E-Paper
Advertisement

RR VS SRH: స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఓట‌మి వెనుక పాకిస్తాన్ కుట్ర‌లు ?

RR VS SRH:  స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఓట‌మి వెనుక పాకిస్తాన్ కుట్ర‌లు ?
Advertisement

RR VS SRH:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) ఎలిమినేటర్ మ్యాచ్ సందర్భంగా సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ (Sunrisers Hyderabad vs Rajasthan Royals ) మధ్య ఆఫ్ బిగ్ ఫైట్ జరిగింది. అయితే ఇందులో తప్పక గెలవాల్సిన హైదరాబాద్ 47 పరుగుల తేడాతో ఓడిపోయింది. వైభవ్ సూర్య వంశీ 97 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడిన నేపథ్యంలో.. హైదరాబాద్ కోలుకోలేకపోయింది. టాప్ ఆర్డర్ విఫలమైన తరుణంలో ఓడిపోయి ఇంటిదారి పట్టింది హైదరాబాద్.

Also Read: Vaibhav-Parag: వైభ‌వ్ పెద్ద హీరో ఏం కాదు..అసూయ బ‌య‌ట‌పెట్టిన‌ రియాన్ ప‌రాగ్, ఇదిగో షాకింగ్ వీడియో 

SRH కొంప‌ముంచింది పాకిస్తాన్ దుర్మార్గులే

Advertisement

ఎలిమినేటర్ మ్యాచ్ సందర్భంగా రాజస్థాన్ రాయల్స్ చేతిలో హైదరాబాద్ ఓడిపోయిన క్రమంలో ఆసక్తికర చర్చ తెరపైకి వచ్చింది. హైదరాబాద్ ఓటమికి పాకిస్తాన్ కారణమంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ది 100 లీగ్ సందర్భంగా పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను (Abrar Ahmed) కావ్య పాప (Kavya Maran) కొనుగోలు చేసిన తర్వాత హైదరాబాద్ జట్టుకు దరిద్రం చుట్టుకుందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు కొంత మంది క్రికెట్ అభిమానులు. అనవసరంగా పాకిస్తాన్ వాడిని కొనుగోలు చేసి.. నెగిటివిటీని హైదరాబాద్ జట్టు కొని తెచ్చుకుందని మండిపడుతున్నారు.

భారతదేశానికి అన్యాయం చేస్తున్న పాకిస్తాన్ దేశానికి సంబంధించిన అబ్రార్ అహ్మద్ ను కొనకూడదని సోషల్ మీడియాలో చాలా మంది మొత్తుకున్నారు. పహల్గామ్ సంఘటన నేపథ్యంలో దాదాపు 22 మంది యాత్రికులను పాకిస్తాన్ దుర్మార్గులు పొట్టన పెట్టుకున్నారు. ఇదంతా జరిగిన కూడా అబ్రార్ అహ్మద్ ను కొనుగోలు చేసి కావ్య పాప తప్పిదం చేసిందని సీరియస్ అవుతున్నారు. ఆ పాపమే ఇప్పుడు హైదరాబాద్ జట్టుకు చుట్టుకుందని దారుణమైన పోస్టులతో రెచ్చిపోతున్నారు. కాగా అబ్రార్ అహ్మ‌ద్ ను స‌న్ రైజ‌ర్స్ లీడ్స్ ఓన‌ర్ గా ఉన్న కావ్య‌, రూ.2.34 కోట్లు పెట్టి కొనుగోలు చేశారు.

హైదరాబాద్ ఓటమికి CSK కూడా కారణం

Advertisement

గ్రూప్ స్టేజిలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై హైదరాబాద్ అద్భుతంగా రానించి గెలిచింది. అయితే గెలిచిన తర్వాత ఎంఏ చిదంబరం స్టేడియంలోనే చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులను కించపరుస్తూ ఇషాన్ కిషన్ రెచ్చిపోయి వ్యవహరించాడు. ధోని చూస్తుండగానే అందరిని వెళ్లిపో అంటూ విజిల్స్ వేశాడు. కావ్య పాప కూడా అదే తరహాలో వ్యవహరించారు. అటు హెడ్ కూడా నోట్లో విజిల్ పెట్టుకొని, దారుణంగా ట్రోల్ చేశాడు. ఈ పాపాలన్నీ ముదిరి.. నిన్న హైదరాబాద్ జట్టును ముంచాయని పేర్కొంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్. కర్మ హిట్స్ బ్యాక్ అంటూ పోస్టులు పెడుతున్నారు. అందుకే మ్యాచ్ గెలిచిన తర్వాత ఓవరాక్షన్ చేయకుండా ఉండాలని సూచనలు చేస్తున్నారు చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు. ఇలా పాకిస్తాన్ తో పాటు చెన్నై సూపర్ కింగ్స్ జట్ల కారణంగా హైదరాబాద్ ఓడిపోయిందని ప్రచారం జోరుగా సోషల్ మీడియాలో సాగుతోంది.

Also Read:  Abdul Razzaq: PSL అల్లా కంటే ప‌విత్ర‌మైన‌ది..ఐపీఎల్ అతిపెద్ద‌ ఫిక్సింగ్ హబ్ Abdul Razzaq: PSL

 

 

 

Related News

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

Big Stories

Advertisement
×