Joe Root Missed A Century: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ (Team India vs. England) మధ్య ప్రస్తుతం వన్డే సిరీస్ ( India tour of England, 2026 ) జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వన్డే సిరీస్ లో భాగంగా మొన్న జరిగిన మొదటి మ్యాచ్ లో టీమిండియా అద్భుతంగా రాణించి విజయం సాధించింది. అయితే గురువారం జరిగిన సెకండ్ వన్డేలో మాత్రం టీమిండియా అత్యంత దారుణంగా ఓడిపోయింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో విఫలమైన టీమిండియా… ఇంగ్లాండ్ చేతిలో నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ (JOE ROOT) మిస్ చేసుకున్న సెంచరీపై వివాదం రాజుకుంది. అక్కిన్సన్ అనవసరంగా బౌండరీ కొట్టి… రూట్ సెంచరీ మిస్ అయ్యేలా చేశాడు. దీంతో రూట్ కు గస్ అట్కిన్సన్ ( GUS ATKINSON) వెన్నుపోటు పొడిచినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు హార్థిక్ పాండ్యా ( Hardik Pandya) గతంలో ఇలాగే తోటి ప్లేయర్ సెంచరీ కాకుండా అడ్డుకున్న సంఘటనను గుర్తు చేస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు.
టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య కార్డీప్ లోని సోఫియా గార్డెన్స్ వేదికగా రెండవ వన్డే జరిగింది. ఇందులో ఇండియా మొదట బ్యాటింగ్ చేయగా… 233 పరుగులకు కుప్పకూలింది. ఈ లక్ష్యాన్ని కేవలం 44 ఓవర్లలోనే ఇంగ్లాండ్ ఛేదించగలిగింది. ముఖ్యంగా ఇంగ్లాండ్ మిడిల్ ఆర్డర్ ఆటగాడు రూ ట్ 99 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. అతని వల్లే ఇంగ్లాండ్ గెలిచింది. అయితే చివరలో వచ్చిన గస్ అట్కిన్సన్ ( GUS ATKINSON) ఓ సిక్సర్ తో పాటు మూడు బౌండరీలు సాధించాడు. దూకుడుగా ఆడి 99 పరుగుల వద్ద ఉన్న రూట్, సెంచరీ చేసుకోకుండా అడ్డుకున్నాడు. దీంతో రూట్ కు అట్కిన్సన్ వెన్నుపోటు పొడిచాడని… పాండ్యా తరహాలో వ్యవహరించాడని మండిపడుతున్నారు క్రికెట్ ఫ్యాన్స్.
రూట్ సెంచరీ చేసుకోకుండా అక్కని అడ్డుకున్నాడని సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. ఇలాంటి క్రమంలో హార్దిక్ పాండ్యా పేరు తెరపైకి వచ్చింది. అతని తరహాలోనే రూట్ సెంచరీ చేసుకోకుండా అట్కిన్సన్ విలన్ గా మారారని అంటున్నారు. గతంలో 2025 సమయంలో విరాట్ కోహ్లీ 51 సెంచరీ చేసుకోకుండా హార్దిక్ పాండ్యా మరో ఎండ్ లో ఉండి మ్యాచ్ ఫినిష్ చేశాడు. అటు 2023లో తిలక్ వర్మ అర్ధ సెంచరీ చేసుకోకుండా మ్యాచ్ ఫినిష్ చేశాడు పాండ్యా. కేఎల్ రాహుల్ విషయంలో కూడా ఇలాగే జరిగింది. అందుకే పాండ్యా పేరు తెరపైకి వచ్చింది. దీంతో పాండ్యా వల్ల ఇంగ్లాండ్ లో వివాదం రాజుకున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
Joe Root won't spare you Gus Atkinson😭 pic.twitter.com/hpo5tmmoqr
— Homie (@homelander_yyy) July 16, 2026
Gus Atkinson pulls off a Hardik Pandya on Joe Root 😂 😂
Hits a winning 4 when Root was on 99.ENGLAND DEFEATS INDIA BY 4 WICKETS.
A COMFORTABLE WIN. #ENGvIND pic.twitter.com/ChqQwK8hpt— TheFakeFakeer (@TheFakeFakeer) July 16, 2026