E-Paper
Advertisement

New Bajaj Pulsar 150: సరికొత్తగా బజాజ్ పల్సర్.. న్యూ మోడల్ లో క్రేజీ అప్ డేట్స్!

New Bajaj Pulsar 150: సరికొత్తగా బజాజ్ పల్సర్.. న్యూ మోడల్ లో క్రేజీ అప్ డేట్స్!
Advertisement

New Bajaj Pulsar 150: బజాజ్ పల్సర్ 150 దేశంలో మోస్ట్ పాపులర్ 150cc బైక్స్ లో ఒకటి. ఈ బైక్ సరికొత్త అప్ డేట్స్ తో 2026లో విడుదల కాబోతోంది. ఈ అప్‌డేట్‌లో LED లైటింగ్, కొత్త గ్రాఫిక్స్, కార్బన్ ఫైబర్ యాక్సెంట్స్, డిజిటల్ కన్సోల్ లాంటి ఫీచర్లను యాడ్ చేశారు.  2026 బజాజ్ పల్సర్ 150కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధరలు సహా ఇతర వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

ఇంజన్, పెర్ఫార్మెన్స్

కొత్త బజాజ్ పల్సర్ ఇంజిన్ 149.5 cc, సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్, ట్విన్ స్పార్క్ FI DTS-i (ఫ్యూయల్ ఇంజెక్షన్)తో వస్తుంది. 14 PS (10.3 kW) @ 8500 rpm పవర్ , 13.4 Nm @ 6500 rpm టార్క్ ను కలిగి ఉంటుంది.  5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ తో వస్తుంది. మైలేజ్ సుమారు 45-50 kmpl ఇస్తుంది. అఫీషియల్ ARAI సర్టిఫైడ్ 47 kmpl. టాప్ స్పీడ్ సుమారు 110 kmph. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 15 లీటర్లు ఉంటుంది.  ఈ ఇంజన్ పాత DTS-i టెక్నాలజీతో పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్, మంచి ఫ్యూయల్ ఎఫిషియెన్సీ ఇస్తుంది.

డిజైన్, ఫీచర్లు

Advertisement

కొత్త 2026 మోడల్‌ లో స్పోర్టీ డిజైన్ అప్‌డేట్ చేయబడింది. వోల్ఫ్ ఐడ్ హెడ్‌ ల్యాంప్, కొత్త హెడ్‌ లైట్ కౌల్, కార్బన్ ఫైబర్ యాక్సెంట్స్, డ్యాగర్ ఎడ్జ్ ఎడిషన్ గ్రాఫిక్స్, స్ప్లిట్ సీట్, అల్లాయ్ వీల్స్ ను కలిగి ఉంటుంది. ఆల్-LED హెడ్‌లైట్, LED ఇండికేటర్లుతో వస్తుంది. సెమీ డిజిటల్ కన్సోల్, స్పీడోమీటర్, ట్రిప్ మీటర్, ఫ్యూయల్ గేజ్, బ్లూటూత్ కనెక్టివిటీ, USB ఛార్జింగ్ పోర్ట్ తో వస్తుంది. ఫ్రంట్ టెలిస్కోపిక్ ఫోర్క్స్ (37 mm), రియర్ అడ్జస్టబుల్ నైట్రాక్స్ షాక్ అబ్సార్బర్లు (ట్విన్)తో వస్తుంది. సీటింగ్ విషయానికి వస్తే, అప్‌ రైట్ పొజిషన్, కంఫర్టబుల్ రైడింగ్ పోజిషన్ ఉంటుంది.

సేఫ్టీ ఫీచర్లు

బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ 260 mm వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్ విత్ సింగిల్ ఛానల్ ABS, రియర్ 130 mm డ్రమ్ బ్రేక్ (సింగిల్ డిస్క్ వేరియంట్‌లో), లేదంటే 230 mm డిస్క్ (ట్విన్ డిస్క్ వేరియంట్‌లో) లభిస్తుంది. ట్యూబ్‌లెస్ టైర్లు, లాంగ్ వీల్‌బేస్ కోసం మంచి స్టెబిలిటీ, హాలోజెన్/LED లైటింగ్ కోసం మంచి విజిబిలిటీ ఉంటుంది.

కలర్స్

Advertisement

కొత్త బజాజ్ పల్సర్ 150 స్పార్కిల్ బ్లాక్ రెడ్, స్పార్కిల్ బ్లాక్ బ్లూ, స్పార్కిల్ బ్లాక్ సిల్వర్ తో వస్తుంది.

Read Also:  e-యాక్సెస్ TO Hayabusa.. దేశీ మార్కెట్లో లాంచ్ కాబోతున్న సుజుకి బైక్స్ ఇవే!

వేరియంట్లు,  ధరలు

బజాజ్ పల్సర్ 150 కొత్త అప్‌ డేట్‌ తో పాటు ధరలు కూడా కాస్త పెరిగాయి. ధరలు సిటీ , ట్యాక్స్‌ మీద ఆధారపడి మారవచ్చు. ఆన్ రోడ్ ధర ఇంకా పెరుగుతుంది

⦿ పల్సర్ 150 SD: రూ. 1,08,772

⦿ పల్సర్ 150 SD UG: రూ.1,11,669

⦿ పల్సర్ 150 TDఫ రూ. 1,15,000

Read Also:  చిన్న షెడ్డు నుంచి ప్రపంచ యుద్ధాల దాకా, హార్లే-డేవిడ్సన్ చరిత్ర మామూలుగా లేదు భయ్యా!

Related News

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

Big Stories

Advertisement
×