ్యవహరించబోతున్నాడు. ఇక టి-20 సిరీస్ కి మిచెల్ సాంట్నర్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. అయితే ఇప్పటికే న్యూజిలాండ్ తో తలపడే టీమ్ ఇండియా టీ-20 ప్రకటించిన బిసిసిఐ.. వన్డే జట్టును మాత్రం { India’s ODI Squad} ఇంతవరకు ప్రకటించలేదు.

జట్టు ప్రకటన ఆలస్యం కావడానికి కారణం ఇతడేనా?

భారత్ – న్యూజిలాండ్ మధ్య జరగనున్న వన్డే సిరీస్ కి సంబంధించిన టీం ఇండియా జట్టు ప్రకటన ఇంత ఆలస్యం కావడానికి ప్రధాన కారణం టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్ {Shreyas Iyer} అని సమాచారం. బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం.. శ్రేయస్ అయ్యర్ ఫిట్నెస్ పై ఇంకా స్పష్టత రాకపోవడంతోనే జట్టు ఎంపికను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ {NCA} లో రిహ్యబిలిటేషన్ కొనసాగిస్తున్నాడు. అలాగే నేషనల్ క్రికెట్ అకాడమీ ట్రైనర్స్ పర్యవేక్షణలో శ్రేయస్ అయ్యర్ కఠినంగా శ్రమిస్తున్నాడు. అయితే అతడు గాయం నుంచి చాలా వేగంగా కోలుకుంటున్నాడని సమాచారం. తుది నిర్ణయం కోసం బీసీసీఐ.. ఎన్సీఏ మెడికల్ రిపోర్ట్ కోసం ఎదురుచూస్తుంది. ఈ క్రమంలో టీమిండియా జుట్టు ప్రకటన మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Advertisement

Also Read: england cricketers: పీకల దాకా తాగి దొరికిపోయిన క్రికెటర్లు.. ఇంగ్లాండ్ బోర్డు సంచలన నిర్ణయం

 

అయ్యర్ ఐపిఎల్ ఆడడం అనుమానమే?

తాజాగా కొంతమంది జర్నలిస్టులు సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రేయస్ అయ్యర్ గాయం నుంచి ఇంత త్వరగా కోలుకోవడం అసాధ్యం అని.. అతడు రాబోయే ఐపీఎల్ ఆడటం కూడా అనుమానమేనని వారు పేర్కొన్నారు. శ్రేయస్ అయ్యర్ పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించడానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉందని తెలిపారు. అయితే శ్రేయస్ అయ్యర్ ఫిట్నెస్ పై స్పష్టత వచ్చిన తర్వాతే వన్డే జట్టుపై తుది ప్రకటన ఉంటుందని సమాచారం. అలాగే భవిష్యత్తు టోర్నమెంట్ లపై కూడా బీసీసీఐ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి టీమిండియా జట్టు ప్రకటనకు అయ్యర్ కీలకంగా మారాడు. మరోవైపు ఫ్యాన్స్ మాత్రం శ్రేయస్ అయ్యర్ త్వరగా కోలుకొని మైదానంలోకి రావాలని ఆశగా ఎదురుచూస్తున్నారు.

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

Big Stories

Advertisement
×