E-Paper
Advertisement

SA vs NZ 1st Semi-Final: ద‌క్షిణాఫ్రికా కొంప‌ముంచిన క్యాచ్‌..వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్స్ కు చేరిన న్యూజిలాండ్

SA vs NZ 1st Semi-Final: ద‌క్షిణాఫ్రికా కొంప‌ముంచిన క్యాచ్‌..వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్స్ కు చేరిన న్యూజిలాండ్
Advertisement

SA vs NZ 1st Semi-Final:   టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament )  విజ‌య‌వంతంగా తొలి సెమీ ఫైనల్ ముగిసింది. ఇందులో అద్భుతంగా రాణించిన న్యూజిలాండ్, ఫైనల్స్ లో అడుగుపెట్టింది. ఈ సెమీ ఫైనల్ లో దక్షిణాఫ్రికాపై అద్భుతమైన విజయాన్ని నమోదు చేసి, రెండోసారి టి20 ప్రపంచ కప్ ఫైనల్స్ కు చేరుకుంది న్యూజిలాండ్. ద‌క్షిణాఫ్రికా విధించిన 169 ప‌రుగుల ల‌క్ష్యాన్ని అవ‌లీల‌గా ఛేదించింది న్యూజిలాండ్‌. 12.5 ఓవ‌ర్ల‌లోనే మ్యాచ్ ఫినిష్ చేసింది కివీస్‌. న్యూజిలాండ్ ఆట‌గాడు ఫిన్ అలెన్ సెంచ‌రీతో చెల‌రేగగా, టిమ్ సీఫెర్ట్ 58 ప‌రుగుల‌తో రెచ్చిపోయాడు. ఈ త‌రుణంలోనే 12.5 ఓవ‌ర్ల‌లోనే 169 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించింది న్యూజిలాండ్. దీంతో న్యూజిలాండ్ ఫైన‌ల్స్ కు చేర‌గా, దక్షిణాఫ్రికా ఇంటి దారి ప‌ట్టింది. ఇక మార్చి 8వ తేదీన న్యూజిలాండ్ వ‌ర్సెస్ టీమిండియా లేదా ఇంగ్లాండ్ తో ఫైన‌ల్స్ ఉంటుంది.

Also Read : BCCI vs PCB Salary Clash: పాకిస్తాన్ క్రికెట‌ర్ల జీతాలు ఎంతో తెలుసా ? టీమిండియా ప్లేయ‌ర్ల కాలిగోటికి కూడా స‌రిపోవా

33 బంతుల్లోనే ఫిన్ అలెన్ సెంచ‌రీ

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా బుధవారం న్యూజిలాండ్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య తొలి సెమీ ఫైనల్ జరిగింది. కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ సెమీఫైనల్ మ్యాచ్ నిర్వహించారు. ఇందులో దక్షిణాఫ్రికా మొదట బ్యాటింగ్ చేసింది. ఈ సందర్భంగా 169 పరుగులు సాధించింది దక్షిణాఫ్రికా. ఈ లక్ష్యాన్ని కేవలం 12.5 ఓవర్లలోనే ఫినిష్ చేసింది న్యూజిలాండ్. దీంతో ఫైనల్స్ లో అడుగుపెట్టింది కివీస్. అయితే చేజింగ్ చేసే క్రమంలో న్యూజిలాండ్ ఆటగాడు ఫిన్ అలెన్ ( Finn Allen ) భయంకరమైన ఇన్నింగ్స్ ఆడాడు. 303 స్ట్రైక్ రేట్ తో ఫిన్ అలెన్ సెంచరీ ( FINN ALLEN Century ) చేశాడు. కేవలం 33 బంతుల్లోనే 8 సిక్సర్స్ కొట్టిన ఫిన్ అలెన్, పది బౌండరీలు సాధించాడు. ఈ క్రమంలోనే చివరి బంతికి బౌండరీ కొట్టి సెంచరీ కూడా ఫినిష్ చేసుకున్నాడు ఫిన్ అలెన్. అటు మరో ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ 33 బంతుల్లో 58 పరుగులు చేసి ఫిన్ అలెన్ కు మంచి సపోర్ట్ గా నిలిచాడు.

దక్షిణాఫ్రికా కొంపముంచిన వివాదాస్పద క్యాచ్

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ సెమీ ఫైనల్ నేపథ్యంలో దక్షిణాఫ్రికా కొంపముంచింది ఐడెన్ మార్క్‌రమ్ క్యాచ్. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ మొదటి బౌలింగ్ చేయగా దక్షిణాఫ్రికా ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ నేపథ్యంలోనే, మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 169 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ అలాగే మిడిల్ ఆర్డర్ దారుణంగా విఫలమైన నేపథ్యంలో దక్షిణాఫ్రికా భారీ స్కోర్ చేయలేకపోయింది. దీనికి తోడు దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్‌రమ్ క్యాచ్ ఔట్ కూడా వివాదంగా మారింది. న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్ర వేసిన ఓ అద్భుతమైన బంతికి ఐడెన్ మార్క్‌రమ్, డారెల్ మిచెల్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. అయితే ఐడెన్ మార్క్‌రమ్ ఇచ్చిన క్యాచ్ ను పట్టుకునే క్రమంలో, బంతిని నేలకు తగిలేలా మిచెల్ అందుకున్నాడు. కానీ థర్డ్ అంపైర్ మాత్రం ఐడెన్ మార్క్‌రమ్ ఔట్ అంటూ ప్రకటించేశాడు. ఇది ఔట్ కాదని… సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.

Advertisement

Also Read: Ban On Sanju Samson: సంజుపై ఐసీసీ నిషేధం…సెమీ ఫైన‌ల్ నుంచి ఔట్, ఆ హెల్మెటే కొంప‌ముంచిందా ?

 

 

 

 

 

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

Big Stories

Advertisement
×