E-Paper
Advertisement

Sahibzada Farhan: బుమ్రా బౌలింగ్ లో 6 సిక్సులు కొడ‌తాం, 32 గంట‌ల సినిమా చూపిస్తాం

Sahibzada Farhan: బుమ్రా బౌలింగ్ లో 6 సిక్సులు కొడ‌తాం, 32 గంట‌ల సినిమా చూపిస్తాం
Advertisement

Sahibzada Farhan: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) నేపథ్యంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( India vs. Pakistan) మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. సరిగ్గా శివరాత్రి రోజున ఫిబ్రవరి 15వ తేదీన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య బిగ్ ఫైట్ జరుగుతుంది. కొలంబో వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య మాటల యుద్ధం ఇప్పటికే మొదలైంది. ఈ మ్యాచ్ లో తమదే విజయమంటూ రెండు జట్లు విర్రవీగుతున్నాయి. ఐసీసీ టోర్నమెంట్స్ రికార్డులు పరిశీలిస్తే.. పాకిస్తాన్ పైన ఇండియాకు ఎక్కువగా విజయాలు ఉన్నాయి. దీంతో టీమిండియా ఫుల్ కాన్ఫిడెన్స్ తో బరిలోకి దిగుతోంది. అటు ఇండియా నే ఎలాగైనా ఓడించి ప్రతికాలం తీర్చుకుంటామని పాకిస్తాన్ చెబుతోంది. ఇలాంటి నేప‌థ్యంలో ఫాస్ట్ బౌల‌ర్ బుమ్రాను ( Jasprit Bumrah) కెరీర్ నాశ‌నం చేస్తాన‌ని సాహిబ్‌జాదా ఫర్హాన్ ( Sahibzada Farhan) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

Also Read: BAN – T20 WC Boycott: మా బంగ్లాదేశ్ క్రికెట‌ర్లు చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌లు, పిరికి స‌న్నాసులు..మాట మార్చిన ఆసిఫ్ నజ్రుల్

బుమ్రా బౌలింగ్ లో ఆరు సిక్సర్లు.. ఫర్హాన్ సంచలనం

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇలాంటి నేపథ్యంలో బుమ్రా బౌలింగ్ లో ఆరు సిక్సర్లు కొట్టాలని పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ కు సూచనలు చేస్తున్నారు అభిమానులు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జట్టుతో పాకిస్తాన్ మ్యాచ్ ఆడుతున్న సందర్భంగా బౌండరీ గేటు దగ్గర సాహిబ్‌జాదా ఫర్హాన్ ( Sahibzada Farhan) ఫీల్డింగ్ చేశాడు. ఈ సందర్భంగా బుమ్రా బౌలింగ్ లో ఆరు సిక్సర్లు కొట్టాలని… దాంతో వాళ్లకు 32 గంటల సినిమా చూపించాలని రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం చేశారు పాకిస్తాన్ అభిమానులు. వెంటనే దానికి రియాక్ట్ అయిన సాహిబ్‌జాదా ఫర్హాన్.. కచ్చితంగా ఇండియాకు చుక్కలు చూపించడమే అంటూ సిగ్నల్స్ ఇచ్చారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక అటు ఓ ఇంట‌ర్వ్యూలో కూడా బుమ్రాను ( Jasprit Bumrah) కెరీర్ నాశ‌నం చేస్తాన‌ని సాహిబ్‌జాదా ఫర్హాన్ ( Sahibzada Farhan) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఆసియా కప్ లో బుమ్రా బౌలింగ్ ను చీల్చి చెండాడిన ఫర్హాన్

ఆసియా కప్ 2025 టోర్నమెంట్ సందర్భంగా బుమ్రా బౌలింగ్ లో ఫర్హాన్ సిక్సర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా 34 బంతులు ఎదుర్కొన్న ఫర్హాన్ ఏకంగా 51 పరుగులు సాధించాడు. అంతేకాదు 400 బంతుల‌ తర్వాత బుమ్రా బౌలింగ్ లో సిక్సర్ కొట్టిన పాకిస్తాన్ క్రికెటర్ గా ఫర్హాన్ చరిత్ర సృష్టించాడు. బుమ్రా వేసిన బౌలింగ్ లో ఏకంగా మూడు సిక్సర్లు ఫర్హాన్ కొట్టాడు. దీంతో ఇప్పుడు వరల్డ్ కప్ లో కూడా ఫర్హాన్ బౌలింగ్ లో ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొడతాడని అంటున్నారు పాకిస్తాన్ అభిమానులు.

Advertisement

Also Read: Trolls on Usman Tariq: ఐసీసీ కళ్లు మూసుకుపోయాయా ? ఉస్మాన్ తారిక్ పై బ్యాన్ వేయండి..USA, శ్రీలంక ఫ్యాన్స్ ట్రోలింగ్‌

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×