Tanveer Ahmed On Rizwan: పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు సంబంధించిన మాజీ ఆటగాడు తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పొద్దున లేస్తే చాలు.. టీమిండియా అలాగే ఐపీఎల్ పై నోటికి ఏది వస్తే అది వాగడం మాత్రమే అతన పని. టీమిండియా మ్యాచ్ గెలిస్తే ఫిక్సింగ్ అని… ఓడిపోతే చేతకాని దద్దమ్మలు అంటూ విమర్శించడం అతని అలవాటే. అలాంటి పాకిస్తాన్ మాజీ ఆటగాడు తన్వీర్ అహ్మద్ తాజాగా తన సొంత జట్టు గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లాండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ కోల్పోయిన నేపథ్యంలో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భవిష్యత్తులో పాకిస్తాన్ జట్టు తరఫున మహమ్మద్ రిజ్వాన్ ఆడకపోవచ్చు అంటూ బాంబు పేల్చారు.
పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ప్రస్తుతం మూడు టెస్టుల సిరీస్ జరుగుతోంది. ఇందులో అత్యంత చెత్తగా రాణించిన పాకిస్తాన్, మరో టెస్ట్ మిగిలి ఉండగానే సిరీస్ కోల్పోయింది. ఇలాంటి క్రమంలో మహమ్మద్ రిజ్వాన్ ప్రదర్శన పై కూడా పాకిస్తాన్ మాజీ ఆటగాడు తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed ) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంగ్లాండ్ గడ్డపై పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఆడిన ఆట తీరును చూస్తుంటే మహమ్మద్ రిజ్వాన్ భవిష్యత్తులో మళ్లీ క్రికెట్ ఆడటం కష్టమేనన్నారు.
పాకిస్తాన్ జెర్సీలో మహమ్మద్ రిజ్వాన్ కనపడడం కష్టమేనని తేల్చి చెప్పారు. అతడు ఏ ఫార్మాట్ ఆడకుండా తాను కూడా చేస్తానని హెచ్చరించారు. ముఖ్యంగా ఏది చేతకాని దద్దమ్మ లాగా పాకిస్తాన్ క్రికెట్ జట్టులో మిగిలిపోతాడని రిజ్వాన్ పరువు తీశారు. వికెట్ల వెనుకాల ఉంటూ క్యాచ్ లు మిస్ చేయడం, స్టంపింగ్స్ ను వదిలేయడం లాంటివి చేస్తున్నాడని ఫైర్ అయ్యారు. అతని వాలకం చూస్తుంటే… రిటైర్మెంట్ ఇచ్చే వయసుకు వచ్చాడంటూ బాంబు పేల్చారు. అలా కాదని తాను కూడా జట్టు తరఫున బరిలోకి దిగుతానంటే మాత్రం.. పాకిస్తాన్ కు మరో ఓటమి తప్పడానికి హెచ్చరిస్తున్నారు.
టెస్ట్ మ్యాచ్ ఇళ్లలో ఎక్కువ శాతం బాబర్ ఆజం పైన పాకిస్తాన్ ఆధారపడి ముందుకు సాగుతోందని విమర్శించారు. ఒకవేళ బాబర్ ఆజం సరిగ్గా ఆడకపోతే మాత్రం, పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఓడిపోవడం చూస్తున్నట్లు వివరించారు. బాబర్ ఆజం ఆడతాడులే.. మాకెందుకు అన్నట్లుగా పాకిస్తాన్ ప్లేయర్ల వ్యవహారం ఉందని ఫైర్ అయ్యారు. అందరూ కలిసికట్టుగా రాణిస్తేనే పాకిస్తాన్ క్రికెట్ జట్టు విజయం సాధిస్తుందన్నారు. బాబర్ ఆజం ( Babar azam Pak ) కుర్చీ కిందకు నీళ్లు తీసుకొచ్చింది మహ్మద్ రిజ్వాన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.